Monday, January 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూడేళ్ళ ముచ్చటైన ముద్దుల పాపకు ఆశీరభినందనం

బుడిబుడిబుడి తొలి అడుగుల శ్రీ

రాగరమ్య సంస్థకు జన్మదిన శుభకామనం


1.బహుముఖీయమై జనరంజకమై

విద్యావైజ్ఞానిక సామాజిక సేవా కళా రంగాత్మకమై

సాంస్కృతిక గగనంలో వెలిసింది సప్తవర్ణాల హరివిల్లై

సప్తస్వర సంగీత లోకాన కురిసింది రమ్య రాగాల రస జల్లై


2.పలురంగాల ప్రముఖులు చేయూతనీయగా

కవన గాన నృత్య కారులకు

వేదికనందీయగా

విజయవంతమొనరించెను పెక్కు కార్యక్రమాలను

తురుముకుంది మకుటాన కలసాకారమవగ నెమలీకలను

 నిన్నే దేవిగ కొలిచాను ప్రణయ దేవిగ నిలిపాను

నిన్నే నిన్నే మెచ్చాను నీకే హృదయము నిచ్చాను  

ఎంతో తపన పడ్డాను ఎంతటి తపమో చేసాను

కనికరించవే ప్రాణేశ్వరి శుభకరించవే ప్రణయేశ్వరి

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి


1.నీరూపం నా మదిలో నీ తలపే మేధలో

కలలొ నిను కంటున్నా ఎదలొ నిను వింటున్నా

ఎవ్వరు నాకెదురైనా నీవుగానె భావిస్తున్నా

నిరంతరం నీ నామమే మనసులో స్మరిస్తున్నా

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి


2.అక్షరాల పూలతో అర్చనలే చేస్తున్నా

గీతాల మాలలనే నీ మెడలో వేస్తున్నా

గాలి కదలాడినా నీరాకను తలపోస్తున్నా

ఉఛ్ఛాసనిశ్వాసలలో ఊపిరిగా చేసుకున్నా

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి

 రచన,స్వరకల్దన&గానం:డా.రాఖీ


కనుల నుండి కురుస్తోంది వెన్నెల జల్లు

కనుబొమలే ఎక్కడిన మరుని విరుల విల్లు

నీ ఒళ్ళే  విరిసిన హరివిల్లు 

నీ మేనే  విరిచిన హరువిల్లు 

వందనమందును నీ అందానికి

ఆనందమొందెద నీతో బంధానికి


1.పెదవుల మందార మరందాలు

నీ ఎదన పూమంజరి చందాలు

నడుమున నాగావళి వంశధారలు

నడకలు మరాళ మయూరాల సౌరులు

వందనమందును నీ అందానికి

ఆనందమొందెద నీతో బంధానికి


2.కురులలో ఉరికేను కృష్ణవేణి

నుడులలో కదిలేను గోదావరి

పదపదమును పదేపదే అదే ఉపమానము

దనివారదు కనరుండదు నీ గురించి కవనము

వందనమందును నీ అందానికి

ఆనందమొందెద నీతో బంధానికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను

రేయ పగలు నిన్నే ధ్యానించుదానను

నీ పదముల మనెడి ఓ ఇసుకరేణువును


1.నీ కటాక్ష వీక్షణకై నిరీక్షించుచున్నాను

నీ దయాదృక్కులకై పరితపించుచున్నాను

ఎప్పుడు నను కనికరింతువో

అక్కున నన్నెప్పుడు జేర్చుకొందువో


2.నాలోనికి నిన్ను ఆవహన చేసెద

నను నీవుగ భావించి అభిషేకించెద

నాదనుకొను ఏదైనా నీకు సమర్పించెద

మనసావాచాకర్మణా దేవిగ నిను నమ్మెద

ఏమౌతోందీ కౌమారదశ -ఎటుపోతున్నది ఈ వ్యవస్థ

ప్రేమరాహిత్యంలో వింతైన పైత్యంలో

అనురాగాలను బలిచేసి-అనుబంధాలకు శిలువేసి

నైరాశ్యంతో అడుగులు వేస్తూ-వైషమ్యాలను పెంపొందిస్తూ

తెలిసీతెలియని వయసులో-ఫలితం ఎరుగక దురుసుగా

గమ్యమేదో గ్రహించకుంది వక్రదారుల పయనిస్తోంది


1.అమ్మానాన్నలు దూరమై-ఆలన పాలన కరువై

అనాథలల్లే అభాగ్యులల్లే క్రష్ లలో క్రష్షై

ఖైదీలమాదిరి వెలివేసిన సరి హాస్టళ్ళలో  రోస్టై

ప్రేమరాహిత్యంతో పెడదారులు పట్టి

వింతైన పైత్యంతో వ్యసనాలు చుట్టిముట్టి

మంచికి చెడ్డకు తేడా తెలియక

తప్పొప్పులకు అసలే జడవక

నేర ప్రవృత్తికి చేరువై నడవడికే చెడి కౄరులై


2.ఫ్రెండ్షిప్ అనే ముంచే నౌకనెక్కుతూ

బర్త్ డే పార్టీ పేరిట పీకలు నొక్కుతూ

పబ్బులు రేవ్ పార్టీలంటూ డబ్బులు కక్కుతూ

చిన్నచితకా చైన్ స్నాచింగ్ తెఫ్ట్ ల్లో చిక్కుతూ

డేటింగ్ రైడింగ్  ఫైటింగ్ లంటూ తిరుగుతూ

 బెట్టింగ్  డ్రగ్స్  మాఫియాలకు మరుగుతూ 

ఆక్సిడెంట్ సూసైడ్ మర్డర్లలొ కనుమరుగౌతూ