కష్టాల కడలిలో
శిథిలమైన నావలో
ఎన్నాళ్ళు సాగునో
నా జీవితం
తప్పుకోను వీలులేదు
దూకినా ఈత రాదు
తీరమే కానరాని
ఈ పయనం
1.ఎంతకు తెగని
చీకటి రేయి
ముంచెత్తేలా
తుఫాను గాలి
చేజారి పోయింది
ఆశల చుక్కాని
చుక్కైనా చూపకుంది
తూరుపు దిక్కుని
2.అలలే చెలరేగి
చెరిపాయి కలలనెన్నో
మింగచూస్తున్నాయి
తిమింగలాలెన్నో
రాసిపెట్టి ఉన్నాకా
అద్భుతాలు జరుగవా
నావికులెదురొచ్చి
గమ్యాన్ని చేర్చరా