Thursday, March 30, 2023



https://youtu.be/cXTyo22Vmtk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


పెండ్లాడెను సీతమ్మను-సాకేత రామయ్య 

శివుని విల్లు విరిచేసి మా జానకమ్మ మనసు గెలిచేసి

చూడముచ్చటే కనే కండ్లకు ఆ సుభ లగ్గం

సంబరంగ కంటూఉంటే తలనింక తిప్పుటకొగ్గం


1.రాజాధిరాజులు వీరాధివీరులు

నెగ్గక సిగ్గుతొ తలదించుకొన్న మిథిల పేరోలగం

రాఘవుని సూరత్వముగని వలచిన వైదేహి

వరమాల బూని సిగ్గుతొ తలవంచుకొన్న వైనం

పూలవానలు కురిసెనంతట నీలినీలి ఆ గగనం

కనులకింపుగ జరిగేను సీతారాముల కళ్యాణం


2.తరలివచ్చిరి తండ్రి దశరథుడు రాముని తమ్ములు

మునులు జనులు ముక్కోటి దేవుళ్ళు వేడ్క చూచిరి ఆ మనువును

జనకుడు దారబోయంగ సీతతొ నలుగురు కూతుళ్ళను 

రాముడాతని తమ్ములుమువ్వురు మనువాడిరి వాళ్ళను

రాముడు-మైథిలి భరతుడు-మాండవిలు  జంటగా

దంపతులైరి సౌమిత్రి ఊర్మిళ శత్రుఘ్ను శ్రుతకీర్తి  కనుల పంటగా