Monday, September 27, 2021

https://youtu.be/tdmpak6wjIY?si=RMpgk8MFWxotK7dD

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:ముఖారి

ఇంటి ముందే శివా నీ పంచాయతనం
కంటి ముందే హరా చంద్రశేఖరా నీ దివ్య దర్శనం
నీసన్నిధిలోనే గడిచె అనుదినం నా బాల్యం
ఇంతకుమించీ అవసరమా పొందగ కైవల్యం

1.నమచమక స్తోత్ర సహిత నిత్యాభిషేకాలు
హరహర మహాదేవాయను నీ నామ శ్రవణాలు
నిను కీర్తించే వేద పారాయణాలు
మై మరచి ప్రవచించే నీ పురాణాలు

2.ఉత్సవాలందున నీ లీలల హరికథలు
పర్వదినాలలో నీ సంతత సంకీర్తనలు
సోమవారాలలో ప్రదోషోపవాసాలు
ఐహికా ముష్మికమౌ వాదోపవాదాలు


OK

నువ్వంటే పిచ్చేమరి కొందరికి

నువ్వంటే నచ్చవు మరికొందరికి

సాయి నిన్ను సాయబుగా చూస్తారెందుకో

సాయి నీకు మతమంటగడతారేలనో

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


1.రోగాలు రుగ్మతలు ఎడబాపిన వైద్యుడవే

ద్వేషవైషమ్యాలు పోకార్చిన సిద్ధసాధ్యుడవే

మానవాళికంతటికీ నిత్య ఆరాధ్యుడవే

జీవకారుణ్య వ్యాప్తికి సాయి నీవు ఆద్యుడవే 

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


2.పిలిచినంత పలికేవని నుడివెదరెందరో

తలచినంత ఎదుట నిలుతువందురెందరో

నిన్ను నమ్మి నేను సొమ్ముచేసుకున్నదేమిటని

స్పష్ట పరచు ఇకనైనా అభీష్టమొకటి తీర్చెదవని

మానవీయ విలువ తెలుపు మహనీయుడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే