Thursday, January 12, 2023


https://youtu.be/8qIaolh_GVI

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


గానము రమణీయము

గానము కమనీయము

గానమెపుడు శ్రవణపేయము

గానమే అమృత పానీయము

సంగీతజ్ఞులకు అనుభవైకవేద్యము


1.గానమనగ సామవేదము

గానము ఓంకార నాదము

గానము సప్తస్వర సంభవము

గానము సరస హృదయ రవము

రసపిపాసులచే  ప్రశంసనీయము


2.శిశుర్వేత్తి పశుర్వేత్తి గానము

  సర్వరోగ ఔషధము గానము

  నారద తుంబురు ప్రియగానము

  ప్రాణప్రదమే సర్వదా నాకు గానము

  మనసా వచసా శిరసా మాననీయము

 https://youtu.be/1u-gf2tx4eE?si=cBbUnqWS7nNukuem


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక


అక్షర కుసుమాలతో అర్చించెదను

సలలిత పద మాలతో ఆరాధించెదను

గేయాల పాయసాన్ని నైవేద్యమిడెదను

నీ చరణదాసునిగా నను మననీయమని వేడెదను

తన్మయముగ ఎలుగెత్తి భారతీ నీ గీతి పాడెదను


1.హంసవాహినీ మాతా పుస్తక హస్తభూషిణి

కర మాలాధారిణి వాణీ శ్వేతాంబర శోభిణి

వాగ్రూపిణి పారాయణి వేదాగ్రణీ విధిరాణీ

కరుణామృతవర్షణి మేధావిని మాం పాహి సనాతని

వీణాపాణి మంజుల వాణి


2.మిడి మిడి జ్ఞానము మా పూర్వజన్మ పాపము

వికృత ప్రేలాపనం మా కుత్సిత కుంచిత నైజము

పుట్టుకలో తల్లిదండ్రలనే ప్రశ్నించే నికృష్ట వైనము

ప్రక్షాళనచేయవే స్థాయినిమించిన మా కుతర్క వాదము,వితండ వాదనము