https://youtu.be/iHdqMeMKZ9w?si=renWtd-PIFeSxd_8
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఖరహర ప్రియ
జయము నీకు జగన్నాథ వేంకటేశ్వరా
జయవిజయులు నీ భృత్యులు జగదీశ్వరా
అబ్జదళనేత్ర నీ పదాబ్జముల శరణంటిరా
కుబ్జను దయతో బ్రోచిన హరీ ననుపాలింపరా
1.దుర్జనులను నిర్జించే అర్జున రథ సారథీ
సజ్జన పక్షపాతివే ప్రభూ పక్షి వాహన ప్రణతి
ముజ్జగములు కొలిచేటి అలమేలు మంగపతి
నను చేర్చుము వేగిరముగ స్వామి కైవల్య గతి
2.రుజలను బాపగలుగు వైద్య ధన్వంతరి
ప్రజలను ప్రేమ మీర ఆదరించు మురారి
శత్రు భంజనా విప్ర వినుత నిరంజనా శౌరి
ప్రభంజన సూన వందిత వందనమ్ము మనఃసంచారి