https://youtu.be/dig29bXPUJs
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
చిత్తకార్తి కుక్కకన్నా హీనం
గోతికాడి నక్కకన్నా నీచం
ఒక్కటైనా లేదు నీలో మనిషి లక్షణం
భువికి భారం నీఉనికిఘోరం ఏ క్షణం
1.ఏకపత్నీ వ్రతుడు రాముని జన్మభూమి ఇది
చతుర్విధ పురుషార్థాలను ఆచరించే
పుణ్యస్థలమిది
నా దేశం ప్రపంచానికే ఆదర్శం
నా దేశం అంటేనే విశ్వసందేశం
సతి అనుమతి లేనిఎడల ధర్మరతియూ నేరమే
బలాత్కారం మానభంగం పరులపై అతి క్రూరమే
2.వావి వరుసలు జాలి కరుణలు నీకడ మృగ్యమే
మానవీయ విలువలన్నవి ఎరుగనీ
వికృత మృగమువే
నీవు చేసే భీభత్సం మెచ్చదే సమాజం
నీది ఎంతటి కుత్సితం మారదా నైజం
మాటు వేసి వేటాడే అకృత్యాలే దారుణం
చట్టరీత్యా తగినశాస్తిగ శిక్ష ఒకటే నీకు మరణం