Wednesday, September 1, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


ఒక బొమ్మకు ప్రాణం పోసావు-ఒక అమ్మకు దైన్యం తీర్చావు

ఒక భక్తుడి నెత్తురు వైనావు-ఒక తండ్రికి అండగ నిలిచావు

సాయని పిలిచినంత ఓయని బదులిచ్చావే

బాబా అని వేడినంత ఇడుములు తొలగించావే

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


1.నోరుతెరిచి ఏనాడు కోరింది లేదు నిన్ను

చేయిసాచి ఇది ఇమ్మని అడిగానా మున్ను

దర్శంచుకొన్నాము షిరిడీ పురమునందు

నిను నిలుపుకొన్నాము మా ఉరము నందు

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


2.రాసాను ఎన్నెన్నో పాటలు నిను కీర్తిస్తూ

చేసాను భజనలెన్నొ నిను ప్రార్థిస్తూ

మోసాను గురువారం నీ పల్యంకికను

వేచాను నీ దయకై ఆర్తి మీర ఇంకనూ

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


మీరు నుండి నీవులోకి జారిపోతిమే

నీవూ నేనూ ఒకటిగా మారిపోతిమే

పరస్పరం భావాలను పంచుకొంటిమే

 కొత్తదైన బంధమొకటి చాటిచెబితిమే

నా ప్రాణదీపమా నా మనో రూపమా


1.నన్ను నాకు చూపేటి అద్దానివే

నాతో నేను చేసే అంతర్యుద్ధానివే

నా ప్రజ్ఞ ప్రకటమగుటకై సంసిద్ధానివే

సామాన్యులెరుగలేని అసంబద్ధానివే

నా ప్రేమ సింధువా నా ఆత్మ బంధువా


2.తప్పొప్పులు సరిచేసే స్నేహితవే

నా దిశ నిర్దేశించే స్ఫూర్తి దాతవే

సర్వదా ననుకాచుకొనే జగన్మాతవే

నను కట్టడి చేయగలిగే అధినేత్రివే

నాదైన జీవనమా ఓ పరమ పావనమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పెదవి విప్పవెందుకో

బదులు చెప్పవెందుకో

మనసులోని మర్మమేదొ 

ఎరుక పరుచవెందుకో


1.వద్దనుకొని వదిలేస్తే ఏచింతా ఉండదుగా

కావాలని భావిస్తే మనసంతా నిండేవుగా

పట్టీ పట్టక ఎందులకీ దాగుడు మూతలు

అంటీ ముట్టక ఆటలాడుతూ పడకే కతలు


2.మౌనంగా నేనుంటే సెలుకుతూనె ఉంటావు

నా దారిన నే బోతుంటే కాలడ్డుతుంటావు

జీవితం అంటేనే నాకు ప్రేమ పూల తోట

చింతలేని నీకు బ్రతుకు చింతపిక్కలాట