Friday, April 28, 2023

 https://youtu.be/iwuRSRwDPsI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


పరాశక్తి పరాత్పరీ పరదేవతా

పరవిద్యా పరమేశ్వరీ పరా… శ్రీ లలితా

ప్రణతులివే గొనుము ప్రణవాత్మికే జగన్మాతా

పరసౌఖ్యము వరమీయవె అగజాతా అపరాజితా


1.పరచింతన బోధకే పరతత్త్వ సాధకే

పరమార్థ దాయకే శాంకరీ పరాంబికే

బ్రహ్మాదులకైన తరమ నిన్నెరుగగ  నిజ స్థిరమా

మనోహర మనోరమా ఓంకారమా శరణమహం ప్రపద్యే రమా


2.సౌందర్య లహరి శ్రీహరి హృదయేశ్వరి

శివానందలహరి శివకామిని శివే శర్వాణి

విరించి ముఖవాసిని శ్రీవాణీ నలువరాణి

భువనేశ్వరి రాజేశ్వరి ప్రాంజలిదే శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి

Thursday, April 20, 2023

 


https://youtu.be/biWD0eVRLGQ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అంబరాన్ని తాకుతోంది సంబరం
మన బంధానికిదే తొలి వసంతం
పాట మనకు దైవమిచ్చిన దివ్యవరం
పాడినా విన్నా పాట ఉత్తేజకరం
పాడుతూ జీవిద్దాం పాడుతూ గడిపేద్దాం
పాడుతూనే తరిద్దాం పాడీ తరింపచేద్దాం

1.పాట అమృతానికి తరగని ఊట
యాంత్రిక జీవనాన పాటే ఊరట
పాడుతూ పాడుతుంటే ఎంతో వికాసం
పాట ఉన్నచోటల్లా వినోదమే వినోదం
పాడుతూ జీవిద్దాం పాడుతూ మురుద్దాం
పాడుతూనె తరిద్దాం పాడీ తరింపజేద్దాం

2.పాట లో పలుకుతుంది సామవేదం
పాట సకల వ్యాధులకు పరమౌషధం
పాటలో ఇమిడిఉంది అంతులేని ఆనందం
బిడియాలను వదిలేసి కోయిలై పాడుదాం
పాడుతూ జీవిద్దాం పాడుతూ మరణిద్దాం
పాడుతూనే తరిద్దాం మనని మనం మరుద్దాం

Saturday, April 1, 2023

 https://youtu.be/c1mNRIjtyuU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


నీరాజనం నీకు నీలిమేఘశ్యామ

మంగళము నీకు వకుళానందన

జయము జయము నీకు హే జగన్మోహనా

పాహిపాహి స్వామి పద్మావతీ రమణ


1.ప్రియము నీవే ప్రభూ పురుషోత్తమా

నయము గూర్చర స్వామి నాగశయన

శుభము నీ నామము హే శ్రీనివాస

దేహిదేహి ప్రభూ ధర తిరుమలేశా


2.వరము నీ దర్శనమె ఏడుకొండలవాడ

తపము నీ స్మరణమే శ్రీ వేంకటేశా

మహిమలెన్నగ లేము మంగాపతి

మన్నించి మము బ్రోవు నీవె శరణాగతి