Sunday, October 3, 2021

 

https://youtu.be/xK4B5LZdTpA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హిందోళం


శివమేకమ్ సర్వం సహా లోకమ్

శివానందమే సకల భువన విశ్వమ్

శివం శంకరం భక్తవశంకరమ్

శివోహం సత్యం శివం సుందరమ్

నమఃశివాయ పరిపాలయమామ్

ఓం నమఃశివాయ పరిపాలయమామ్


1.శివనామం దివ్యం మంగళకరమ్

శివధ్యానం భవ్యం కైవల్య వరదమ్

శివ స్మరణం అనన్యం ఆత్మానందమ్

శివకారుణ్యం ధన్యం జన్మ సార్థకమ్

నమఃశివాయ పరిపాలయమామ్

ఓం నమఃశివాయ పరిపాలయమామ్


2.శివ రూపం నిరాకార సాకారమ్

శివతత్వం త్రిగుణాతీతమ్ నిర్గుణమ్

శివతేజం భవభయ హరం పురహరమ్

శివ మంత్రం పంచాక్షర సమన్వితమ్

నమఃశివాయ పరిపాలయమామ్

ఓం నమఃశివాయ పరిపాలయమామ్


https://youtu.be/WHjiOEeROn0?si=mqJfEIFe1xgHz1cH

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:బేహాగ్

నుదుటన దిద్దిన కాసంతబొట్టు
తూరుపు దిక్కున సూరీడైనట్టు
సిగ్గులు పూసిన నీ బుగ్గలు 
గురుతు తెచ్చెనే ఎర్రని గులాబీ మొగ్గలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు

1.తుళ్ళితుళ్ళి తుళ్ళి నవ్వేటి నవ్వుల్లు
సెలయేళ్ళు చేసేటి గలగల సవ్వళ్ళు
చకచక కదలాడు నీ సోగ కన్నుల్లు
కొలనులో తిరుగాడు చిన్నారి మీనాలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు

2.పిరుదుల్ని దాటిన నల్లటి నీ కురులు
వరదై ఉరికేటి కృష్ణమ్మ జలసిరులు
పిడికిట్లో ఇమిడేటి నీ నడుము పోడుములు
పాపికొండల మధ్య గోదారి పదనిసలు
నువ్వై అగుపించని వస్తువేది లేదు
నువ్వే తలపున తోచని సమయమంటు లేదు