Tuesday, August 10, 2021


దివ్య రూపిణి,విద్వన్మణి

తేజో వాహిని,మన్మోహిని

జనని స్వరూపానందిని

వందనమందుకో పావని


1.చిరుత ప్రాయమునాడె-జీవితమెరిగితివి

బుద్బుద ప్రాయమని-గ్రహియించితివి

ఆత్మశోధనలోన అద్వైతివైతివి

సిద్ధినిపొందగ శ్రీరూపమైతివి


2. ఆనందానికి స్వరూపమైతివి

  లోకోద్ధరణకు సిద్ధమైతివి

అక్కున మము చేర్చి నిక్కము బ్రోవవగె

నీ సన్నిధిలో నిలిపి కైవల్యమీయవే

https://youtu.be/C--0Ua10sqg?si=O_7EPVL8GLez6lY6

ప్రస్తుతించనేల మానవ కాంతలను

కొనితెచ్చుకోనేల కోరికోరి వెతలను

నీ తలపులు నిలుపనైతి నా తలను

నీ తపనలొ రాయనైతి కవితలను

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


1.అందమే నీవైతే నిన్నుమించి ఏముంటుంది

ప్రకృతే నీవైతే ప్రతితావున తెఱగుంటుంది

రాజరాజేశ్వరి అంబా బాలా త్రిపుర సుందరి

శారదాంబా శ్యామలాదేవి అతిలోకసుందరి

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


2.ఐహికమౌ సుఖములకై వెంపర్లాడ నీయకే

మూణ్ణాళ్ళ మురిపెంకోసం నన్ను ముంచేయకే

అతివలందరిలోను నీరూపే నా మతి తోచనీవే

శాశ్వత పరసౌఖ్యము నొసగి నన్నుద్ధరించవే

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని

మంగళగౌరి జనని 

కామిత ఫలదాయిని

శుభ శ్రావణ మంగళ వారమున

వ్రతముజేతుమమ్మా కనవెమమ్ము కనికకరమున


1.పాలకడలి చిలుకువేళ కాలకూటమెగియగా

సర్వమంగళ పార్వతీవు హరుని కానతీయగా

గరళము గళమున నిలిపిన చంద్రకళాధరు లీల

మంగళ గౌరీ  కొల్తుము నిను మాంగల్యము కాచేల


2.సోదరి ద్రౌపదికి శ్రీకృష్ణుడు తెలిపినది

నోమునోచుకున్నంత ఐదోతనము నిలిపేది

ఆయురారోగ్యాలు  భోగభాగ్యాలనీయ

మంగళగౌరీ స్తుతించేము సంతతిని బ్రోచేలా