Monday, December 3, 2018

OK

గెలుపుకు తొలి రూపమే సడలని సంకల్పము
నెగ్గుటకై వెన్నుతట్టు నేస్తమే ప్రయత్నము
విజయానికి మార్గదర్శి చెదరని విశ్వాసము
సాధన ఓపిక నెరవేర్చును లక్ష్యము
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం

1.స్వాతంత్ర్యోద్యమమే చరిత్రలో నిదర్శనం
తెలంగాణ సాకారమె చక్కని తార్కాణము
దెబ్బతినీ కోలుకున్న జపాన్ దేశ మెక ప్రతీక
మనుగడకై పోరాటమె బ్రతుకుల్లో వెలుగు రేఖ
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం

2.థామస్ ఆల్వా ఎడిసన్ విధానమే ఉదాహరణ
అబ్దుల్ కలాం ఒడుదుడుకుల పయనమే నిరూపణ
స్టీఫెన్ హాకింగ్ లోని తపనయె ఆదర్శము
పివి నరసింహరావు రీతియె ప్రామాణ్యము
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం


https://www.4shared.com/s/f80y3CoAigm
https://youtu.be/zftFuFNDnJY

ఆనంద నిలయం మహదానంద నిలయం
జీవిత చరమాంకాన సేదదీర్చు సదనం
అనురాగం నోచని అనాథ బాలలను
అక్కునజేర్చుకొనే అమ్మ హృదయం
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం

1.కో అంటే కో అనే కొమురవెల్లి మల్లన్న కనుసన్నలలో
ఋషులు సత్పురుషులు నడయాడిన పునీత నేలలో
సిద్ధులూ సాధ్యులూ తిరుగాడిన పుణ్యభూమిలో
వెలసింది వైకుంఠధామం నెలకొంది భూలోక స్వర్గం
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం

2.పచ్చదనం స్వచ్ఛదనం ప్రకృతి'రమణీ'యం కనువిందుగా
ఆరోగ్యకారకం ఆహ్లాదదాయకం మదికే పసందుగా
ఇంటికన్న పదిలంగా వసతులు సౌకర్యంగా అలరారుతున్నది
వేంకట రమణుని కోవెల పెన్నిధిగా పారమార్థికమ్మైనది
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం

OK

https://youtu.be/qEVJWZRRNxI?si=tB25EsX3z6R6G8VC

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దేశ్

సుందరేశ్వరా-నీ మందహాస-వదనమే-ఆనంద సదనము/
చంద్రశేఖరా-నీ నర్తిత పాదాలకిదే-వందనము అభివందనము
ఓం నమఃశివాయ నమో నమఃశివాయ

1.జటాఝూట గంగాధర -ఫాలనేత్ర పురహర-నీకు నమోవాకము/
నీలకంఠ ఫణిభూషణ-చితాభస్మ ధర శరీర-నీకు నా ప్రణామము/

2. శూలపాణి చర్మధారి-గౌరీ మనోవిహారి-నీకిదె అభివాదము/
దీనపాల భక్త పోష-దీర్ఘ రోగ పరిహారి-నీకు నమస్కారము