https://youtu.be/_GEcEfUOEqc
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:హిందోళం
దాసుని తప్పులకు నీ దయతో సరి
చేసిన దోషాలకు నీ క్షమతో సరి
జన్మజన్మల మా పాపాలు నీ శరణాగతితో సరి
స్వామియే శరణం అంటూ అయ్యప్పా
వేడెద నిన్నూ ఇప్పటినుండి మరిమరి
1.నియమాల పాలనలో నా ఉదాసీనత
నిష్ఠగ చేసే దీక్షలో నా నిర్లక్ష్యపు నడత
పదిమంది కోసం అందరిలో గంభీరత
ఏకాంతంలో కప్పదాట్లతో తప్పిన నా క్రమత
2.అనుకూలంగా సౌకర్యంగా సూత్రీకరణ
తెలిసీ తెలియని జ్ఞానంతో వితండవాదన
లోకాభి రామాయణపు కాలాయాపన
శరణుఘోషనే మానేసి ఐహిక విషయాలోచన