Monday, October 7, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం :భైరవి

నవవిధ భక్తులతో పూజలు సల్పితిమి
నవరస భావాల నిను కొనియాడితిమి
నవరాత్రులూ నిన్ను నెఱనమ్మి కొలిచితిమి
నవనవోన్మేషనీ మహిష మర్ధినీ
చండముండ సంహారిణి చాముండేశ్వరి
చకిత కార్యకారిణీ నమో రాజరాజేశ్వరీ

1.నాశమొందించితివి దనుజ పీడ జనులకు
పరిమార్చవైతివే  ప్లాస్టిక్ రక్కసిని
ఏ వరమంది ఈ భువినవతరించెనో
నువువినా హరియించ హరిహర బ్రహ్మతరమా
సత్వరమే స్పందించి మానవాళి మేలుగొలుపు
చకిత కార్యకారిణీ నమో రాజరాజేశ్వరీ

2.సృష్టి స్థితి లయకారిణి శ్రీ విద్యా కాళికా
కాలుష్యమయమాయె కల్తీ నిలయమాయె
ప్రకృతి వనరులన్నీ కొల్లగొట్టబడసాగె
మానవీయ విలువలన్ని మంటగలిసిపోయే
ఏరీతిగా సరిజేతువో నీకే ఇక వదిలి వేతు
చకిత కార్యకారిణీ నమో రాజరాజేశ్వరీ