Tuesday, December 13, 2022

 https://youtu.be/_6zJtODPjxI?si=ILLI0B6SYd6Xhgvv


18) గోదాదేవి పదునెనిమిదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:శ్యామ 


నీలిమేఘశ్యాముని కృష్ణుని నీ నాథునిగాగొని

నందగోపరాయుని ముద్దుల కోడలైన భామిని

నీలాసుందరి దేవీ నిదురలెమ్ము సతీశిరోమణి

ఫలింపజేయి శ్రీనోము నోచెటి మా మనోకామనని


1.పరిమళాలలు వెదజల్లే  నీలి కురుల ఓ రమణి

తొలికోడి కూస్తోంది తలుపు తెరువు శుభ తరుణి

పికమాలపిస్తోంది గురువిందతీగ పందిరిపై కూర్చొని

గడియతీయి  పూమంజరి గొనినచేత ఓ గజగామిని


2.కెందామరలైతోచు నీ సుందరమగు చేతులు

కదలమెదల పలుకును నీగాజులు సంగీతసంగతులు

గోవిందుని గుణగణాలు కీర్తించును మా గీతులు

తొందరించి నిదురలేచి తీయవమ్మ గది తలుపులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పిల్లనగ్రోవి నా మోవే-ఉల్లము నీ తావే

నీ ఉనికి తెలిపేను మొగిలిరేకు తావే

వదలక నను ముద్దూమురిపాలలొ ముంచుతావే

వేణుగోపాలా మువ్వగోపాలా నందగోపాలా

వందనాలు వందనాలూ ఆనందగోపాలా


1.నా అధరము మృదువుగ నీవందగను

సుధలూరును మధుర నదమూ పారును

వనమాలి శిఖిపింఛమౌళి రాసకేళి తలచను

మరులూరును మనమున మయూరమాడును

వేణుగోపాలా మువ్వగోపాలా నందగోపాలా

వందనాలు వందనాలూ ఆనందగోపాలా


2.దోబూచులాడేవు నా మది గది లో నక్కి

దొంగాటలాడేవు  నెమ్మదిగా నాలో నను నొక్కి

తిప్పలుబడి పట్టినా తప్పించుకుంటావు చిక్కినట్టె చిక్కి

తరింపజేయరా అలసితిని ఇకనైనను నాకు దక్కి

మదనగోపాలా కదనగోపాలా ఎద సదన గోపాలా

కృష్ణ గోపాలా నీపై తృష్ణ గోపాలా నీ లీలనాపాలా