Saturday, October 19, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మత్తు ఒక గమ్మత్తు
ఆ జిత్తులమారి కెంత మహత్తు
ప్రతివారూ ఏదోఒక
మత్తుకు చిత్తు చిత్తుచిత్తు
మాదకద్రవ్యాలన్నీ మానవ నాశకాలు
అమ్మినా కొన్నా వాడినా అవి ఘోర నేరాలు


1.తమదైన కొత్తలోకమే అది
వింతైన ప్రపంచమే అది
సంగీతం ఒక మత్తు
సాహిత్యం ఒక మత్తు
మేలుకూర్చు మత్తులూ ఉన్నాయని తెలసుకో
రోజువారి సేదదీర లలిత కళల నలవర్చుకో

2.అందరికీ అనుభవమే నిద్రమత్తు
శస్త్ర చికిత్సకై ఇచ్చేరు ముందు మత్తు
మధిరది ఒక మత్తు
మగువది ఒక మత్తు
మోతాదు మించ ఏదైనా నిలువునా ముంచు
మత్తులొ మునిగితేల అది ఆయువు తగ్గించు