Tuesday, April 18, 2017

https://youtu.be/NbFMvXKCKC4


మా లు సైతం రాని వాణ్ణి సాహిత్యంలో

సరిగమ పదనిస లైనా అసలెరుగని వాణ్ణి సంగీతంలో

కొలుతునెప్పుడు  వీణా పాణిని శ్రీ వాణిని

మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని

 

1. పంచ మహా కావ్యాలు పఠియించలేదు

ఛందస్సు వ్యాకరణం నేర్చింది లేదు

వాగ్గేయ కారుల కృతులు పాడలేదు

శ్రుతి లయ గతులు జతులు అభ్యసించలేదు

గళసీమ యందైన మాధుర్య రుచిలేదు

నా గళసీమ యందైన మాధుర్య రుచిలేదు

కొలుతునెప్పుడు  వీణా పాణిని శ్రీ వాణిని

మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని

 

 

2. సాహితీ స్రష్టల సహవాస ఫలమిది

సంగీత బ్రహ్మల సాన్నిధ్య యోగమిది

గోదారి జలపాన ఘనమైన మహిమ ఇది

ధర్మపురి నరసింహ స్వామి  కరుణాకటాక్షమిది

అమ్మా నాన్నల ఆశీస్సుల బలమిది

మా అమ్మా నాన్నల ఆశీస్సుల బలమిది

కొలుతునెప్పుడు వీణాపాణిని శ్రీవాణిని

మది తలతునెప్పుడు మాతా జ్ఞాన సరస్వతిని

 

 3.పురాణాలు హరికథలు అడుగులు వేయించెను

 నాటకాలు భజనలునా చేయిపట్టి నడిపించెను

 బాంధవ్యం  స్నేహితం వెన్నుతట్టి పురికొల్పెను

పూర్వజన్మ సుకృతమేదో కవిగ మేలుకొల్పెను

నా పూర్వజన్మ సుకృతమేదో కవిగా మేలుకొల్పెను

కొలుతునెప్పుడు వీణా పాణిని శ్రీ వాణిని

మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని


OK