Thursday, July 8, 2021



విశ్వసించా నా శ్వాసవే నీవుగా సాయి

పలవరించా నీ నామమే పగలు రేయి

నిజాయితే కొఱవడిందో నీ మీది భక్తిలో

సజావుగా సాగకుంది బ్రతుకే ఆసక్తితో


1.ఎందరు నిను కొలిచేరో-లబ్దెవరికి చేకూరేనో

షిరిడీ దారి పడతారు-నీ సమాధిన తలపెడతారు

ఎవ్వరికే సిరి దొరికేనో ఏ సంపద సమకూరేనో

ద్వారకమాయికేగుతారు-ధునిబూది తలనెడతారు


2.చెప్పుడు మాటలు వినను-కాకమ్మ కథనమ్మను

మరిమరి నిను వేడను- మదిలో మాత్రం నే మరవను

ఏరీతి చక్కబెడతావో  -చేజారిన ఈ నా జీవితం

ఎలా మరమ్మత్తు చేస్తావో శిథిలమైన నా హృదయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా ఋజువు పరుచను నా ప్రేమను

ఎలా ఎరుక పరుచను నా మనసును

ఏ అపురూప కానుకనందించను

ఏ విధి నా హృదినిక ప్రకటించను


1. పారిజాత తరువును గొనిరానా

సత్యపరం చేసాడు కృష్ణుడేనాడో

ఐనా పారిజాత పరిమళమే నీ సొంతం

అమృతాన్ని దివికేగి సాధించుకరానా

పాత్రకే పరిమితమై మితంగా లభ్యమౌనో

పుష్కలమే నీ అధరాల్లో ఆ సుధామాధుర్యం


2.కోహినూరు వజ్రం సంపాదించనా

ఆంగ్లేయులు దొంగిలించిరి అలనాడే

నీకాలిగోటి విలువకు తూగదుగా ఆ రత్నం

పాలరాతి మందిరమే నిర్మించనా

కఠినమేకద శిలాకోవెల  సుకుమారీ నీకేల

నా గుండెను గుడిగా మలచి కొలిచేను నిత్యం