Friday, October 1, 2021

 వంచేస్తా ఆకాశం నీకోసం

దించేస్తా జాబిలినే ప్రతి దివసం

తారలనే తగిలిస్తా నీ చెవుల గున్నాలుగా 

సూర్యుడినే దిద్దేస్తా నీ నుదుటికి తిలకంగా

నేను నీలో కలిసిపోతా పెరుగులో వెన్నలా

నిన్ను నాలో నిలుపుకుంటా నీలో నన్నులా


1.చరాచరమంతా నీవేనిండిపోయావే

ఊపిరిలో ఊపిరిగా నీవే ఉండిపోయావే

నా ఎదనాదం మంజులమైపోయిందే

నా ప్రతి భావం నీకే అంకితమయ్యిందే

నేను నీలో కలిసిపోతా పెరుగులో వెన్నలా

నిన్ను నాలో నిలుపుకుంటా నీలో నన్నులా


2.ప్రేమ స్థాయి దాటిందే నీవంటే

పిచ్చి ముదిరిపోయిందే నీవంటే

నన్ను వదిలి పోవద్దే నా ప్రాణమా

నీవే లేని జీవితం అదో జీవితమా

నేను నీలో కలిసిపోతా పెరుగులో వెన్నలా

నిన్ను నాలో నిలుపుకుంటా నీలో నన్నులా

 ఉద్యోగం పురుష లక్షణం

మనుగడకు ఉపాధి కారణం

అరవైవత్సరాల ఆయుఃప్రమాణం

వెరసి అనివార్యం ఉద్యోగవిరమణం

ఉద్యోగి గారు మీ లక్ష్యం పరిపూర్ణం

నిర్ధ్వందంగా అప్రతిహతం అజేయం అమోఘం

ఉద్యోగి గారు పదవి విరమణశుభాకాంక్షలు  

మీ స్నేహ శీలతకూ  నా హార్దిక జేజేలు


1.శిఖరాగ్రం చేరుకున్న గ్రామీణ బ్యాంకరు మీరు

యజమాన్యం మెచ్చుకునేలా ఆదర్శం మీ తీరు

ఉద్యోగుల సంఘాలలోనూ ఉద్యమించినారు

సంకటాలు ఎదురైనా అధిగమించినారు

ఉద్యోగి గారు పదవి విరమణశుభాకాంక్షలు  

మీ స్నేహ శీలతకూ  నా హార్దిక జేజేలు


2.చెరిగిపోని చిరునవ్వు మీ పెదవుల కదలాడు

అవగాహన విషయంలోను తడబడరు ఎన్నడు

కష్టమర్ల సేవలలో మీకు మీరే కదా సాటి

ఎవరైనా ఇష్టపడే వ్యక్తిత్వానికి మీరే దివిటి

ఉద్యోగి గారు పదవి విరమణశుభాకాంక్షలు  

మీ స్నేహ శీలతకూ  నా హార్దిక జేజేలు


3.అర్ధాంగికి ఉత్తముడైన ఆదర్శ పతివి

సంతానాన్ని చేర్చినావు అత్యున్నత స్థితికి

సాగిపోని భవితంతా ప్రశాంతమౌ త్రోవగా

ఆనందం వెల్లివిరిసే కుటుంబంతొ హాయిగా

ఉద్యోగి గారు పదవి విరమణశుభాకాంక్షలు  

మీ స్నేహ శీలతకూ  నా హార్దిక జేజేలు








 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహలకు రూపం వస్తే,

భావనకు ప్రాణం పోస్తే 

నీలానే ఉంటుంది అచ్చంగా,

ఒళ్ళంతాపాకుతోంది హాయి వెచ్చంగా

సౌందర్యరాశివే,నా హృదయరాణివే

అందీయవే నీపాదం అందియనై పడిఉంటా


1.పదహారు ప్రాయాన. 

పరుగులెత్తు పరువాన 

పోతపోసుకున్నావే పల్లె అందాన్ని,

సౌందర్యరాశివే,నా హృదయరాణివే

నిను చూస్తేచాలు పొందగలము ఆనందాన్ని


2.వందసార్లు చావవచ్చు నీకోసం,

వేయి జన్మలెత్తవచ్చు నీకోసం

నేనెదిరి చూస్తా నీమదిని దోస్తా 

సౌందర్యరాశివే,నా హృదయరాణివే

నన్ను నవ్మవే చెలీ నూరేళ్ళూ తోడుగ వస్తా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:లలిత వసంతం


కల నిజమయ్యే ఉషస్సువు

బంగరు రంగుల రోచిస్సువు

నా వశములొ లేని మనస్సువు

నా జీవన జ్యోతికి హవిస్సువు

నిత్య వసంతమై అలరిస్తావు

లాలిత్య గీతమై మదిదోస్తావు


1.నీరెండలా  వెచ్చని హాయివి

విరిదండతో వచ్చిన ప్రియవి

 నా కన్నుల కమ్మేసిన మాయవి

నీవే లోకమైన నా సోయివి

నిత్య వసంతమై అలరిస్తావు

లాలిత్య గీతమై మదిదోస్తావు


2.మాటల మంత్రమేసె జాణవి

పాటల మధువుపోసె పికానివి

సయ్యాటలాడే సౌదామినివి

కౌగిట చేర్చుకునే సమీరానివి

నిత్య వసంతమై అలరిస్తావు

లాలిత్య గీతమై మదిదోస్తావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ కడకొంగు నడుమున దోపితె...

కదన కుతూహలమే..

నీ కడకొంగు గొడుగుగ పడితే...

అమృతవర్షిణి తలమే...


1.నీ కడకొంగు వీవెన వీస్తే 

మలయ మారుతమ్మే..

నీ కడకొంగు గాలికొదిలితే..

శంకరాభరణమే...

నీ కడకొంగు ముసుగే వేస్తే..

కళ్యాణ వసంతమే..

నీ కడకొంగు సేద దీర్చగ 

సంమోహనమే....


2నీ కడకొంగుతో..తుడిస్తే..

మేఘ మల్హారే

నీ కడకొంగునే పరిస్తే 

రస రంజనియే..

నీ కడకొంగుతో ముడివడితే

సప్తపది సరాగాలే..

నీ కడకొంగున నను కట్టేస్తే..

అనురాగ మాలికలే...!!