https://youtu.be/9O6dzR_9i5A?si=_3B395pvXpYJpExM
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:అమృతవర్షిణి
వందనమిదె శ్రీ వాణీ
విద్యాదేవి వీణాపాణి
శరణు శరణు వేదాగ్రణి
శరణు తల్లీ విధిరాణి
1.నా ఆరాధ్య దేవతవు
నా హృదయ సంస్థితవు
నా మానస వికసితవు
నా కవన విలసితవు
2.పాలించవె నలువరాణి
పలికించవె నుడుగుల చెలి
దయజూడవే ధవళాంగి
మముగావవే మేధావిని