Saturday, February 25, 2023

 నియోగులం కర్మయోగులం

సుపరిపాలనా వినియోగులం

చాణక్య నీతిలో కార్యదక్షులం

ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రానికి ప్రతీకలం-భార్గవులం

అపార మేధాసంపత్తికి నిలువెత్తురూపాలం


1.కత్తికన్న మిన్నగా కలంతో సాధించాం

కచ్చేరుల తీర్పులలోను మేటిగ వాదించాం

తేడా వస్తే చక్రవర్తి తోనైనా విభేదించాం

జన సంక్షేమం లక్ష్యంగా దేవుడినైనా ఎదిరించాం


2.భద్రాద్రి కోవెలకట్టిన భక్తుడు రామదాసు మావాడే

పెదవి విప్పక దేశంనేలిన ప్రధాని మా పివి తీరు వాడే

వచన కవిత్వ ఝంఝా మారుతి మాశ్రీశ్రీ రీతి జగమే వాడే

మా కాళోజీ కవన గొడవకు నిజాం క్రూర పాలన వసివాడే 


3.శాసించడమే గాని ఆశించుట ఎన్నడు ఎరుగం

వితరణయే మాగుణము దేశానికి భూదాతలం

స్వతంత్రయోధులు  ఆంధ్రకేసరీ, జమలాపురం మావారే

కీర్తిగొన్న నేతలు కరణం,ద్రోణం,చకిలం,మంచికంటీ మావారే

సినీజగతికే మహరాణీ భానుమతీ మా ఆడపడుచే


పేదరికంలో ఉన్నాగాని చేయిసాచని ఆత్మగౌరవ వాదులం,ఆత్మాభిమానమే మాకు ప్రాణం (లాస్ట్ లైన్ సాకి గా…)

 https://youtu.be/RPCKMFaNuHM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందుస్తాన్ భైరవి


ఎలాచెప్పగలిగావు అభిమానం లేదని

ఎంతగా గాయపరిచావు స్నేహం పంచే నాఎదని

గుండె బండబారిదా,ఋణంకాస్త తీరిందా

వీడ్కోలు శాశ్వతంగ నా మాజీ మిత్రమా

అపరిచితులమే ఇక చితి చేరినా పూర్వ నేస్తమా


1.సరదాకే చెప్పావో నా రచనలు నచ్చాయని

వెటకారమె చేసావో కవితలు మెచ్చావని

ఎడంకాలితో ఎదని తన్ని ఎగతాళిగ నవ్వావు

నా మైత్రిని ఉబుసుపోక మాత్రమే దువ్వావు


2.నువుకొట్టినదెబ్బకు విలవిలలాడింది నా హృదయం

నీతేలికచర్యకు కుతకుతలాడి మనసు అయోమయం

 మితి మీరిన విశ్వాసం నేర్పింది తీవ్రమైన గుణపాఠం

చెరిపివేస్తున్నాను ఆనవాలు మిగలకుండా ఆసాంతం

 https://youtu.be/8ucf8LfTl08


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్భార్ కానడ


లక్ష్మీవల్లభా ప్రభో మమ ప్రసన్నః ప్రసన్నః

అలమేలు మంగా విభో ప్రసీదః ప్రసీదః

తిరువేంకట నాయకా స్వామీ నమోనమః

శరణు శరణు కరుణాంబుధే గోవిందాయనమః


1.ఎన్నాళ్ళిలా ఏ ఎదుగూబొదుగూ లేనిబ్రతుకు

ఎన్నేళ్ళిలా శుభం పలకవు గతుకుల నా కథకు

ఎంతని భరించడం అంతంలేదా స్వామి నావెతకు

సంతసమన్నది ఎండమావిగా దొరకదు ఎంతకూ


2.ఉన్నావో లేవో తెలియని ఓ వింత ఊహవు

ఏ పిచ్చోడో ఎపుడో అల్లిన కవన కల్పనవు

ఈ యాతనా జగత్తులో నీవే కాస్త ఊరటవు

అంతులేని జీవయాత్రలో బలము బలహీనతవు

 https://youtu.be/bu5tDbS3ZOA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


ఎవరన్నారు మంచిరోజులు వస్తాయని

ఎవరుకలగంటారు బ్రహ్మజెముళ్ళు పరిమళిస్తాయని

గడిచినకాలమే మేలు నాకు ఎంతోకొంత

అంధకార బంధురమే ఇకనా  భవితంతా


1.నవ్వడమే మరచిపోయాను

  నడవడమూ మానివేసాను

  బంధాలు అనుబంధాలు వదిలించుకున్నాను

  స్నేహితమను మాటకే మదిలో తిలోదకాలిచ్చాను


2.అనుభూతికి చితిపేర్చాను

రసస్ఫూర్తిని గోతిలొ పూడ్చాను

నాకు నేనుగా అపస్మారకస్థితి చేరుకున్నాను

జీవన్మృతుడిగా రోజులని లెక్కబెడుతున్నాను