Wednesday, January 25, 2023

 https://youtu.be/Wjn8Gtkq068


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:అభేరి(భీంపలాస్)


పంచవిధ కృతులతో సుప్రభాతం

పంచోపనిషత్తులతో నిత్యాభిషేకం

పంచభక్ష్యాలతో హృదయనైవేద్యం

పంచ జ్యోతులతో దివ్యనీరాజనం

నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం 

ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం


1.గోదావరి దరి అంచున జన్మించితిమి

నీ పాదాల పంచన నే జీవించితిమి

తల్లి తండ్రీ గురువుగ నిన్నెంచితిమి

కనురెప్పగ కాచెదవని విశ్వసించితిమి

మమ్మేలే మా రాజువని భావించితిమి

నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం 

ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం


2.ప్రతిరోజూ ఇరుసంధ్యల నీదర్శనం

మా మది భక్తి ప్రత్తులకది నిదర్శనం

అనుక్షణం అభయమొసగు నీ సుదర్శనం

ఇహపర సుఖదాయకం నీక్షేత్ర సందర్శనం

పావన ధర్మపురి తీర్థ క్షేత్ర సందర్శనం

నరహరే భక్తవరద నీకిదే శ్రీ చందనం 

ధర్మపురి హరీ స్వామి సాష్టాంగ వందనం

 https://youtu.be/ClaJw-nUoJE


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కూపస్థ మండూకాన్ని

వ్యవస్థకు తూగని తూకాన్ని

నాకు నేనైన ఓ లోకాన్ని

నేనో పిచ్చి మాలోకాన్ని


1.పెద్దగా సాధన చేయను

ఏమంత వాదన చేయను

కాకిపిల్ల కాకికి ముద్దులా

కవితలెన్నో రాస్తుంటాను


2.ఎదుటి వారి ఊసేగిట్టదు

ఎవరేమను కున్నా పట్టదు

అందలాల  ఆశైతే గిట్టదు

అంతర్ముఖుడి నవగా తట్టదు

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాధా రాధా నా ప్రణయ గాధ

కృష్ణాకృష్ణా నీవేలే నా జీవనతృష్ణ

సృష్టి ఉన్నంత కాలం విశ్వమంత విశాలం

మన అనురాగం మధురస యోగం 

మన సంయోగం  అపవర్గం


1.నా రేయికి హాయిని కలిగించే వెన్నెలవీవు

నా నోటికి ఉవ్విళ్ళూరించే వెన్నవు నీవు

నీ పదముల కంటిన మట్టిరేణువునే నేను

నా తలనలరించిన నెమలి పింఛము నీవు



2.శ్రుతివే నీవు లయను నేనైన గీతిగా

మువ్వలు నేను మురళివి నీవైన కృతిగా

యుగయుగాలుగా తీరని చిగురాశగా

మన ఆత్మల కలయిక పరమాత్మ దిశగా