ఎలా కూర్చి ఉంచావయ-అంతులేని ప్రేమలని
మనసు అంతరాలలోన ..........మమకారాలని
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము
కరుణ రవీ
1. పెంచుకున్న పూలమొక్క –మమత నింక తెలుపదా
సాదుకున్న బొచ్చుకుక్క –భూతదయను చూపదా
పంచుకున్న బన్నుముక్క –మైత్రి విలువ
నెరుగదా
మనిషి మసల మనిషి లెక్క -మానవతను నిలుపదా
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ
2. జాతి మరచి పాలు కుడుప-మాతృత్వం వెలుగదా
విభేదాలు విస్మరింప-సౌభ్రాతృత్వం విరియద
ఉన్నంతలొ సాయపడగ-లేమి తోకముడవదా
హృదయ మెంతొ విస్తరింప-దయాగుణం గెలువదా
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ
3.
బ్రతుకు రైలు పయనంలో-చోటులోన సర్దుబాటు
గుణపాఠపు
బడిలోనా- నడవడికల దిద్దుబాటు
దాంపత్యపు
సుడిలోనా-అన్యోన్యపు తోడ్పాటు
వసుధైక కుటుంబమనగ-తిరుగులేని
జరుగుబాటు
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ
http://www.4shared.com/mp3/AG_smnJ0ba/___online.html
http://www.4shared.com/mp3/AG_smnJ0ba/___online.html