Wednesday, May 30, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ముద్దాడనా వేణువునై నీ పెదవుల
కడతేరనా రేణువునై నీ పదముల
జిలుగులీననా పీతాంబరమునై నీ మేనిన
వన్నెలూననా పింఛమునై నీ శిరసున
నను చేర్చుకో గోపీలోలా నీలోనే
నను మార్చుకో మోహన బాలా నీలానే

1.బంధించనా ఎదరోలునా యశోదమ్మలా
పండించనా తీపికలలు రాధమ్మలా
పరితపించనా త్వమేవాహమని మీరాలా
ఇల తరించనా అవకరమే శ్రీకరమైన కుబ్జలా

ననుచేర్చుకో గిరిధర నీలోనే
ననుమార్చుకో గీతావర నీలానే

2.సఖుడను కానా చేరువగా సుధాముడిలాగా
సోదరిగా మారనా నను కావగ పాంచాలిగా
ఆత్మబంధువైపోనా తలపోయగ పార్థుడిలా
పుండరీకుడినై మురియనా
వాలగ విఠలా నీ చరణాలా

నను చేర్చుకో పాండురంగ నీలోనే
నను మార్చుకో రంగనాథ నీలానే
 https://www.4shared.com/s/fjQ_hT8bgee