Sunday, January 1, 2023

 https://youtu.be/udu2zx7-_ug


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:కళ్యాణి


ఇచ్చిఇచ్చి అలసిపోయినావా

ఇవ్వడానికేమి లేక ఒడిసిపోయినాయా

అడిగినదేదీ కాదని అనవని

కోరినదేదైనా ఒసగేవాడవని

నీకున్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా


1.మనసెరిగీ ఇచ్చినావు మమతతో ఇచ్చినావు

ఒళ్ళు మైమరిచిపోయి నీఆలినీ వరముగ ఒసగినావు

భక్తికి పరవశించి నిన్ను నీవు సైతం వదులుకున్నావు

అందరికన్నీ ఇచ్చిన సుందరేశ్వరా ఏల మిన్నకున్నావు

నీకున్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా


2.అంతలేసి వాంఛలుకావు వింతైన కాంక్షలులేవు

నువ్విచ్చి తిరిగి తీసుకున్నదే ఇవ్వలేకున్నావు

కన్నవారిపైనను ఏకాస్త కరుణను చూపలేకున్నావు

మరోమారు మైమచూపి నిందను తొలగించుకో నీకు నీవు

ఉన్నపేరు ఏమవునో ఉమాశంకరా

నిన్నే నమ్ముకున్నానుర నిటలాక్షుడా

 https://youtu.be/I2mtNgc9G3Q


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


సాక్షినారాయణా మోక్షనారాయణ

యోగ నారాయణా కర్మయోగినారాయణా

నిత్యనారాయణా స్వామి సత్యనారాయణా

జీవనారాయణా భావనారాయణా

దివ్యనారాయణా నమో సూర్యనారాయణా


1.లోకానికి వెలుగునిచ్చే పరంజ్యోతివి

జీవులకిల జవము కూర్చే అపారశక్తివి

లయ తప్పని నిరంతర కాలవలయ చక్రివి

మానవాళి మనుగడకై కారుణ్యమూర్తివి

దివ్యనారాయణా నమో సూర్యనారాయణా


2.షడృతు పరిణామకా ద్వాదశ నామకా

సప్త చక్ర ఉద్దీపకా సప్తాశ్వ రథారూఢకా

అష్టాంగయోగ ప్రసాదక అష్టదిక్పాలపాలకా

నవనవోన్మేష నవగ్రహాధీశ నవరస పోషకా

దివ్యనారాయణా నమో సూర్యనారాయణా


*ఆంగ్లవత్సరాది శుభాకాంక్షలతో…!*

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


పట్టుకుంటే జారిపోతావు

వదులుకుంటే వాలిపోతావు

ఉదయంలా నువ్వెంతో సరికొత్తగా

దవనంలా నాకైతే మరీ మత్తుగా

దూరమైతే నేనైతే బ్రతుకలేను

భారమైనా నేరమైనా తప్పుకోను


1.కాలమై వేసావు ఎదకు గాలాన్ని

శూలమై గుచ్చావు ప్రేమ శూలాన్ని

కవితలో కవితగా నా వెతలకు లేపనంగా

పలుకులే ఊతంగా ఎంతో సాంత్వనంగా

నిత్య వసంతమౌతూ కోయిల గీతమౌతూ


2.జ్యోతిలా వెలిగే నా దారి దీపానివి

అద్దమల్లే నన్ను నాకు చూపే నేస్తానివి

ఆశ పడితే శలభమై స్నేహమైతే సులభమై

చూసేటి కుసుమమై వాడితే విఫలమై

నా కను'బంధమౌతూ పర'మానందమౌతూ


https://youtu.be/iXFMSBrrIMM