Tuesday, January 17, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పుష్పలతిక


దయా హృదయవీవు

సామ ప్రియ శారదవు

కఛ్ఛపి వీణా వాదన వైశిష్ట్యవు

మంజుల మంద్రస్వర సంతుష్టవు

ప్రణతులివే ప్రణవీ మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు


1.శ్వేత పద్మాసిని శ్వేతాంబరధారిణి

హంసవాహిని ప్రశాంత రూపిణి

చంద్రానన వాణీ సుమధుర హాసిని

ప్రణతులివే ప్రణవీవే మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు


2.సప్త స్వర మాతృక సప్త వర్ణాత్మిక

సప్త జ్ఞాన భూమిక సప్తచక్రోద్దీపిక

సప్త జన్మ కృత దోష పీడా హారిక

ప్రణతులివే ప్రణవీవే మా ఇష్ట దేవతవు

మా మతిలో కృతిలో భారతీ నీవే కలవు

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఆడుతూ పాడుతూ ఆనందంగా

అనుక్షణం సాగాలి బ్రతుకే వినోదంగా

కుదరనపుడు వదిలేసెయ్ జస్ట్ లైక్ దట్

కొత్త షూలొ కాలెట్టేసెయ్ దట్స్ మై ఫూట్


1.పదేపదే పాకులాడడం

చూరొట్టుక వ్రేలాడడం

ఛీదరించి ఛీ కొట్టినా దేబిరించడం

బ్రేకప్పని చెబుతున్నా బ్రతిమిలాడడం

లైట్ తీస్కో గింజుకోక

ఫర్ గెటిట్ ఖంగుతినక


2.అడుగెయ్యి కాన్ఫిడెన్స్ గా

యూత్ ఐకాన్ కి  రెఫరెన్స్ గా

లైఫంటే ఎంజాయే లైఫంతా ఎంజాయే

వీకెండొస్తే పబ్బు పార్టీ మజా మజాయే

సాలరినంతా బర్నింగ్ చెయ్యి

మోర్ అండ్ మోర్ ఎర్నింగ్ చెయ్యి

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కట్టెలమోపు నెత్తి నెత్తుకొని

పిల్లా జెల్లా సంక నెట్టుకొని

చేయీ చేయీ చేరి పట్టుకొని

వస్తిమి నర్సయ్య నీ జాత్రకని

ధరంపూరి నర్సయ్యా జాత్రకని


1. గోదాట్లొ సరిగంగతానాలు చేసుకొని

కొబ్బరికాయలు బత్తెరసాలు కొనుక్కొని

బుక్కగులాలు తుల్సి మాలలు చేకొని

నర్సిమ్మసామి గోవిందా అని మొత్తుకొని

వస్తిమి నర్సయ్య నీ గుళ్ళకని

ఏగిరమే నిను జూడ మనసు పడి


2.పుట్టెంటికలూ సామి నీకిచ్చేసి

మొక్కులు ముడుపులు ఇడిపించేసి

పట్టెనామాలు కోరమీసాలు నీకు పెట్టేసి

పట్టుబట్టలు బాసికాలను ముట్టజెప్పేసి

వస్తిమి నర్సయ్య ఈ ఏట నీ లగ్గానికని

సంబురపడ్తిమి సామి లచ్చమ్మతొ నీ పెళ్ళి గని

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చినుకు పలకరిస్తుంది-గాలి అనునయిస్తుంది

పువ్వుసైతం రువ్వుతుంది-ఓ నవ్వు నా కోసం  

నీకేలనే చెలీ నేనంటే ఇంత ఉదాసీనం

చంపివేయి ఒక్కసారే సైచలేను నీ మౌనం


1.నేనంటూ ఉన్నానని అసలు గుర్తించవు

నేనంటూ ఉంటానని ఏ మాత్రం గుర్తుంచుకోవు

నా అంతట నేనే చొరవతీసుకుంటా కలవడానికి

పట్టిపట్టి నీతో మాటకలుపుతాను దగ్గరవడానికి

దాటవేస్తుంటావు కుంటిసాకులెన్నో చెప్పి

మాటమార్చుతుంటావు మరులనే గుప్పి


2.ప్రణాళికలు రచించాలి నీ అందం చూడడానికి

ప్రయత్నాలు ఫలించాలి నిమిషమైన గడపడానికి

గుడిలోని దేవత సైతం ఇస్తుంది దివ్యదర్శనం

నా దేవిగా ఆరాధించినా ప్రసాదించవేల వరం

ఎలా చేసుకోను నిన్ను అనునిత్యం ప్రసన్నం

నీవు లేని నా బ్రతుకే అత్యంత అధ్వాన్నం

 https://youtu.be/wqPxxn9A15Y

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గోదావరి స్నానమంటె పరమానందము

నరసింహుని దరిశించుకొంటె జన్మ ధన్యము

ధర్మపురి తీర్థ క్షేత్ర సందర్శన భాగ్యము

పుణ్యానికి పుణ్యము కలుగును ఆరోగ్యము


1.సత్యవతి గుండము సర్పదోష హరము

బ్రహ్మగుండ దృశ్య వీక్షణం మనోహరము

గౌతమినదీ తీర విహారము ఆహ్లాదకరము

ముమ్మారులు మునిగితే సిద్ధించును పరము


2.స్నాన ఘట్టాలలో భద్రతా సౌలభ్యము

గలగలపారే ప్రవాహాన కడు సౌకర్యము

చిన్నగడి పెద్దగడి శివ పంచాయతన ప్రాంతము

చిన్నా పెద్దా ఇంటిల్లిపాదికీ అనుకూలవంతము


2.హన్మాన్ కోవెల సంతోషీ మాత గుడి

 దత్తమందిరం శ్రీ సీతా రామాలయము

షిరిడీ సాయిబాబ సంస్థిత సన్నిధానము

నది ఒడ్డున ప్రతి గుడీ భక్తి ముక్తిధామము