Sunday, February 9, 2020

https://youtu.be/3UEb4RB4Gbk

మూడు జగములన్నిటికీ మూలపుటమ్మా
ముగ్గురమ్మలనే గన్న చానా పెద్దమ్మా
సింగమునెక్కి ఊరేగే దుర్గాంబా మహంకాళికాంబా
లోకములన్నీ మోకరిల్లే శాకంబరి శాంభవీ జగదాంబా
వందనాలు లాల్ దర్వాజా సింహవాహినీ
అందుకోవమ్మా బోనాలు కాళికా భవానీ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

1.పోతరాజు వెంటనుండ సాగేను జాతర
దుర్మార్గులనందరినీ  వేసేయవె పాతర
ఆడపడచుగానూ నిన్నాదరణ చేసేము
ఆషాఢమాసాన నిను ఆహ్వానించ వచ్చాము
ఆదరించవమ్మా మము నిండు మనసుతోనూ
మము చల్లగ జూడవమ్మ ప్రేమ మీరగానూ
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

2.మహిషాసుర రక్కసున్ని కర్కశంగ దునిమావే
మధుకైటభులనూ మదమణచగ చంపినావె
నిశుంభునీ శుంభునీ సంహరించి వేసావే
కలిలోని కీచకులను పీచమణచ వేలనూ
నీ ప్రియమగు బోనాలు  మోసుకొచ్చామే
ఆరగించి అర్తి తీర్చి దీన జనుల కావవే
జయహో శాకంబరీ జై మహంకాళీ
జయహో సింహవాహినీ జయహో దుష్టనాశినీ

నీ అంగాంగం ప్రకృతి రంగం
నీ పరువం కదన తురంగం
నీ తమకం కడలి తరంగం
ప్రణయ ప్రబంధం నీ అంతరంగం

1.తూరుపు కనుమల నడుమ రవికే ఆహ్వానం
కలువల కన్నుల లోనా శశికే సింహాసనం
నీ వెచ్చని తను స్పర్శనం జాగృతి గీతం
నీ చల్లని చూపుల చంద్రిక తపనకు నవనీతం

2.నీ క్షీర శిఖర ఆరోహణ పర్వం
నీ క్షార లవణ రసాస్వాదనే సర్వం
నిను క్షేమ రేవు చేర్చినంత గర్వం
నీవంటి సమవుజ్జీ అనితరం అపూర్వం
మేలుకుంటే తలపుకొస్తా
నిదురోతే కల్లో కొస్తా
నీడల్లే వెంటబడతా
నీగుండెలొ చొరబడతా

1.సుద్దులెన్నొ చెప్పుతుంటా
ముద్దులెన్నొ పెట్టుకుంటా
గట్టిగా నా కౌగిట్లో
నిన్నట్టి పెట్టుకుంటా

2.నీ మేను కాన్వాసిస్తే
నాలుకనే కుంచెగ చేస్తా
గిలిగింతలు కలిగించే
చిత్రమైన చిత్రాలనే వేస్తా

3.పిడికిట్లో నడుమిముడుస్తా
నాభి తెనే పట్టుబడతా
శిఖరాలు లోయలు దాటి
నిధులన్ని కొల్లగొడుతా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

దోచేసినావు నా హృదయాన్ని
లాగేసినావు నా పంచ ప్రాణాల్ని
ఆక్రమించావు నా ఆలోచనల్ని
ఆశలెన్నొ రేపావు అందించ నీ ప్రణయాన్ని

1.దోబూచులాడుతావు తప్పించుకొంటూ
దొంగాటలాడతావు నన్నుడికించుకుంటూ
మానవే నా చెలీ ఈ సయ్యాటలు
మౌనమేల తెలుపగ నీ మనసు మాటలు

2.నీ పేరు తలచుకొంటే ఉద్వేగం పెరుగుతుంది
నీ రూపు గుర్తొస్తే ఉద్రేకం కలుగుతుంది
తీయనైన బాధవు నీవు నా రాధికా
తీరని ఆనందం నువ్వు నా విరహ గీతికా