Tuesday, February 28, 2023

 https://youtu.be/BA9ljB1B5Ps


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గట్టెక్కించు- మము గండాల నుండి- గట్టయ్య- మా కొండగట్టయ్య

చుట్టపక్కమునీవే- లెక్కపత్రము నీతోనే- పట్టించకోవయ్యా- పావనీ దండమయ్యా


1.కుప్పలు తెప్పలుగా-తప్పులు చేసామో

 కపీశా-కుప్పిగంతులేసామో

చెప్పరాని ముప్పులు తీరిపోని అప్పులు-

ఎన్నని చెప్పుదు మా తిప్పలు

సీతమ్మ కష్టాన్నే తీర్చిన -శ్రీరామ బంటూ

నమ్మితి నీవే మాదిక్కంటూ


2.రోగాలూ నొప్పులు- వెతలూ నలతలు-

మానిపోని మా గుండె గాయాలు

అడ్డంకులు సంకటాలు అడుగడుగున కంటకాలు

బ్రతుకంతా కందకాలు

సంజీవని కొండను తెచ్చి లస్మన్న పానంగాచిన మారుతి ఇక నీవే నాగతి

 https://youtu.be/VRngHBwU09M


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


పడమటి కొండల చాటుకు వెళ్ళెను సూర్యుడు

జంటల విరహపు మంటలనార్పగ దినకరుడు

కవితకు వస్తువు తోచక తల్లడిల్లె కవివర్యుడు

నవరసాలలో సరసం ముసరగ తనువూరడిల్లెను


1.ప్రేమా ప్రణయం శృంగారం కవితను ఆశ్రయించెను

ఎడబాటు ఎదిరిచూపు నిట్టూర్పు మదినావరించెను

తొలిప్రేమలో తడబాటుగా ఎదురైన యువ ప్రేమికులు

చిరకాలం కలయిక కలగా కుదేలైన నవ దంపతులు

ఉబలాటం చాటున ఒకరు- ఆరాటం పంచన ఇంకొకరు


2.కాపురమే గోపురంగా మలచుకొన్న వారు

ముదిమిలోనూ ఒకరికి ఒకరై నిలిచిన తీరు

బాధ్యతలు బంధాలు బంధనాలై ఆలుమగలు

శేష జీవితం శాంతినికోరే పండు మదుసలులు

అన్యోన్యం బాసటగా ఒకరు- వృద్దాప్యపు ఆసరాగా ఇంకొకరు

 https://youtu.be/ysWLHbUndhk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:రేవతి


భూతపతి మరుభూపతి

శైలజాపతి పశుపతి

కైలాసపతి కైవల్యపతి

శంభో నీవే నా గతి శరణాగతి

చేర్చరా వేగమే నన్ను సద్గతి


1.హక్కు నీకుంది నను అక్కున జేర్చగా

   దిక్కు నీవంటి ఈ దీనుని పరిమార్చరా

   కాలకాలా కపాలమాలా ధరా హరా

   త్రిశూలపాణీ త్రిపురాసుర సంహారా


2.ప్రళయ తాండవ రుద్రా  నృత్య ప్రియా

   ప్రణవనాదేశ్వరా ప్రభో మృత్యుంజయా

  ప్రమధనాథా విశ్వనాథా నమఃశివాయా

  ప్రస్తుతించితి దయసేయగా దయాహృదయా