రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
దాహాన్ని తీర్చేటి నది నీ మది
తోడునీడ నిచ్చేటి తరువు నీ తనువు
నీ అనురాగం నను తడిపేను మేఘమై
నా జీవితాన అడుగిడినావే చెలీ రసయోగమై
1.హరివిల్లులె నీ బుగ్గల్లో సిగ్గు బిడియాలు
విద్యుల్లతల పుట్టిళ్ళు మన్మోహన నీ హాసాలు
జలపాత వేగాలు వంకలేని నీ పనిపాటలు
నీవు నడయాడే చోట వెలసేను విరితోటలు
దాహాన్ని తీర్చేటి నది నీ మది
తోడునీడ నిచ్చేటి తరువు నీ తనువు
నీ అనురాగం నను తడిపేను మేఘమై
నా జీవితాన అడుగిడినావే చెలీ రసయోగమై
2.నీ మేను అందంకన్నా నీ మనసే సుందరం
నీలో నేను మెచ్చే గుణమే నీవుచేసే పరోపకారం
మంచులా కరిగుతుంది నీ దయార్ద్ర హృదయం
దీపమల్లె వెలుగిస్తుంది ఆదరించు నీ సౌశీల్యం