రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
నాకిచ్చుడేమి వద్దు బులిపిచ్చుడింక వద్దు
కాంతా కనకాలనసలు ఎరవేయగా వద్దు
నిన్నడుగుడు వదిలేసా ఆ చెడుగుడు మానేసా
సమర్పించ సిద్ధపడ్డా నా బ్రతుకు నీ పదాల వద్ద
అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా
అనఘా ప్రియా లీలాలోలా త్రిమూర్తి రూప చిదానంద భవహరా
1.నాయిలాలు నీకడ నాలుగు వేదాలు
ఇంద్రియాలు మదముడిగి నీకు అధీనాలు
అరిషడ్వర్గాలెపుడూ నీకామడ దూరాలు
చేర్చగలవు సులువుగా భవసాగర తీరాలు
అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా
అనఘా ప్రియా లీలాలోలా త్రిమూర్తి రూప చిదానంద భవహరా
2.కార్తవీర్యార్జునుని కనికరించినావు
వ్యసనాల బానిసగా లీల ప్రదర్శించావు
అవధూతగ అడుగడుగున దర్శనమిచ్చెదవు
గురు పరంపరకు నీవు ఆదిమూలమైనావు
అత్రి పుత్రా అనసూయ సూనా గురుదేవ దత్త దిగంబరా
అనఘా ప్రియా లీలాలోలా త్రిమూర్తి రూప చిదానంద భవహరా