Friday, October 18, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ఘూర్జరి

కత్తులకే అర్పణం
నెత్తుటితో తర్పణం
ఇదే కదా ఈనాటి ప్రేమపురాణం
ఇంత పలుచనయ్యిందా పావన ప్రణయం

1.ఆమ్లదాడి చేస్తుంది ఒక ప్రేమ
బ్లేడుతొ మెడ కోస్తుంది ఒక ప్రేమ
అత్యాచారం సలుపుతుంది ఒక ప్రేమ
బ్లాక్ మెయిల్ చేస్తుంది ఒక ప్రేమ
కీడుచేయ కోరుతుంటే అది ప్రేమ ఎలా ఔతుంది
కాడుచేర్చ పూనుకొంటె అనురాగమా అది నిజ ద్రోహమౌనది

2.తొలిచూపుల ఆకర్షణ నేటి ప్రేమ
తొందరపాటు చర్య అందుబాటు ప్రేమ
నెచ్చెలులుంటేనే యువతకు ఒక హోదా
పెళ్ళివరకు వస్తేనే అసలైన ప్రేమగాధ
ప్రియులను మార్చడం మంచినీళ్ళ ప్రాయం
ప్రేమను ఏమార్చడం అత్యంత హేయం,కడుదయనీయం