Sunday, February 12, 2023

 https://youtu.be/9GnINEVaI4w?si=OKNA7SJT2kX_of_p

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


శివుడిని మించిన ప్రేమికుడెవరు

అర్ధదేహమే ఉమకిచ్చినాడు

బ్రహ్మకన్ననూ ఇల భావుకుడెవరు

నాలుకపైన వాణికి బసకూర్చినాడు

సిరినురమున దాల్చిన హరికెవరు

ధరలో సరి ప్రణయారాధకుడు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


1.రంగూ రుచీ వాసన లేనిది ప్రేమ

రూపం దేహం ప్రాణం ఉన్నది ప్రేమ

అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమ

ఋజువు సాక్ష్యం లేని నియతి ప్రేమ

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


2.ఆకాశమంత ప్రేమ ఆకాశం ప్రేమ

కాలమున్నంత కాలం కలిగే ప్రేమ

కలకాలం కల ప్రేమ- కలలలోకం ప్రేమ

ప్రేమనే ప్రేమిస్తారు -వ్యక్తులను వదిలేస్తారు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం

 https://youtu.be/Ybf1VFS6wgs


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:శుభ పంతువరాళి


ముగియనీయవయ్యా ప్రభూ

ఈ అసమర్థుని జీవయాత్ర

తెరదించవయ్యా తప్పుకొనగ

నవ్వులపాలైననా విదూషకపాత్ర


1.అభిమానం అణువంత

అవమానం అవనియంత

వెరసి దుఃఖమే ఫలితం

నా దుర్భర జీవితమంతా

అర్ధాంతరమనకుండా ఆపివేయిస్వామి

ఆసాంతం మనకుండా నలిపివేయవేమి


2.బట్టకట్టినావు గట్టిగ నామూతికి

 విందుముందు పెట్టినావు నాకేటికి

అందుబాటులోనే ఉంది ఆనందము

అనుభవించ నోచని దౌర్భాగ్యచందము

ఉట్టికెగిరే పట్టులేదు స్వర్గయోచన హేయము

పట్టుకొందు నీపాదాలను అదియె నా కైవల్యము

 https://youtu.be/0bF52r9xxEA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

 

రాగం:శివరంజని 


నాది తిరోగమనం,

నీది పురోగమనం…

కలనైన కలువలేము మనం

వీడ్కోలు నీకిదే విడిపోయే ఈక్షణం

తీరితీరాలి మరుగయే నేస్తమా

ఎప్పటికీ నీ మనోకామనం


1.తుడిచివేస్తున్నా మదిలో నీ జ్ఞాపకాలని

చెరిపివేస్తున్నా ఎదపై నీ సంతకాలని

ఎన్నడనుకోకు నాపేరైనా పలకాలని

గతకాలపు స్మృతులన్నీ చితిలో కాలని


2.పొందినాను ఆనందం నీకేది ఈయకనే

విసిగించా పలుమార్లు సాయమేది చేయకనే

ఊహించాను ఎక్కువే ఉన్నదెంతొ తోయకనే

నీ వెంటపడిపోయాను నీవేంటో తెలియకనే