Saturday, September 26, 2020

 

https://youtu.be/FqY-IBMp0yI?si=qllOsk_m6UADsw5C

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కట్టుకోను పట్టుబట్టలేదు-ఇంటికేమొ పై కప్పులేదు

పెట్టుకోను పైడి నగలేదు-మబ్బుల్లొ తిరుగాడె ఎకిరింత లేదు

అయ్యయ్యో మా శివ్వయ్య-అన్నాల మింతగ ఏందయ్య

లోకమంతా ఏమైతెనేమి- నీకింక నేనైతె ఉన్నాయ్యా


1.వల్లకాడా మంచుకొండా నీవుండేందుకు

చితి బూడిదా ఏనుగుతోలా- ఒంటిని చుట్టేందుకు 

నా గుండెలొ మస్తు చోటుందయ్య

లచ్చనంగ నువ్వుండిపోవయ్యా

నాచిత్తమైతె పట్టు వస్త్రమేనయ్య

నీ చుట్టూర చుట్టి కట్టుకోవయ్యా


2.బిచ్చమడిగి తినగా నీకొక పుర్రె బొచ్చెనా

ఎక్కితిరుగ నీకైతే ఎద్దుమాత్రమున్నదా

కలోగంజొ కడుపు నింపుతానయ్యా

నా పానమల్లె చూసుకుంటానయ్యా

ఆశల రెక్కల గుర్రమున్నది ఎగిరిపోగా

నా మనోరథము నీదేమరి ఊరేగిరాగా


https://youtu.be/RAkNLXC8gos?si=JhK-LMpmEm23a6lu


ఏనాటికైనా చేరేదినీ పాదాల కడకే

ఏ తీరుగానైన తీరేనుగా- నిను వేడగా నా వేడుకే

అలనాటి నుండి నీ అలవాటుగా 

శరణాగతినీయగా నీకు వాడుకే

తిరుమలరాయా నేను పరాయా నమోనమః

గోవింద ముకుంద అనంత నామధేయా నమోనమః


1.ఏపూటనొ ఏచోటనొ  రేయి పగలు ఏవేళనొ

ఇంటనో బయటనో ప్రమాదాన ఆకస్మికముగనో

సుదీర్ఘవ్యాధి బాధలతో ఏమనో వేదనలతోనో

ఈ పాంచభౌతిక దేహం పంచభూతాలకాహుతియౌనో

ననుమాత్రం మరవకు మాధవాయ నమోనమః

చేయినైతె వదలకు చక్రధరా నమోనమః


2.అనాయాస మరణముకై వినయముతో నా వినతి

సునాయాస నిహతికై సదానీకు నమస్కృతి

అంత్యకాలమందు నీ స్ఫురణలో కడతేరనీ

అపమృత్యువందుగాని నీ స్మరణలో మృతిరానీ

 నీ ధ్యాస దయచేయి దామోదర నమోనమః

నీ ధ్యానము తప్పనీకు శ్రీధరా నమోనమః

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కరువాయే మనకు మాటలే 

బద్ధకించె ప్రకటించగ అక్షరాలే

కొఱతాయే కొద్ది క్షణాలే

బరువాయే ఎద స్పందనే

ఆసరాగా మారే ఎమోజీ గుర్తులే

ఆలంబన చేకూర్చే గ్రాఫిక్కుల పిక్కులే


1.సామాజిక మాధ్యమాలె వేదికాయే

టైపింగ్ చేయగా వేళ్ళకే నోళ్ళాయే

మది కదిలించినా భావన మూగవోయె

ఉద్వేగం చెందినా భాష ఊతకాదాయే

ఆసరాగా మారే ఎమోజీ గుర్తులే

ఆలంబన చేకూర్చే గ్రాఫిక్కుల పిక్కులే


2.మొక్కుబడిగ చేసేటి లైక్ లు

మొహమాటం కొద్దీ వ్యాఖ్యలు

మోతభారమయ్యే ట్యాగ్ లు షేరింగ్ లు

వితండవాదాల విద్వత్సభలు

ఆసరాగా మారే ఎమోజీ గుర్తులే

ఆలంబన చేకూర్చే గ్రాఫిక్కుల పిక్కులే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తేనే కళ్ళ చిన్నదీ తెగనీల్గుతున్నది

సొట్టాబుగ్గల చిన్నదీ సోకులుపోతున్నది

అబ్బదీని సింగారం దీని ఒళ్ళె బంగారం

పంటినొక్కునొక్కిందా చిత్తం కాస్త గోవిందా

సిగ్గులొలకబోసిందా గుండె జారి గల్లంతా


1.దిష్టిచుక్క అయ్యింది గద్వమీది పుట్టుమచ్చ

వలపుపట్టు అయ్యింది మట్టమీది పచ్చబొట్టు

వంకీల ముంగురులే - పలికె స్వాగతాలు

ఓరకంటి చూపులే-రాసె ప్రేమలేఖలు

వశమైపోదా మనసే పరవశమై

బానిసకాదా బ్రతుకే దాసోసమై


2.జారగిల నిలబడితే అజంతా జీవచిత్రమే

వాలుజడ ముడిపెడితే హంపి కుడ్యశిల్పమే

బొటనవేలు నేలరాస్తే బాపూ కుంచె బొమ్మనే

పెదవివిప్పి నవ్విందా దివ్య స్వప్న సుందరే

సొంతమైతె ఏముంది -భవ్య భావన

సంసారం సాగరమై నిత్య వేదన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరణం లేదు ఇలలో పాటకు

బేధం లేదు బాలుకు పాటకు

అనునిత్యం వినువిందు చేసే అమరుడే బాలు

బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో సదా గంధర్వగానాలు


1.కోదండపాణి సారథికాగా

పూరించెను దేవదత్తం అప్రతిహతంగా

సినీమాయారంగంలో రాణించాడు పాత్రోచితంగా

నలభైవేల గీతాల సుదీర్ఘ ప్రస్థానం

భారతీయభాషలెన్నటిలోనో మధురగానం

ఓకే ఒక్క శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం

మొన్నా నిన్నా నేడూ రేపు ఎప్పుడూ ఎల్లప్పుడూ ధన్యం


2.దివిలోవిరిసిన పారిజాతం భువికి దింపాడు

శంకరాభరణాన్ని సైతం గళమున దాల్చాడు

సాగరసంగమాన్ని అమృతంగ పంచాడు

కులమతాలకతీతమౌ రుద్రవీణ పలికించాడు

బాలు పాడని పాటలేదన అతిశయోక్తి కానేకాదు

తీయగా పాడేవారికి దిక్సూచియే యన వింతేమిలేదు

పాడుతా తీయగా పాడుతీయగా పాడుతాతీయగా అంటూ కదిలాడు


3.రాసుకుంటు పోయేకవికి అలుపురాక తప్పదు

పదివేల చరణాలైనా పాటపూర్తి కానేకాదు

కావ్యంలో చెప్పే భావం గేయంలో సాధ్యమయేనా

ఏకోణం తీసుకున్నా బాలు చరిత భారతమే

గుప్పిటిలో విశ్వం పట్టగ ఘనకవులకైనా తరమే

 చిరంజీవిగా బాలు సతతం శ్రోతలనలరిస్తాడు

అభిమానుల గుండెల్లో ప్రాణంగా జీవిస్తాడు