Thursday, February 2, 2023

 https://youtu.be/gE227kQLKbU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


స్వరములు ఏడే సరిగమపదని

పంచుతాయి వీనుల విందగు సుధని

ఎదలకందించుతాయి ఆహ్లాద మధురిమని

ఆలపించినా ఆలకించినా గానం ఉభయతారణి


1.అలసిన మేనుకు వింజామర పాట

విసుగు చెందియున్నవేళ మదికూరట

ఎడారి దారులలో ఎదురయే తేనె ఊట

ఏకాకి జీవితాన ఏకాంతవాసాన నేస్తమంట


2.కాలిన గుండెలకు హాయగు నవనీతం

  మండే వేసవిలో తుషార జలపాతం

వసంత యామినిలో మంజుల మారుతం

నలతల కలతల నోకార్చే ఔషధం గీతం

 https://youtu.be/Z5YXvrqTYTM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నిత్యపూజలివె నీకు నరకేసరి

ప్రత్యక్ష దైవమా ధర్మపురి నరహరి

భక్తిమీర కొలిచేము శంఖచక్రధారి

అనురక్తి మము బ్రోవవే శ్రీహరి


1.ప్రాతఃకాలాన సుప్రభాత గీతాలు

గౌతమీ తీర్థముతొ దివ్యాభిషేకాలు

పంచోపనిషత్తుల సహితమైన సన్నుతులు

జనుమంచి వంశజులచే శ్రీగంధ లేపనాలు

తులసి కుంకుమార్చనలతొ కైంకర్యాలు

ఘనపాఠీలు అర్చకస్వాముల ఆరాధనలు


2.అనునిత్య కళ్యాణ ఉత్సవాలు

కుంభ నక్షత్రాది పంచవిధ హారతులు

పులిహోర చక్కెర పొంగళినైవేద్యాలు

యాత్రీకులందరికి నిత్యాన్నదానాలు

తీర్థ ప్రసాదాల నిరంతర వితరణలు

రాత్రివేళ స్వామీ పవళింపు సేవలు




*_నా youtube channel కి ఇంకా సబ్ స్క్రైబ్ చేయకుంటే దయచేసి చేయండి,చేయించండి_*

 https://youtu.be/mQewJLr5uy0


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


పరమదయాళువు నీవు వీర రాఘవా స్వామీ

తిరువళ్ళూరు తిరవాసా నీకు నమోనమామి

పద్మనాభ  పురుషోత్తమ పాహి ఫణిపతి శయనా

ఆయురారోగ్య వరదా దేహిమే సూర్యచంద్ర నయన


1.నినునమ్మి కొలిచితె చాలు సమసేను దీర్ఘవ్యాధులు 

నిను మది తలచితె చాలు  తొలగేను మనోరుగ్మతలు  

సకలరోగ ఔషధాలు నీ చెంతన సులువుగా లభ్యము

మా చింతలు దీర్చే చింతామణి నీవన్నది సత్యము


2.వసుమతి నామాంతర కనకవల్లి ప్రియపతివి 

వైద్య వీర రాఘవమూర్తిగా వరలు విష్ణుమూర్తివి

శాలిహోత్రమహాముని తపఃఫలాన ఇలవెలిసితివి

పరిమళ తైలాభిషేక అభిలాషివి క్లేశనాశి పెరుమాళ్ళవి

 https://youtu.be/Ej78zAEoWLA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాధను కాదన్నాడు-మీరాను మరిచాడు

అష్టభార్యలున్నా నిన్నే ఇష్టపడినాడు

గోపికలు వేలున్నా నీవెంట పడినాడు

అంగజ జనకుడినే అలరించిన మంజులతాంగి

సంగతులు పలుకవా నీ అంగాంగం కనగ నా ఎదపొంగి


1.లక్షకావ్య రచన చేయవచ్చు నీ మేని లక్షణాలకు

కోటి కృతులు వెలయింపవచ్చు నీబోటి ఆకృతులకు

వందలాది ప్రబంధాల్లొ వర్ణణలేదు నీ అందచందాలకు

కనీవినీ ఎరిగిన దాఖలాయేలేదు సఖీ నీసోయగాలకు


2.మేనక వెనక పడకపోవు విశ్వామిత్రుడు నీవెదురైతే

అహల్య శిలగా మారే వ్యధ తప్పెడిది ఇంద్రుడు నినుచూస్తే

శకుంతలకు చింతదూరమయ్యడిది దుష్యంతుడు నినుగాంచితే

పరమశివుడు నిన్నే మోహించెడివాడు నువు తారస పడితే

 https://youtu.be/B_iIwz-5QiM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మనిషంటే కులం ?-మనిషంటే మతం?

మానవీయమయ్యింది ఎపుడో విగతం !

నా సువిశాల దేశంలో సంకుచిత సమాజంలో

లౌకికతకు ఏదీ ఊతం ఏకత్వాని కేల విఘాతం


1.కులం ఫలానా మతం ఫలానా అంతమాత్రమేనా

భారతీయత జాతీయత పౌరులమదిలో హుళుక్కేనా

ప్రలోభాలకు ప్రభావాలకూ ఓటెప్పటికీ తాకట్టేనా

నోటును ఓటుగ మార్చే గారడి ఆటలు ఇక కట్టేనా


2.నేను నాది నాస్వార్థం బాటలో దేశయవత

చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్షగ మారిన మానసికత

ఓటువేయుటకు సెలవిస్తే ఇల్లే దాటని అలసత్వం

ఓటుకు ఉన్న విలును ఎరిగితె నవ్య రాజకీయం

భవ్య భారతీయం


*Plz subscribe to my youtube channel CLASS*