Saturday, October 2, 2021


ఆనందాల జలధివి నీవు

నయగారాల నిధివే నీవు

నీ మాటల ముత్యాలు నేనేరుకుంటా 

నీ నవ్వుల రతనాలు నే దాచుకుంటా 

నీ తోటి సావాసం –పూర్వకర్మ పుణ్య విశేషం 

నీ స్నేహ మాధుర్యం-ఈ జన్మకో వరము


1.మనసెరిగీ మసలుకొనే నేస్తానివి

మనసారా కోరుకునే సమస్తానివి

నా జీవితంలో ఒక భాగమైనావు

నా భవిష్యత్తుకే మార్గదర్శివైనావు

నీ తోటి సావాసం –పూర్వకర్మ పుణ్య విశేషం 

నీ స్నేహ మాధుర్యం-ఈ జన్మకో వరము


2.నా హృదయ పుస్తకం చదివేసినావు

నా మస్తకాన్ని సైతం సంగ్రహించినావు

కల్లోల వేళల్లో నిజమైన సాంత్వన నీవు

కన్నీరు తుడిచేటి ఆత్మబంధువైనావు

నీ తోటి సావాసం –పూర్వ కర్మ పుణ్య విశేషం 

నీ స్నేహ మాధుర్యం-ఈ జన్మకో వరము