Thursday, September 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పదముల నా గీతుల తలదాల్చనా

నీ పదముల నే ప్రణతుల తలవాల్చనా

షిరిడీపుర శ్రీ సాయి నీ తావు ద్వారకమాయి

తెరిచాను నా హృదయం దయతో దయచేయి


1.చల్లారని ఒక ధునిగా మండుతోంది నా ఎద

కారుణ్యరసధునిగా మది పాడుతోంది సర్వదా

సాంత్వన చేకూర్చే సద్గురుడవు నీవే కదా

స్వాగతమిదె సాయి అందించగ పరసంపద


2.ఎండిపోయింది నా గుండె లేండివనము

పారించు సాయి పదాల జ్ఞాన నదము

పంచహారతులుగా పంచప్రాణాలు గొనుము

జీర్ణమాయే దేహకఫిని స్వీకరించి ధరించుము

Wednesday, September 29, 2021

సౌమిత్రి సతి సల్పినా ..త్యాగమ్ము కొనియాడ తరమాయేనా..
ఊర్మిళా పాతివ్రత్యమ్ము ..ముల్లోకముల కాదర్శ ప్రాయమేగా 

1.అన్న మాటను అన్న బాటను 
జవదాటనీ..పతి లక్ష్మణ స్వామినీ 
బాసటగ నిలిచి సాగనంపింది 
సాధ్వి ఊర్మిళ తా సగర్వమ్ముగాను

2.జనకుడి౦టను జన్మ దాల్చిన రాణి
దశరథుడి కోడలై అడుగిడిన పూబోణి
అచ్చటా ముచ్చటా తీరలేదెచ్చట
పతియానతిని ఎపుడు  మీరలేదకటా.. 

3.మగడు తగదన్న నిదురను తాను గైకోన్నది
పదునాలుగేళ్ళు మగతలో తానున్నది
భ్రాతృ సేవకు లక్ష్మణుడు విశ్వ విఖ్యాతుడాయెగా
రామాయణమ్మున ఊర్మిళ పాత్ర చిరస్మరణీయ మాయెగా

Monday, September 27, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇంటి ముందే శివా నీ పంచాయతనం

కంటి ముందే హరా చంద్రశేఖరా నీ దివ్య దర్శనం

నీసన్నిధిలోనే గడిచె అనుదినం నా బాల్యం

ఇంతకుమించీ అవసరమా పొందగ కైవల్యం


1.నమచమక సహిత నిత్యాభిషేకాలు

హరహర మహాదేవ నీ నామ శ్రవణాలు

నిను కీర్తించే వేద పారాయణాలు

మైమరచి ప్రవచించే నీ పురాణాలు


2.ఉత్సవాలందున నీ లీలల హరికథలు

పర్వదినాలలో నీ సంతత సంకీర్తనలు

సోమవారాలలో ప్రదోషోపవాసాలు

ఐహికా ముష్మికమౌ వాదోపవాదాలు

 నువ్వంటే పిచ్చేమరి కొందరికి

నువ్వంటే నచ్చవు మరికొందరికి

సాయి నిన్ను సాయబుగా చూస్తారెందుకో

సాయి నీకు మతమంటగడతారేలనో

మానవీయ విలువ తెలుపు మహనీయడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


1.రోగాలు రుగ్మతలు ఎడబాపిన వైద్యుడవే

ద్వేషవైషమ్యాలు పోకార్చిన సిద్ధసాధ్యుడవే

మానవాళికంతటికీ నిత్య ఆరాధ్యుడవే

జీవకారుణ్య వ్యాప్తికి సాయి నీవు ఆద్యడవే

మానవీయ విలువ తెలుపు మహనీయడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే


2.పిలిచినంత పలికేవని నుడివెదరెందరో

తలచినంత ఎదుట నిలుతువందురెందరో

నిన్ను నమ్మి నేను సొమ్ముచేసుకున్నదేమిటని

స్పష్ట పరచు ఇకనైనా అభీష్టమొకటి తీర్చెదవని

మానవీయ విలువ తెలుపు మహనీయడవే

అందరినీ చేరదీసి ఆదరించు వాడవే



Sunday, September 26, 2021

 పండితులకు ఆనదు

పామరులకు చేరదు

ఎవరి కొరకు నా కవితో తెలియదు

ఎంతవరకు నిలిచేనో సందేహం తీరదు


1.ఛందస్సునకు నెలవేకాదు

వ్యాకరణానికి తావే లేదు

ప్రతీకలలో ప్రత్యేకతా లేదు

ఏదీ లేక ఇది కవితైతే కాదు


2.శ్రుతిలయకైతే గతిలేదు

రాగతాళమిదమిద్ధం కాదు

గొంతులో మాధురి జాడే లేదు

ఏదీ లేక నా పాటెపుడూ చేదు


Friday, September 24, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మూడు నామాలవాడు
మూడు ముడుల బంధం కాపాడు
ఏడు కొండల రేడు
ఏడు జన్మలకూ ముడిపెడతాడు
దంపతులను బంధించే ఆ దారం స్వామి
అనునిత్యం మన బ్రతుకునకాధారం స్వామి

1.మనసు నిలువనీయని మహా మాయలోడు
వాసనల మత్తులో వింతగ ముంచెత్తుతాడు
ఎంతటివాడికైన ఏదో చింత కలుగ జేస్తాడు
సంసార సాగరాన మునకలు వేయిస్తాడు

2.ఉన్నచోట ఉండనీడు ఉట్టికైన ఎగురనీడు
ఎండమావుల వెంట పరుగులు తీయిస్తాడు
నోటి ముందు కూడు కూడ అందకుండ చేస్తాడు
నమ్మాలో కూడదో ఎరుకనెరుక పరుచనీడు

Tuesday, September 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:రాఖీ


చేయలేదు ఇసుమంతయు పుణ్యము

ఇచ్చినావు దండిగానె వరములు

మ్రొక్కలేదు మిక్కిలిగా మొక్కులు

ఎక్కించినావు ఎందుకో అందలాలు

ఏడుకొండలవాడా నీగుండె ఎంత మెత్తనైనదయా

ఆపదమొక్కులవాడా అనితరసాధ్యమయా నీదయ


1.పలుకులందు పంచదార కోరుకుందుమా

ఒళ్ళంతా నింపి మరీ ఊరడింతువా

హృదయాన్ని కరడుగట్టనీయకందుమా

చిట్టి ఆటుపోట్లకే తట్టుకోనట్టు జేతువ

గోరంత వేడితే ఊరంత నీదందువ

అడుగునేల నడుగకున్నా ఆరడుగులనిత్తువా


2.లౌక్యమీయకున్న నేమి నామాల స్వామీ

కరుణతోడ పరసౌఖ్యమీయవయా

శాంతమీయకున్న నేమి వేంకట స్వామీ

కృపమీరగ సాయుజ్యమీయవయా

ఆటలింక చాలించు అలసి సొలసిఉన్నాను

చోటిస్తే చాలు నీ పాదాల వాలుతాను


https://www.4shared.com/s/fv91TQQzvfi


https://youtu.be/SDdFPB7WUA4?feature=shared

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అష్టోత్తర గీతాలతొ ఇష్టపడి కీర్తించితి

స్పష్టము కాలేదా ఇప్పటికీ నా వినతి

అదృష్టము లేదా నాకిక వేంకటాచలపతి

గతిగాన నినువినా అన్యధా శరణం నాస్తి


1.కలియుగ వైకుంఠమే తిరుమల తిరుపతి

కలౌ వేంకట నాయకః అని కదా ప్రతీతి

మనసా వాచా కర్మణా నిన్నే స్వామి నమ్మితి

ఎప్పటికిక దొరికేనో నీ కరుణా కటాక్ష ప్రాప్తి


2.పరిపూర్ణత నొందలేదొ నీమీద నా భక్తి

ఐహిక విషయాలు మినహా లేదా నీపైఅనురక్తి

గడ్డు సమస్యలడ్డుంటే ఇంకేదగు అసక్తి

దొడ్డ మనసుగల స్వామి ప్రసాదించు విముక్తి



 https://youtu.be/9ADf6y-cTA4?si=X_JB2IZbSi-T-zXR

రచన,స్వరకల్పన&గానం:రాఖీ


రాగం:శంకర


గంగాంతరంగా నమో రామలింగా

నీ గళమైతె గరళసహితము

నా కంఠము ఏలనయ్య కర్కశము

తేనియ గీతముల నీ అభిషేకము

చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము


1.పంచామృతధారలతో నమకచమక  స్తోత్రముతో

పంచాననా నీకు పరిచారము లొసగెదను

మారేడు దళములతో నిన్నర్చించెదను

మార్ధవమే నాగొంతున పలికించగ ప్రార్థింతును

తేనియ గీతముల నీ అభిషేకము

చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము


2.అనాలంబి వీణియధర సంగీత శాస్త్రకార

ఆనందతాండవ కేళీలోల నటరాజేశ్వరా

ఢమరుక వాద్యాన్విత లయయుత లాస్యప్రియ

శృతిపక్వ గమక గానవరదాయక పరిపాలయ

తేనియ గీతముల నీ అభిషేకము

చేతును నాకీయవయ్య గాత్ర మాధుర్యము

Saturday, September 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:బీంపలాస్


అతి సామాన్యుడ నే స్వామి

మితి మీరి నాతో సయ్యాటలాడబోకు సుమీ

చతికిలబడితిని వేంకటాచలపతి

గతినీవే నాకిక శ్రీపతి కోరితినిదె నీ శరణాగతి


1.నిగ్రహమున్న తాపసినసలే కాను

నిష్ఠగ దీక్షతొ నిను మెప్పించగలేను

ముడుపులు కాన్కలు వేడ్కగనీయలేను

.ఉడుపులు తొడవులు సమర్పించగాలేను

నువుపెట్టే ప్రతి పరీక్ష నాకు కఠినశిక్షయే

 ప్రతీక్షింప అలవిగాదు స్వామీ రక్షింపవే


2.పరాచికాలు సలుప పద్మావతి చాలుగా

కేళీ వినోదమైతే అమ్మ   అలమేలు మేలుగా

భక్తులనే కాల్బంతిగ ఆడుటయే న్యాయమా

కడగళ్ళతొ కన్నీటి పాల్జేయగ పాడియా

కొత్తది అడగకుండ ఉన్నది తొలగింతువే

చీకటి గుప్పిస్తివీవే దివ్వెను వెలిగించవే

Tuesday, September 14, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


రాధగా మారితే-బాధలన్ని తీరులే

కన్నయ్యని మదిలో నిలిపితె-వెతలన్ని ఆరులే

హృదయమే బృందావని చేసి

అధరాలు వేణువుగా మలచి

తనువునే పరిచానంటే 

మనసార పిలిచానంటే

అరుదెంచుతాడు నాకై మాధవుడు-

అయితీరుతాడు తానే నా విధేయుడు


1.ముడుపు కట్టి ఉంచాను ముద్దులన్నీ

ఉగ్గబట్టి దాచాను వలపులన్నీ

సిగ్గు పడక వదిలేసాను నాకున్న బింకాలన్నీ

నిగ్గుదీర పోషించాను నావైన పొంకాలన్నీ

చూపుల విరి తూపులనే సంధించానంటే

కమ్మని బిగి కౌగిలిలో బంధించానంటే

వశమైపోతాడు నాకే మాధవుడు

అయితీరుతాడు తానే నా విధేయుడు


2.కళ్ళలో వత్తులువేసి ఎదిరి చూస్తున్నా

అలికిడి ఏమాత్రమైనా చెవులు రిక్కిస్తున్నా

అన్యధా శరణం నాస్తిగ ఆరాధిస్తున్నా

త్రికరణశుద్ధిగా సర్వదా ధ్యానిస్తున్నా

రక్తికొరకు రాకున్నా భక్తితోటి మెప్పిస్తా

వచ్చేదాక పట్టువీడక మొండిగా రప్పిస్తా

చేరదీస్తాడు తప్పక మాధవుడు

అయితీరుతాడు తానే నా విధేయుడు

Monday, September 13, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆరాధనంటే ముజ్జగాలలో ఆరాధదే

అద్వైతమంటే అది రాధామాధవీయమే

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస


1.ఇహమును విరమించి అహమున రమించి

పరమాత్మనైను అంతరాత్మలో గాంచి

జీవనసాగరాన అంతర్మథనమే గావించి

సంగమ సాఫల్యమందు సుధనే సేవించ

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస


2.పరమానందమందు పరవశమొంది

పరస్పరం పరిష్వంగ తన్మయమే చెంది

అధరపుష్పాలలో మకరందము నంది

బింబము ప్రతిబింబము ఐక్యము నొంద

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క గుణింతమే కదా జీవితం

కనకం కాంత కిరీట కీర్తులకే అంకితం

కుడిచినదాదిగా అమ్మపాలు పసినాడు

కూలి పోయి చేరునంతదాక కాడు

అక్షరమై మొదలౌతుంది

అక్షరమై కడతేరుతుంది


1.కృష్ణగీతనాచరించ క్రూరకర్మలంతరించు

కెడయికయే నీడైనా కేలొసగిన తరించు

కైవల్యమె ధ్యేయముగా కొత్తెమలా విస్తరించు

కోరికనే త్యజించగా జీవన కౌతుక నిస్తరించు

అక్షరమెరుగుటయే ఆత్మజ్ఞానము

అక్షరముగ సాగాలి నిత్య ధ్యానము


2.కలియుగాన కాత్యాయిని కిణ్వ వారిణి

కీర్తన జేయగ కుమారసువు కూర్చు కూరిమి 

కృతకమాయె బ్రతుకు వికృతమాయే మేధ

కైంకర్యము చేసినంత కరుణించును జనని క్షేమ

అక్షరముతొ సావాసము

అక్షరమున ఆవాసము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనిషే పశువైన దుష్కృత వేళ

మగాడే మృగాడైన వికృత హేల

కుతిదీర్చుకొనగ ఆడశునకమైనా హతవిధీ సరే

పసిమొగ్గలైను చిదమగ నికృష్టుల నేమందురే


1.మదపిచ్చి పెట్రేగ నరరూప రాక్షసులై

పురుషాంగపు యావలో కామపిశాచులై

వావిలేక వరుసలేక వయసు ధ్యాసనే లేక

సలిపిన బలత్కార చర్యకు పీకలోనె పసికేక


2.ఆడదై పుట్టడమే అవనిలొ ఒక శాపంగా

స్త్రీ శీలపు రక్షణ వైఫల్యం  జాతికి లోపంగా

అభంశుభం తెలియని ఆడశిశువులే సమిధలై

మానవాళి సిగ్గుపడే అత్యాచారాలే నిత్యం వ్యధలై

Saturday, September 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రకటితమవుతావు ప్రతి తావు

ఆపన్నులనాదుకొనగ అభయహస్తమిసావు

వేంకటరమణా యనే భక్తుల మొరలు వినే

కలియువరదుడవే కరుణాభరణువే

గోవిందా ముకుందా మురారి వేంకటగిరి శ్రీహరి


1.నీదే భారమని మాకాధారమని

నిజమానసమ్ముతో విశ్వాసమ్ముతో

నెరనమ్మినవారికి కొంగుబంగారమీవు

సర్వస్యశరణాగతి వేడగ ఎదుటనిలిచి

కడతేర్తువు కడలేని కష్టాల కడలి గాచి


2.దైవం మానుష రూపేణాయని నిర్ధారణకాగా

మానవుడే మాధవుడనుటకై నిరూపణగా

ఎవరో ఒకరి రూపంలో నీవే అరుదెంచి

నీ దాసుల వెతలను  చిటికెలొ తీర్చేవు

కమ్ముకున్న మబ్బులను తొలగించేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పోరి నే తేలేనేమో పారిజాత వృక్షం  

కోరితే తేలేనేమో కోహినూరు వజ్రం 

దించగా లేనేమో చందమామ నీకోసం

ఛేదించగా లేనేమో ఏ మత్స్యయంత్రం

ప్రేమనందించగలను పరులెవరు మించనట్లుగా

ఆనందింప జేయగలను ఔరా అనిపించునట్లుగా


1.ఎపుడో చేరిపోయావు నాలో నీవే ఊపిరిగా

ఎపుడో మారిపోయావు నీవే నీవే ఎదలయగా

నీతలపులె నను జో కొడతాయి రోజూ

నీ ఊహలు ఉదయం లేపడమే రివాజు

ఆరాధించరరెవరు ఇలలో నేను మినహా

అనురాగం పంచరెవరు ఇలా నా తరహా


2.గుట్టంటూ ఏమీలేదు గుండెనే తెరిచేసా

నాదంటూ లేనేలేదు జీవితాన్నె పరిచేసా

నా మనసు నీకు తెలుసనీ నాకూ తెలుసు

నీ మనసు నేనెరిగిన సంగతి నీకూ తెలుసు

తెలిసినదైనా తెలియదనడమే నీ బిడియం

తెలిసినదైనా తెలియజెప్పడం నా నైజం

Thursday, September 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్


రాగం:భీంపలాస్


నువ్వు ఎలుక వాహనమెక్కి చక చక రా చక చక రా 

నవ్వు గుజ్జు రూపముతోని గున గున రా గునగునరా

నువ్వు రావయ్య విఘ్నపతి నువ్వు పుట్టిన ఈ చవితి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


1.వాకిళ్ళలో ముగ్గులెట్టి గుమ్మాల తోరణాలు కట్టి

కళ్ళలొ దీపాలు పెట్టి ఎదిరిచూస్తున్నాం ఉగ్గబట్టి

నువ్వు రావయ్య గణపతి నిలిచిపోగా మా మతి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


2.ఇరవయ్యొక్క పత్రి పెట్టి రంగుల పూలెన్నొ తెచ్చి

మందార మాలలు కట్టి దుర్వారాలు ఏరుకొచ్చి

సిద్దపరిచాం పూజకు సిద్దిపతి చూపవయ్య సద్గతి

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి


3.మోదకాలు చేసి పెట్టి ఉండ్రాళ్ళు సైతం పెట్టి

వెలగపండు కోసుకొచ్చి పాయసాన్ని వండి తెచ్చి

నీ ముందుంచాము తినమని మా మనవిని వినమని

రావయ్య మా ఇంటిలోనికి రావయ్య ఈ మండపానికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలియుగ వైకుంఠమై ధరలొ వరలె తిరుమల తిరుపతి

సుస్థిరముగ సిరియుతముగ శ్రీహరి నిలువగా

సద్గురునాథుడై వెలిసే సాయిగా భువిని కైలాసపతి

పరమేశ్వరుడిల షిరిడీ పురములొ సిద్ధావధూతగా


1.అంగమందు అంబరాల సంబరమే కనరాదు

నివాసమనగరాని వసతే శిథిలమైన మసీదు

భిక్షాపాత్రతొ ఇల్లిల్లు దిరుగ ఆదిభిక్షువనకపోదు

చితాభస్మధారుడిలా మనకు పంచేటిది ఒట్టి ఊదు


2.భోళాతనముతో బాలకులతొ ఆటలాడు

కోపోద్రిక్తతతో దోషములను తూలనాడు

వైద్యనాథుడై ప్రబలిన వ్యాధుల ఆకీడు

పరవశమున చిందులేసి తకిటతధిమి నాట్యమాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాటగలము సాగరాన్ని సైతం

కాలికేమాత్రం నీరు తాకనట్లుగా

గడపలేము సంసార జీవితం

కంటికామాత్రం కన్నీరు కారనట్లుగా

అక్షర సత్యమిది జోహారు ప్రవచించిన ఆ కవికి

అనుభవైక వేద్యమిది ప్రభవించిన నిజ రవికి


1.సర్దుకపోయినంత కాలం సరదా దాంపత్యం

గొడవలకొకటే మూలం సైచని ఆధిపత్యం

విడాకులను మాట వస్తే వేరైనట్టే ఇది సత్యం

చావలని ఊహకైన తోస్తే చచ్చినట్టే ఇక నిత్యం

అక్షర సత్యమిది జోహారు ఎన్నో కాపురాలకు

అనుభవైక వేద్యమిది అందరి హృదయాలకు


2.చిరుచిరు కలహాలు చిలుక అలకలు

ఒకటి రెండంటూ చిలవలు పలవలు

ఒక్కరు దాల్చే మౌనం ఇరువురి పాలిటి వరం

ఎదుటివారి విసుగుకు నీ నవ్వు ముసుగు అనివార్యం

అక్షర సత్యమిది జోహారు ఆచరణీయులకు

అనుభవైక వేద్యమిది  చిరస్మరణీయులకు

 నీ పేరే వలపులకే వల

నీవేమో అభినవకోయిల

నీ అందం పోలిక కావల

నీ ప్రణయం నాకో ఎరలా

పడిపోయా నీకే నే చేపలా


1.నీ కన్నులే పున్నమి వెన్నెల్లా

నీ నవ్వులే ఆమని పువ్వుల్లా

నీ పలుకులే జలపాతాల్లా

నీ కులుకులే రాజహంసలా

వర్ణించగ యత్నించానే కవిలా


2.నీ కోసమే చెలీ నా ఎద పరిచా

నీ తలపులలో నను నే మరిచా

నా భవిత నీకై ప్రతిపాదించా

నిను మెప్పించి నీ ప్రేమ గెలిచా

ఫిదానైపోయా నీ దాసునిలా




Wednesday, September 8, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాట


జక్కన చెక్కిన శిల్పమా

రవివర్మ గీసిన చిత్రమా

సౌందర్య భావ సూత్రమా

ఆరాధ్య దివ్య గాత్రమా

బ్రహ్మకైనా భేషుగ్గా పుడుతుంది 

రిమ్మతెగులు నిన్గని అచ్చెరువొంది


1.ముట్టుకుంటె మాసిపోయే అందం నీది

పట్టుకుంటె జారే తత్వం నీ త్వచానిది 

దర్శనంతొ రెచ్చగొట్టే అంగసౌష్ఠవం నీది

స్పర్శతో చిచ్చుపెట్టే దేహమార్ధవం నీది

బ్రహ్మకైనా భేషుగ్గా పుడుతుంది 

రిమ్మతెగులు నిన్గని అచ్చెరువొంది


2.చచ్చినా సంతసమే నీ పొందు పొంది

ఎంతకాలముంటే ఏంది వ్యర్థమైన బొంది

తలతిప్పి తిలకిస్తే ప్రణయానికదే నాంది

నిమిషమైనా చాలు నీతో మనసు పరమానంది

బ్రహ్మకైనా భేషుగ్గా పుడుతుంది 

రిమ్మతెగులు నిన్గని అచ్చెరువొంది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని


నిన్ను నమ్మియుంటిని నా నెమ్మనమ్మునా

వమ్ముజేయబోకే నన్ను పరియాచకమ్మునా

అంకితమైతిని దేవీ మనసా వాచా కర్మణా 

ధన్యుడనౌదునే దయగన భైరవీ ఈ జన్మానా

అన్యమెరుగకుంటిని అంబుజాసనా

నా మనవిని విన -మననిక నిను వినా


1.నా అనురాగమే నీ సిందూరము

నా నయగారమే నాసికాభరణము

నా నవ్వులు నీకొప్పున ఒప్పారే పువ్వులు

నా కోర్కెలు నీ కన్నుల వెలిగే చంద్రార్కులు

అన్యమెరుగకుంటిని అంబుజాసనా

నా మనవిని విన -మననిక నిను వినా


2.నా ప్రణయము నిను చుట్టిన కంచి పట్టుచేలము

నా హృదయము నీ పదమున మంజుల మంజీరము

నా భావము నాజీవము సకలము నీ ప్రభావము

నా గానము నా ప్రాణము నా కలము నీతొ సంభవము

అన్యమెరుగకుంటిని అంబుజాసనా

నా మనవిని విన -మననిక నిను వినా

Tuesday, September 7, 2021

https://youtu.be/bPTBaxKn6Rg?si=IM_QY8-3VHQN-U34

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి


మనోహరివే-సౌందర్య లహరివే

మురహరి సిరివే శ్రీహరి శ్రీమతివే

శ్రీదేవీ శ్రీవిద్యా శ్రీమత్ లలితేశ్వరీ భవానీ

శ్రీ పీఠసంవర్ధిని భువనేశ్వరీ నమోస్తుతే శివానీ


1.మణిద్వీప నివాసిని సుహాసిని శ్రీవాణి

బాలాత్రిపుర సుందరీ విశ్వజనని

శ్రీరాజరాజేశ్వరీ భ్రామరీ పరాంబికే

నమోస్తుతే గౌరీ శాంకరి మూకాంబికే


2.చంద్రమౌళీశ్వరి సురముని వందిని జగన్మోహిని

మహిషమర్ధిని జ్ఞాన వర్దని సింహవాహినీ మారి

కామేశ్వరి కృపాకరీ పరమేశ్వరి కర్వరి

శాంభవి కాళీ చాముండీ చండి నమోస్తుతే దుర్గే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తిక్కశంకరయ్యవే నువ్వు

వెర్రి వెంగళయ్యవే నువ్వు

చూడబోదుమా భళా భోళానాథుడవు

ఆగ్రహిస్తెనేమో  ప్రళయకాల రుద్రుడవు


1.విరాగివనియందునా భార్యలేమొ ఇరువురాయె

యోగిగ నిన్నెంచమందువా ఇద్దరు కొమరులాయె

భోగిగ భావింతునా సర్వదా ధ్యానివి మౌనివాయె

సంసారిగ తలచెదనా సదా స్మశాన వాసివాయే


2.పసివాడి తలతెంచితివి నాడు క్రోధావేశాన

ఆలిని వరమడిగినా ఇస్తివి భక్తికి పరవశాన

భిల్లుడిగా మారి పోరి పాశుపతమునిస్తివి పార్థునికి

తిన్నని కన్నుని గ్రహించి కైవల్యమిస్తివా శరణార్థునికి

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


సమ్మోహనమే నీ సోగకళ్ళు

ఆకర్షణకలవి నీ వాలుచూపులు

మాయలొ పడవేసి మమ్ముడికించనేల

అడుగడుగున మా బ్రతుకులతో ఇల

ఆటలాడి  నిర్దయగా వినోదింతువేల


1.అగుపించెదవని ఆశజూపి

అంతలోనె అడియాసజేసి

ఊరడించెదవని ఊహజేయ

ఉసూరనిపించగ నీకిది సరియా

జగన్మోహినీ నమో జగన్మాయా


2.కాళికవు నీవు కాపాలికవు

లోకాల నేలేటి ఏకైక ఏలికవు

కేళీవిలాస విశేష విభవవీవు

లీలామాత్రము సకలవిశ్వము

ఆనంద పాత్రము నీ సూత్రము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బులాకిలో చలాకిదనం

ముక్కెరలో ముగ్ధతనం

కన్నులలో దివ్య తేజోదనం

పెదాలలో  ప్రమోదావనం

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే


1.రవిబిబంబం నుదుటదాల్చి

శశి చంద్రిక దృక్కుల నిలిపి

సదానంద ప్రసన్న రూపిణివై

చిదానంద ప్రశాంత ధారిణివై

సచ్చిదానందమయ స్వరూపవై

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే


2.మంత్రముగ్ధులం నిను తిలకించి

కామదగ్ధులం నీ వదనం వీక్షించి

యోగదుగ్ధలం నీ కరుణ కాంక్షించి

నిత్య లబ్ధులం నీ కృప ప్రసరించి

తన్మయాబ్దులం నీ సన్నిధి దాల్చి

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే

Monday, September 6, 2021

 https://youtu.be/dWKJdu3Llm0?si=SQE-EBioOIv23I6j

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవగౌళ


మూడు కన్నుల వాడ ముల్లోకాల రేడ

శివుడా శివుడా ఏడ నీ జాడ

రికామె లేదాయే ఎములాడ కాడ

కాసింతైన నన్ను దయజూడ


1.సోమారమెపుడైన సోకదు నీ నీడ

శావణమైతేనొ  సోచాయించను గూడ

శివరాత్రి నాడైతె నిన్ను వేడనె వేడ

గుండెలో కొలువుండు తండ్రి రాయేశుడ


2.ఉపాసమొల్లను ఉండను తినకుండ

జాగారం చేయను  రేయి నిదరోకుండ

ప్రతి పనికి మానను శివశివ అనుకుండ

జంగమయ్య  నీవే  మాకు అండాదండా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధుభైరవి


నేనేమో సాహిత్యం-నీవేమో సంగీతం

ఇరువురి సంగమం అద్భుత రసమయ గీతం

నాదేమో అక్షర శరం నీదేమో స్వరమాధుర్యం

వశమైపోదా ఎక్కిడితే సర్వం సహా జగం

పరవశమైపోదా ఎలుగెత్తితే సకల విశ్వం


1.చైతన్యపు ఘన మేఘం నేనేగా

నురగలెత్తు సాగరకెరటం నీ నవ్వేగా

అందుకొనగ ఆత్రంగా ప్రేమసూత్రంగా పవిత్రంగా

అల్లుకొనగ హర్షంగా ఉధృత వర్షంగా ఆదర్శంగా

పదమై పల్లవై రాగమై అనురాగమై జతులై గతులై

చరణాలే వడివడి సాగగా- కడలి ఒడిలో కడతేరగా


2.ప్రత్యూషపు రవి బింబం నేనేగా

సరస్సులో అరవిందం నీ అందమేగా

తొలికిరణం నిను చేరిన తరుణం స్వర్ణంగా ప్రణవార్ణంగా

సితగా వికసితగా అధర హసితగా విలాస విలసితగా

ధన్యవై అనన్యవై ప్రావీణ్యవై ప్రాధాన్యవై మాన్యవై శరణ్యవై

భవమే భావమై అనుభవంగా- విభవమే సంభవమై మిథునంగా

Sunday, September 5, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెరువున తేటగ నడిపే గురుదేవా

చదువును ఆటగ నేర్పే గురుదేవా

బంగరు భవితను చూపే గురుదేవా

బ్రతుకుని తీరిచి దిద్దే గురుదేవా

వందనాలు వందనాలు మీ పాదాలకు

జేజేలు జేజేలుమీ దయా హృదయాలకు


1.ఉపాధ్యాయులు అధ్యాపకులుగ

ఆచార్యులు బోధకులు శిక్షాకరులుగ

జగతికి వెలుగును పంచేరు దారి దీపాలై

విద్యార్థుల పాలిట మీరే  విజ్ఞాన రూపాలై

వందనాలు వందనాలు మీ పాదాలకు

జేజేలు జేజేలుమీ దయా హృదయాలకు


2.అల్ప సంతోషులై ఆత్మసంతుష్టులై

పక్షపాత రహితులై విద్యార్థుల హితులై

అంకితమౌతారు మాన్యులై విద్యా బోధనకే

సాధనాలౌతారు ధన్యులై జాతి ప్రగతి సాధనకే

వందనాలు వందనాలు మీ పాదాలకు

జేజేలు జేజేలుమీ దయా హృదయాలకు

Saturday, September 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమనీయ నీ మోము కననైతినే చెలీ

కరి మబ్బులు కమ్మెనా పున్నమి  జాబిలి

ఏల నామీద రాదికనూ ఇసుమంత జాలి

తలదన్నేవూ రాధికనూ అందంలో  నెచ్చెలి


1.తటిల్లతలా మెరిసి మటుమాయం

 తేరుకోలేక నేనేమో అయోమయం

 నీ ఊహకే కలుగుతోంది మదిలో విస్మయం

నీ ఊపిరే తాకితే బ్రతుకంతా రసమయం


2.మొగిలి రేకు తావిలా వెంటాడె నీ చూపు

మధువు గ్రోల తుమ్మెదలా నీ నవ్వెంత కైపు

రాజ్యాలు దారబోసినా లభించేనా నీ ప్రాపు

ప్రవరాఖ్యుడైతెనేమి నీ మాటకు తల ఊపు

Friday, September 3, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్రకౌఁస్


శ్రీ పదమును వదలను ఆపదమొక్కులవాడ

సంపదలను అడుగను వడ్డికాసుల వాడ

కోరను నిను ఇంకేదీ శ్రీహరి గోవిందా

ముక్తి ఒక్కటే ఆసక్తిర మురారీ ముకుందా


1.నీ కొండల తత్వమే కుండలినీ విద్య

సప్త శిఖరాలే సప్త చక్ర జాగృత శ్రీవిద్య

సుశుమ్నా నాడి పథమె సాధనామోద్య

త్వమేకమేవం స్వామీ సకల సృష్టి మిథ్య


2.ప్రణవ నాదమే విశ్వ మయమై

ప్రాణాయామమే యోగ నియమమై

సర్వేంద్రియాలలోని శక్తి వినిమయమై

సహస్రారపద్మాన నీ దర్శనమై నిరామయమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తూరుపు తెర మీద-ఉషస్సు గీసే తైలవర్ణ చిత్రం నీదే

కృష్ణపక్ష నిశీధిలో గగనాన-మెరిసే తారలు చేసే లాస్యం నీదే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల


1. హేమంత వేళ  పుష్పాలపై తుషార ధవళ కాంతి నీదే

వసంత వనాల పవనాలు మోసే సుమ గుభాళింపు నీదే

సెలయేటి గలగలలలో శ్రవణపేయమౌ మంజులరవం నీనవ్వే

జలపాతపు ఉరుకులలో ఉధృతమై చెలఁగే చైతన్యం నువ్వే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల


2.అమృతాన్ని మించిన అమ్మపాలలో కమ్మదనం నీవే

నల్లనయ్య తలదాల్చిన శిఖి పింఛపు సౌకుమార్యమీవే

ఒడిదాగిన పసిపాకు కలిగే నులివెచ్చని హాయీ నీవే

తొలకరితో ఆర్తిదీర  నెర్రెల  నేల తల్లికౌ  మురిపెం నీవే

నీతోనె మలచబడినది విశ్వమంతా ఓ గులాబి బాల

నువు వినా కాంచనైతి ఈ జగాన నా ప్రియ జవరాల

Wednesday, September 1, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


ఒక బొమ్మకు ప్రాణం పోసావు-ఒక అమ్మకు దైన్యం తీర్చావు

ఒక భక్తుడి నెత్తురు వైనావు-ఒక తండ్రికి అండగ నిలిచావు

సాయని పిలిచినంత ఓయని బదులిచ్చావే

బాబా అని వేడినంత ఇడుములు తొలగించావే

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


1.నోరుతెరిచి ఏనాడు కోరింది లేదు నిన్ను

చేయిసాచి ఇది ఇమ్మని అడిగానా మున్ను

దర్శంచుకొన్నాము షిరిడీ పురమునందు

నిను నిలుపుకొన్నాము మా ఉరము నందు

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల


2.రాసాను ఎన్నెన్నో పాటలు నిను కీర్తిస్తూ

చేసాను భజనలెన్నొ నిను ప్రార్థిస్తూ

మోసాను గురువారం నీ పల్యంకికను

వేచాను నీ దయకై ఆర్తి మీర ఇంకనూ

మా మీద కినుకేల-మామీద అలకేల

ఈ జన్మకి ఇంతేయని చింతలోనె మగ్గాల

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


మీరు నుండి నీవులోకి జారిపోతిమే

నీవూ నేనూ ఒకటిగా మారిపోతిమే

పరస్పరం భావాలను పంచుకొంటిమే

 కొత్తదైన బంధమొకటి చాటిచెబితిమే

నా ప్రాణదీపమా నా మనో రూపమా


1.నన్ను నాకు చూపేటి అద్దానివే

నాతో నేను చేసే అంతర్యుద్ధానివే

నా ప్రజ్ఞ ప్రకటమగుటకై సంసిద్ధానివే

సామాన్యులెరుగలేని అసంబద్ధానివే

నా ప్రేమ సింధువా నా ఆత్మ బంధువా


2.తప్పొప్పులు సరిచేసే స్నేహితవే

నా దిశ నిర్దేశించే స్ఫూర్తి దాతవే

సర్వదా ననుకాచుకొనే జగన్మాతవే

నను కట్టడి చేయగలిగే అధినేత్రివే

నాదైన జీవనమా ఓ పరమ పావనమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పెదవి విప్పవెందుకో

బదులు చెప్పవెందుకో

మనసులోని మర్మమేదొ 

ఎరుక పరుచవెందుకో


1.వద్దనుకొని వదిలేస్తే ఏచింతా ఉండదుగా

కావాలని భావిస్తే మనసంతా నిండేవుగా

పట్టీ పట్టక ఎందులకీ దాగుడు మూతలు

అంటీ ముట్టక ఆటలాడుతూ పడకే కతలు


2.మౌనంగా నేనుంటే సెలుకుతూనె ఉంటావు

నా దారిన నే బోతుంటే కాలడ్డుతుంటావు

జీవితం అంటేనే నాకు ప్రేమ పూల తోట

చింతలేని నీకు బ్రతుకు చింతపిక్కలాట