Tuesday, September 7, 2021

https://youtu.be/bPTBaxKn6Rg?si=IM_QY8-3VHQN-U34

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి


మనోహరివే-సౌందర్య లహరివే

మురహరి సిరివే శ్రీహరి శ్రీమతివే

శ్రీదేవీ శ్రీవిద్యా శ్రీమత్ లలితేశ్వరీ భవానీ

శ్రీ పీఠసంవర్ధిని భువనేశ్వరీ నమోస్తుతే శివానీ


1.మణిద్వీప నివాసిని సుహాసిని శ్రీవాణి

బాలాత్రిపుర సుందరీ విశ్వజనని

శ్రీరాజరాజేశ్వరీ భ్రామరీ పరాంబికే

నమోస్తుతే గౌరీ శాంకరి మూకాంబికే


2.చంద్రమౌళీశ్వరి సురముని వందిని జగన్మోహిని

మహిషమర్ధిని జ్ఞాన వర్దని సింహవాహినీ మారి

కామేశ్వరి కృపాకరీ పరమేశ్వరి కర్వరి

శాంభవి కాళీ చాముండీ చండి నమోస్తుతే దుర్గే

 https://youtu.be/o7sN9TvjnUY


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తిక్కశంకరయ్యవే నువ్వు

వెర్రి వెంగళయ్యవే నువ్వు

చూడబోదుమా భళా భోళానాథుడవు

ఆగ్రహిస్తెనేమో  ప్రళయకాల రుద్రుడవు


1.విరాగివనియందునా భార్యలేమొ ఇరువురాయె

యోగిగ నిన్నెంచమందువా ఇద్దరు కొమరులాయె

భోగిగ భావింతునా సర్వదా ధ్యానివి మౌనివాయె

సంసారిగ తలచెదనా సదా స్మశాన వాసివాయే


2.పసివాడి తలతెంచితివి నాడు క్రోధావేశాన

ఆలిని వరమడిగినా ఇస్తివి భక్తికి పరవశాన

భిల్లుడిగా మారి పోరి పాశుపతమునిస్తివి పార్థునికి

తిన్నని కన్నుని గ్రహించి కైవల్యమిస్తివా శరణార్థునికి


OK

https://youtu.be/9quWyG_ZZUw?si=p28ttqaKomJXeML_

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దర్బార్ కానడ

సమ్మోహనమే నీ చారెడేసి కళ్ళు
ఆకర్షణ కలవి నీ కరుణా దృక్కులు
మాయలొ పడవేసి మమ్ముడికించనేల
ఆటలాడి  నిర్దయగా వినోదింతువేల
జగదంబా శాంభవి -వందే సౌందర్య లహరి-సిరి

1.అగుపించెదవని ఆశజూపి
అంతలోనె అడియాస జేసి
ఊరడించెదవని ఊహజేయ
ఉసూరనిపించగ నీకిది సరియా
జగన్మోహినీ నమో జగన్మాయా

2.కాళికవు నీవు కాపాలికవు
లోకాల నేలేటి ఏకైక ఏలికవు
కేళీవిలాస విశేష విభవవీవు
లీలామాత్రము సకలవిశ్వము
ఆనంద పాత్రము నీ సూత్రము


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బులాకిలో చలాకిదనం

ముక్కెరలో ముగ్ధతనం

కన్నులలో దివ్య తేజోదనం

పెదాలలో  ప్రమోదావనం

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే


1.రవిబిబంబం నుదుటదాల్చి

శశి చంద్రిక దృక్కుల నిలిపి

సదానంద ప్రసన్న రూపిణివై

చిదానంద ప్రశాంత ధారిణివై

సచ్చిదానందమయ స్వరూపవై

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే


2.మంత్రముగ్ధులం నిను తిలకించి

కామదగ్ధులం నీ వదనం వీక్షించి

యోగదుగ్ధలం నీ కరుణ కాంక్షించి

నిత్య లబ్ధులం నీ కృప ప్రసరించి

తన్మయాబ్దులం నీ సన్నిధి దాల్చి

దివినుండి దిగివచ్చిన సౌందర్య దేవతవే

జగానికే హితముకూర్చే అపూర్వజాతవే