Monday, January 30, 2023

 

https://youtu.be/oKYRZuXeKaU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రోమ రోమమున రాముని నిలిపిన హనుమా

కామక్రోధ లోభాది వైరుల సత్వరమే దునుమాడుమా

వేడుచుంటిమి నిగ్రహమీయగ మాప్రార్థన వినుమా

కపివర ప్రముఖా కనికరమున మము దయగనుమా


1.అంబోధిని లంఘించి లంఖిణి మదమణిచేసి

అశోకవనమును చేరి అంగుళీయక మందజేసి

అవనిజ దుఃఖము నొకింత దూరము జేసి

సుందరకాండకు శూరుడవైతివి మారుతీ వెరసి


2.ఇంద్రజిత్తు బాణానికి సౌమిత్రి మూర్చనొందగ

జాంబవంత నీలాదులు నీ వీరత్వము పొగడగ

సంజీవినీ పర్వతమే పెకిలించి అరచేత గొనితేగా

అక్కున జేర్చెను నినురాముడు లక్ష్మణుడు కోలుకొనగా

 https://youtu.be/Z49o80_z5wM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అలనాటి మిత్రవిందవు

మదిదోచేటి నేత్రవిందువు

స్త్రీమూర్తి రూపు దాల్చిన ఇంద్రధనువువు

సృష్టిలోని సౌందర్యానికి నీవే కేంద్ర బిందువు


1.అప్సరసలు భువి దిగివస్తారు 

అందపు చిట్కాల కొరకు

దేవకన్యలు దివి నొదిలొస్తారు

నీ సొగసు గుట్టెరుగుటగకు

వెన్నెల వన్నెవు నున్నని వెన్నవు


2.తపస్సులే చేస్తారు మునివరులు

నీ కడగంటి చూపుకొరకు

దీక్షనే వదిలేస్తారు బ్రహ్మచారులు

నీ మునిపంటి నొక్కులకు

సూదంటు రాయివి సురలోక హాయివి

 

https://youtu.be/DpGgB8NxnNI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కురుల కుప్పలు-వాలు రెప్పలు

చెవుల బుట్టలు-చెంప సొట్టలు

నిను చూస్తూవేస్తాయి నా   కనులు లొట్టలు

విచ్చుకుంటె చాలుపెదాలు నవ్వు కాటపట్టులు


1.ఎపుడూ ఎరిగినవైనా ఏదో ఓ కొత్తదనం

ఆవిష్కరిస్తుంది నీ మేనులొ నా కవనం

అరువుతెచ్చుకుంది తావి- నిను కోరి దవనం

నీతో ఉంటె నిత్యనూతనం చెలీ నా జీవనం


2.మోము చూస్తు గడిపేస్తాను జీవితకాలం

మోవి ముద్దాడు ఊహనే రేపేను కలకలం

అపురూప అందాలకే నీరూపు ఆలవాలం

పరవశించి పోతుంది నిను పొగిడి నా కలం

 

https://youtu.be/Qq7FyrpbWxg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సారమతి


ననుగన్న తండ్రివీ దిక్కువు దైవము

అన్ని నీవేనయ్య నరసింహ నమ్ముము

పుట్టిబుద్దెరిగినా ఆనాటినుండి అను నిత్యము

మరువకుంటిని స్వామి మదిలోన నీ నామము

సంతోషమన్నది స్వప్న సదృశమాయే

దిగులుతో దినదినము ఆక్రోశమాయే


1.ప్రహ్లాద వరదుడా నీకేది కనికరము

ఎరిగించవయ్య వేగిరమె నా నేరము

కనులార నీరూపు కాంచితినె శ్రీకాంత

నోరార నీ భజన చేసితిని నీ చెంత

పక్షపాతము వీడు పాహి నను కాపాడు

పక్షివాహన శరణు ప్రభో నీవె నా తోడు


2.కూటికే నోచక బిచ్చమెత్తిన వాడు

చదువు సంధ్యలు చాల నేర్వని వాడు

నీ దాసుడాయెనూ శేషప్ప కవివర్యుడు

శతకాలు వ్రాసి నాడు నీ కృప నొందినాడు

నుతియించినా నన్ను గతిగానవైతివి

పతిత పావన నా మెరలు వినవైతివి

 

https://youtu.be/NCkr_EO8a4o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చక్రవాకం


రూపును వర్ణించితి-గుణములు కీర్తించితి

నీ ఉనికిని మరిమరీ నొక్కివక్కాణించితి

లీలలను మహిమలను గీతాలుగ పాడితి

నిజముగనే నీనామ భజనమునే చేసితి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1.పొల్లుపోకుండగనూ కవితలు వెలయించితి

   ఉన్న ప్రతిభనంతటినీ నీకై కుమ్మరించితి

   తనువు మనసు ధనము నీకోసం వెచ్చించితి

   మదిలో  మాటలొ పనిలో శివా నిన్నే నిలిపితి

   ఓం నమః శివాయ ఓం నమః శివాయ


2.ఒకవైవే ఉంటే ఎలా హరహరా శ్రద్ధాసక్తులు

కడగళ్ళతో అలమటించాలా నాలా నీ భక్తులు

చాలవు అధిగమించ నీ దయలేక మాశక్తియుక్తులు

సంస్తుతి నిందాస్తుతి నిన్నేవీ కదిలించవా మా అభివ్యక్తులు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

 https://youtu.be/ZOg_HtmTafM?si=VSTwOJr4RIXiCflH

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అక్కునచేర్చుకుంటుంది దుఃఖనది

సాంత్వన చేకూర్చుతుంది ఏకాంత మదిగది

ఎవ్వరు వెలివేసినా నిను పలుచన చేసినా

ఆశ్రయమిస్తుంది నేస్తమై మౌనమన్నది


1.కొడిగట్టే దీపానికి  వత్తిని నలుపకు

కొండెక్కే చెమ్మెలోన చమురుపోయకు

వెలిగిందిగా పాపం వెలిగినంత కాలం 

విశ్రాంతి గైకొననీ తననిక జీవితకాలం


2.అంతన్నది ఉంటుందా నీవింత ఆశలకు

అశించుటే కదా హేతువు నీ అనర్థాలకు

సామ్యము దైన్యము నీకేలరా పొత్తులకు

తగినశాస్తి తప్పదు ఎప్పటికీ ఉన్మత్తులకు

-నీ వంటి ఉన్మత్తులకు