Monday, May 14, 2018

ధర్మపురిలొ ఎడారి-నీరు లేక గోదారి
అలనాటి తలపులతో-గతవైభవ స్మృతులతో
ధర్మపురీ వాసులకు గుండె చెరువు
యాత్రిక భక్తుల కళ్ళలో కాల్వలుకొలువు

1.బాల్యాన ఆడుకున్న ఒండ్రుమట్టి దిబ్బలు
సేదదీర ఆదరించు-ఇసుక తిన్నె పరుపులు
సలిలంలో సంగీతం-సృజియించే కృష్ణశిలలు
స్ఫటికమంటి స్వఛ్చతతో-హాయిగొలుపు జలాలు
ఏవితల్లీ నాడు పారిన-గలగలా జలజలా పారకాలు
ఏవితల్లీ చిననాడు ఈదిన-పరిశుధ్ధ గంగా అక్షరాలు

2.సత్యవతి బ్రహ్మగుండ-తరిగిపోని తోయము
దేవతల మడుగు నింపు-పవిత్రమైన తీర్థము
నరసింహుని జలకాలకు-ఉత్కృష్ట ఉదకము
కనుమరుగైన తీరు-కొరుకుడు పడనిది
గౌతమి తరంగిణి ఇక-చరిత్రలోనె జీవనది

3.సమతుల్యత లోపించిన -పర్యావరణం
నిర్లక్ష్యం వహియించిన-ఏలికలూ కారణం
కలుషితాలు వ్యర్థాలు-కలగలిపిన పాపము
ఇసుకను తరలించిన-అక్రమాల ఫలితము
గోదావరి నదిపాలిట-ప్రతిదీ ఒక శాపము
కూడనిదంత చేసి-వగయ ఏమిలాభము