Monday, January 23, 2023



రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హంసనాదం


బుట్టలో పడబోకే బుట్టబొమ్మా

మత్తులో మునిగిపోకే పూలకొమ్మా

మొహం మొత్తుతుంది ఏదో రోజు

కొత్త పాతై రోతగ మారడమే రివాజు


1.కైపు కలుగజేస్తాయి ప్రశంసలు పొగడ్తలు 

అలవాటుగ అయిపోతేనో అవి అగడ్తలు

కూరుకపోతాము మనకు తెలియకుండానే 

మొగ్గగానే వాడుతాము ఎదిగి ఎదగకుండానే


2. దీపానికి ఆహుతి ఔతాము శలభాలమై

జీవితాన్ని కోల్పోతాము సాలెగూటి ఈగలమై

చుట్టూరా కోటరి చూసైనా మేలుకుంటె మేలు

పట్టుబట్టి వినకుంటే నిస్సహాయత నా పాలు


https://youtu.be/9ORZc_gYTUU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

చిత్రాలు:బాలినేని వరప్రసాద్

రాగం:మాండు


రాజేశుడ రాజేశుడ ఎములాడ రాజేశుడ

అక్కపెల్లి రాజేశుడ మా దరంపురి రాజేశుడ

బుగ్గరాజేశుడ  దుబ్బ రాజేశుడ  గుట్ట రాజేశుడ

నీకు దండాలు 

దయగల్ల మా రాజేశుడా నీకు పొర్లుడు దండాలు 


1.కొబ్బరికాయలు  కొట్టిమొక్కేము

కోడెను గట్టి గట్టిగా మొక్కేము

తలకున్న నీలాలు నీకిచ్చుకుంటాము

బెల్లంతొ తూకాలు వేయించుకుంటాము

గండా దీపాలు వెలిగించుతుంటాము

సల్లంగా సూడమని సాగిల పడుతుంటాము


2.నమ్ముకుంటె సాలు సత్తెము సూపేవు

కొలుసుకుంటె ఎదలొ కొలువు దీరేవు

పేదోళ్ళ పాలిటి పెద్ద పెన్నిధివి నీవు

పాడి పంటల్నిచ్చి మము పెంపు జేసేవు

ఒక్కపొద్దు నోముబట్టి సోమారముంటాము

మా నవ్వుల పువ్వుల్ని వాడ నీకంటాము