Sunday, September 20, 2020

సుస్సుపోసినాగాని పొంగిపొర్లు మోరీలు 

చిరుజల్లు కురిసినా శివమెత్తే నాలాలు

కడుపులోన చిచ్చుబెడుతు తీస్తాయి ప్రాణాలు

నమ్మిముందు కెళ్ళామా బ్రతుకు మ్యాన్హోళ్ళ పాలు

సౌభాగ్యనగరమా  బహుపరాక్ బహుపరాక్

విశ్వనగరమా జిందాబాద్ జిందాబాద్


1.ఓట్ల కొరకె కాలనీలు శివారుగ్రామాలు

అభివృద్ధికి మాత్రం ఆమడదూరాలు

నగరపాలికలలో రుసుములు వేనవేలు

ప్రగతికి అణువంతయు నోచనివైనాలు

వికాస నగరమా  బహుపరాక్ బహుపరాక్

విశ్వనగరమా జిందాబాద్ జిందాబాద్


2.రాదారులు తారులైన దాఖలాలులేవు

శిథిలమైనవాటికి మరమ్మత్తులసలులేవు

ప్రజారవాణాపరిధి అంతంతపాటిదే

ట్రాఫిక్ నియంత్రణకు అన్యాయపు బాదుడే

హైటెక్కునగరమా  బహుపరాక్ బహుపరాక్

విశ్వనగరమా జిందాబాద్ జిందాబాద్


3.విద్యావ్యవస్థ అంతటా అవస్థలే అవస్థలు

ఆసుపత్రులందునా విక్రమించె అక్రమాలు 

మత్తులోన జోగసాగె యువత ధ్యేయాలే

రొచ్చుకంపుగొట్టసాగె మన మాయకీయాలే

ఆరోగ్య నగరమా  బహుపరాక్ బహుపరాక్

విశ్వనగరమా జిందాబాద్ జిందాబాద్











 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


నీవేమో పరమశివుడవు 

నరుడను నే పామరుడను

ఏ అర్హత లేదు నాకు నీ సన్నధి కోరగనూ

ఏ యోగ్యత ఉన్నదనీ కైలాసం చేరగనూ

నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం

కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం


1.నోరు తెరిచినంతనే అబద్దాలు కుప్పలు

కళ్ళునెత్తికెక్కి నేను వదురుతాను నా గొప్పలు

వెనుకాడనెప్పుడూ చేయుటకై అప్పులు

పరులను ముంచైనా పడబోను తిప్పలు

నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం

కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం


2.అవలక్షణ లక్షితుడను నిర్లక్ష్యయుతుడను

అవహేళన పొందినా సిగ్గుపడనివాడను

నాకెదురే ఇక లేదని విర్రవీగు వాడను

ఉచితా నుచితాలనే ఎంచని వాడను

నమఃశివాయ మంత్రమొకటె నాకు శరణ్యం

కాశీవిశ్వేశ్వరా నీకు మారుపేరు కారుణ్యం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పిల్లతెమ్మెరవై స్పర్శిస్తుంటావు

చిరు చిరుజల్లువై అల్లుకుంటావు

మినుకుమంటు వెలుగుకుంటూ తారవై పలకరిస్తావు

మనసుబాగా లేనప్పుడు మంచిగీతమై సాంత్వన నిస్తావు

మరచిపోకు నేస్తమా మరలిరా నాకోసం

శూన్యమైపోయింది నువులేని జీవితం


1.ఉదయాలూ అస్తమయాలు యథాతథాలే

ఆరు ఋతువుల ఆగమనాలు అన్నీ మామూలే

యంత్రమల్లెమారిపోయి బ్రతుకునిలా ఈడుస్తున్నా

నిన్ను చేరువేళ కోసం ఆత్రుతగా చూస్తున్నా

కడుపునిండ ఏపూటా తినలేకున్నా

కంటిమీద కునుకైనా తీయలేకున్నా


2.తోటనిండా పూలేపూలు పరిమళరహితమై

కొలనులోని నీళ్ళు సైతం క్షారభూయిష్టమై

ఇంద్రధనుసుకూడ వన్నెలన్ని వెలవెలబోయి

కోయిల గాత్రమింకా ఎంతగానొ బొంగురుపోయి

పంచతన్మాత్రలన్నీ రసవిహీనమైపోయి

నువులేని నాలోకం నరకప్రాయమై