Saturday, March 4, 2023

 

https://youtu.be/1TaWSD451LY?si=JlGEKApo_Dm6dgHw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


భం భం భోలేనాథా-శంభో విశ్వనాథా

నమో నమో నాగనాథా పశుపతినాథా

చిందెయ్యరా గంగాధరా గౌరీనాథా 

వందనాలురా నందివాహనా చంద్రశేఖరా


1.భస్మధారీ త్రిపురారి చర్మాంబరధారీ

కామారీ జడదారీ కపాలమాలా ధారీ

కేదారి ఖట్వాంగధరీ ఖండపరశుధారీ

వందనాలురా నందివాహనా భృంగీశ్వరా


2.త్రయంబకా  దూర్జటీ దిగంబరా

నృత్యప్రియా శరణ్యా మృత్యంజయా

నీలకంధరా నిటలాక్షుడా విరూపాక్షుడా

వందనాలురా నందివాహనా సుందరేశ్వరా

 

https://youtu.be/StQkNTuKZPo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:చంద్రకౌఁస్

ఏడుకొండల వాడా - నాడూ నేడూ ఏనాడూ
ఉండడు నీకు స్వామీ - నా వంటి భక్తుడు
వేడియుండడు చేయమని- నిను కీడు
నశింపజేసైనా  ప్రభో  -నను  కాపాడు

1.అంతరింపజేయి -నా లోని అహమును
రూపుమాపవయ్యా -నాకున్న మోహమును
తెగటార్చవయ్యా - నా లోపమైన లోభమును
పరిమార్చవయ్యా ప్రభో -ఈర్ష్యా -ద్వేషమును

2.తొలగించు నాకున్న -దేహ  వాసనను
మసిచేయి అప్రియమౌ -నా గాత్ర కర్కశను
కట్టడిసేయవయ్యా- నా తొందరపాటును
కడతేర్చవయ్యా స్వామీ- నా జీవయాత్రను

 

https://youtu.be/AstIBaUQXFI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నా తీరని తీయని కలవో
నా లోన దాగిన కవన కళవో
పదహారు కళలొలికే తెలుగుపడుచువో
ఊహలకే పరిమితమై కల్పనకే పరిచితవై
నిజముగ జగమున కలవో లేవో

1.ఉత్సాహం నాలోనింపే ఉత్పలమాలవో
ఇంపగు వన్నెలుకలిగిన చంపకమాలవో
నవనవలాడే నాగమల్లివో
మిసమిసలాడే మరుమల్లివో

2.మరులే రేపే మదనకుతూహలానివో
మమతలు కురిసే అమృతవర్షిణివో
జాగృతపరచే భూపాలానివో
ఆత్రుత పెంచే హిందోళానివో

 

https://youtu.be/2N6l5MTU9Xc

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సిందుభైరవి

తేలిపోతాయి గాలివాటుకే నీలిమేఘాలు
కూలిపోతాయ చిన్నమాటకే గాలి స్నేహాలు
ఒకతావు నుండి మరో రేవుకు ఏటవాలుగా
చేయూత కోరుతూ చేతుల్నిమార్చుతూ తమవీలుగా

1.వాటంకొద్ది వైష్ణవాలే స్నేహబంధాలు
నవ్వుఅత్తరు పూసుకున్న దుర్గంధాలు
మనసుపై ముసుగేసుకున్న ఉత్తుత్తి నేస్తాలు
పబ్బం గడుపుకోవడానికే పత్తిత్తు వేషాలు

2.ఇచ్చిపుచ్చుకుంటుంటే వ్యాపారాలు
లెక్కపక్కాచూసుకుంటే వ్యవహారాలు
ఇంతోటి దానికి మైత్రీగా నాటకాలు
ఆత్మీయబంధాలిపుడు గగనకుసుమాలు

 

https://youtu.be/ak7N_tAwc9A?si=vmPGi1MvQc6FRH0Z

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య కళ్యాణం

ఎల్లలోకాలకు మంగళ ప్రదాయకం

బ్రహ్మోత్సవ శుభవేళ భవతారకం 

కనినజనులకందరికీ జన్మ పావనం


1.ముక్కోటి దేవతలూ కాంచే కలయిది

బ్రహ్మాది సురముఖ్యులు ఏతెంచునది

వేద మంత్రాలఘోష నినదించు తరుణమిది

ఆనందం జగమంతా ఆవరించు ఉత్సవమిది


2. బాసికాలు సింగారించి నరహరి

సిగ్గులొలుకు చిరునగవులతో సిరి

శేషప్ప మండపాన వధూవరులైరి

శుభ పరిణయ విభవానికి ఇలలో ఏదిసరి

*తిలకించి పులకించే అలవైకుంఠమే ధర్మపురి*




 https://youtu.be/zqRYGaUTj9A


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చంద్రిక


జయజయ నారసింహ 

జయము జయము జయము

మమత మీర మము చేకొను

నీకిదే మంగళము 

జయమంగళము శుభమంగళము


1. నర మృగరూపుడవు

 ప్రహ్లాద వరదుడవు

హిరణ్యకశిపుని దునిమినవాడవు

ధర ధర్మపురిలో వెలసిన దేవుడవు


2.ఉగ్ర యోగ మూర్తివి

భక్త ప్రపన్నార్తివి

దంష్ట్రనఖాయుధ ధరకీర్తివి

దుష్ట శిక్షణా స్ఫూర్తివి

 https://youtu.be/rmm2W7LSgjU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


తావీజిస్తావో -మూలికాతైలం పూస్తావో

విభూదిస్తావో -మనా…దికేదైన బోధి స్తావో

మంత్రంవేస్తావో -రోగంపోయె గారడిచేస్తావో

అక్కునజేరు స్తావో -మా తిక్కలు కుదురు స్తావో

ధైర్యం కలిగించు సాయి- మాలో దెయ్యం వదిలించుసాయి

లీలలేవైన చేయి -మాకు మైమజూపి  కూర్చుహాయి


1.ఉప్పుదింటె ఊష్ణము పప్పుదింటె పైత్యము

మనసుపడి మిఠాయి తింటే మధుమేహము

పులుపుతో వాతము కారమైతె అజీర్ణము

ఏది తినబోయినా ఒంటికి పడని శాపము

ధైర్యంకలిగించు సాయి-మాకు పత్యం వదిలించుసాయి

లీలలేవైన చేయి -మాకు మైమజూపి  కూర్చుహాయి


2.ఆరోగ్యము మహాభాగ్య మన్నది అక్షర సత్యము

వ్యాయామం మాటమాకు కొరుకుడుపడని కృత్యము

వేళకు భోజనము రాతిరితొలి జాముకు శయనము

గగనకుసుమమే మాకు నియమ సమయ పాలనము

మాకళ్ళు తెరిపించు సాయి మనసును వికసింపజేయి

లీలలేవైనా చేయి - మాకు మైమజూపి కూర్చు హాయి