Monday, September 21, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:షణ్ముఖ ప్రియ


ఇలవేల్పువు నినువినా వేడనెవరినీ

నోరుతెరిచి అడగనొరుల నన్నువేగ కావుమనీ

కొండగట్టునందున కొలువున్న మారుతీ

తండ్రివినీవుగాక వేరెవరు నాకు గతి

జయరామ భక్తహనుమా ప్రేమమీర ననుగనుమా


1.నిను దర్శించగ మనసౌను పలుమార్లు

అభిషేకించగా అభిలషింతు అన్నితూర్లు

నిను అర్చించగా ఉల్లమునా ఉల్లాసాలు

రామనామ భజనసేయ ఆనంద పరవశాలు

కొండగట్టునందున కొలువున్న మారుతీ

తండ్రివినీవుగాక వేరెవరు నాకు గతి


2.నీ భక్తులకిలలో భూతప్రేత భయముండునా

  నీ సేవకులెవరికైన రోగబాధలుండునా

నిను నమ్మినవారికీ మనాది వ్యాధులుండునా

నిను శరణని ప్రార్థించగ లోటుపాటులుండునా

కొండగట్టునందున కొలువున్న మారుతీ

తండ్రివినీవుగాక వేరెవరు నాకు గతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాటలు నేర్చిన చిలకా ఓ మహానటి

ఎవరురారు ఇలలోనా నీ కాలిగోటి సాటి

నువ్వు నవ్వు నవ్వితే నవరత్నాలే

నవ్వుతోనే ఫలిస్తాయి నీ ప్రయత్నాలే

జాణవే నెరజాణవే మాణిక్యవీణవే

మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే


1.కవిత్వాలె పుట్టిస్తావు సామాన్యునిలో

ఆశలు రేకెత్తిస్తావు నిరాశావాదిలో

తపోభంగమైపోదా మునివర్యులకైనా

దారితప్పదా ఆజన్మ బ్రహ్మచర్యమైనా

జాణవే నెరజాణవే మాణిక్యవీణవే

మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే


2.పిచ్చివాళ్ళైనారు నిన్ను కనగ ఎంతోమంది

కాపురాలనొదిలేసారు నీకొరకు ఓ సౌగంధి

ఊరించి ఊరించి ఊడిగం చేయిస్తావు

అందినట్టె అనిపించి నువు జారుకుంటావు

జాణవే నెరజాణవే మాణిక్యవీణవే

మత్తుజల్లి మాయజేయగ మహా ప్రవీణవే


Art by:Sri .Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అప్పులను ఎగ్గొట్టేవాళ్ళు కొందరు

మందిని నిండా ముంచేదింకొందరు

ఇవ్వననీ అనక ఎంతకు ఇవ్వకా

తప్పించుక తిరిగే టైంపాస్ గాళ్ళు కొందరు

మోసగాళ్ళు దగాకోరులు వంచించే నీచులు

దొరికినకాడికి బరుకుతారు ఈ బడాచోరులు


1.మోచేయినాకిస్తారు అరచేత బెల్లం చూపి

కోటలెన్నొ కడుతుంటారు మాటలు నేర్చి

నమ్మబలకడంలో ఆరితేరి ఉంటారు

కల్లబొల్లి కబురులతో బుట్టలో పడవేస్తారు

మోసగాళ్ళు దగాకోరులు వంచించే నీచులు

దొరికినకాడికి బరుకుతారు ఈ బడాచోరులు


2. ఉడాయిస్తారు ఏరాత్రో ముల్లేమూట సర్దుకొని

 బినామీల పాల్జేస్తారు దివాళాకోరైనామని

చిన్నపాటి ఆస్తులుంటే బాధితులకు పంచేస్తారు

సిగ్గుఎగ్గులేకుండా ఎంతకైనా తెగబడతారు

మోసగాళ్ళు దగాకోరులు వంచించే నీచులు

దొరికినకాడికి బరుకుతారు ఈ బడాచోరులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇప్పటికి కదా స్వామీ నీ మనసు కుదుట పడ్డది

ఈ గెలుపేకదా ప్రభూ నీకు ఊరట కలిగించినది

దుర్భర యాతనతో బ్రతుకు భారమంటుంటే

నా అంతట నేనుగా నిన్నుకోరుకుంటుంటే


1.పొమ్మని అనవుగాని పొగబెట్టక మానవు

లేదని అనవుగాని వేదనలే ఇచ్చేవు

చిరుసాయం అడిగితే చేతువు గుండెకు గాయం

వరమునే కోరామా చూపింతువు నరకం


2.నీకెంత ప్రేమ స్వామీ నిజంగానె నాపై

క్షణం మరవనీయవు అణువణువూ నీరూపై

కష్టంవెనక కష్టము కొనితెచ్చేవెంతో ఇష్టంగా 

నీ ఆంతర్యం చెప్పకనే తెలుస్తోంది స్పష్టంగా


3.ఎంతగా నీకు నచ్చానో ప్రభూ నేను

త్వరగా నిను చేరమనే సంజ్ఞనందుకొన్నాను

బద్నామౌతావనా బాధ్యత నా కిచ్చావు

నీకొరకు తపించేల వెతలను కల్పించావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉత్త వెర్రిబాగులదీ  ప్రతి ఒక్కరి అమ్మ

పచ్చిఅబద్దాలకోరె ప్రతివారి నాన్న

ఏలా బ్రతుకుతారో  ఈ మాయ లోకానా

కన్నవారి ఆసరా కరువై వృద్ధాప్యాన


1.అందని చందమామనద్దంలో చూపింది

ఉప్పునెయ్యి అన్నాన్ని అమృతం చేసింది

లల్లాయి పాటల్లో గాంధర్వం వంపింది

కడుపుతీపి మైకంలో కడగళ్ళను మరిచింది


2.అరకొర సంపాదన అద్భుతదీపమైంది

దొరకాల్సిన అప్పెప్పుడు రేపటికే పుట్టింది

ప్రతి వచ్చే పండక్కే నాన్నకు కొత్తదుస్తులు

చెరిగిపోదు నాన్న నవ్వు కరిగినా ఆస్తులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆసన్నమైనది స్వామీ నిను చేరే తరుణం

ప్రసాదించవయ్యా అనాయాసమౌ మరణం

బ్రతకడానికొక్కటైనా కనిపించదు కారణం

కడతేర్చు వేగమె నన్ను నీ చరణమె నాకిక శరణం


1.మెండుగా లేదునాకు కీర్తి ఎడల కండూతి

దండిగా లేనే లేదు ధనమంటే నాకు ప్రీతి

కోర్కెలేవి లేవు నువు తీర్చకున్నవి

ఆశలేవి లేవు నాకు నెరవేర్చకున్నవి

వచ్చిన పని పూర్తైంది జాగుదేనికయ్యా

మెచ్చుకోళ్ళ వాంఛలేదు వెరపుఏలనయ్యా


2.గతించారు ఘనులైనా గుర్తు లిప్తమాత్రమే

లిఖించారు చరితలెన్నో కలిసె కాల గర్భంలో

చావుపుట్టుకలన్నవీ సహజమే సర్వులకూ

రౌరవాది నరకాలైనా సౌఖ్యమే ఇల యాతనకూ

సర్వాంతర్యామివిగానా కనెదనునిను పరలోకానా

ఆత్మగా మనుసమయాన నను వీడకు ఏమరుపాటున

రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుచ్చిగుచ్చిచూడబోకు నచ్చినోడ

నా మది మెచ్చినోడ

చూపులు గుండెకేసీ లాగబోకు సచ్చినోడ

నాకే నాకే మనసిచ్చినోడ


1.దాచుకున్న పరువాలన్నీ ఫరవాలేదంటూనే

కొల్లగొట్టి దోచుకోకుర దొంగసచ్చినోడ

ఎదలోని మర్మాలన్నీ ధర్మబద్ధమేనంటూ

గుట్టువిప్పి రట్టుచేయకు ప్రేమపిచ్చివాడ


2.నా కన్నులు మీనాలాయే గాలమేసి లాగితెఎట్టా

సచ్చుకుంటు చిక్కక తప్పదు రామసక్కనోడ

నా చూపులు హరిణాలాయే వలవేసి పట్టితె ఎట్టా

వేణువూదినా చాలు వెంటబడుతు రానా నీ సోకుమాడ