https://youtu.be/qqC20ooKr9g?si=qXZOnN13YiQrtC8Z
వేకువనే నువు చిమ్మగ వాకిలి
అద్దంలా మారుతుంది ఆ లోగిలి
చెలరేగి ముంగురులే ముద్దాడగ చెక్కిలి
చిరు చెమటలు చిరుగాలికి ముత్యాలుగ రాలి
ఉషఃసుందరీ తుషార మంజరీ
నీ వయారానికే బేజారై నా గుండె జారీ
ఊడిగమే చేయుటకై నీకు నే గులాముగా మారీ
1.చీర కొంగును నడుముకు చుట్టి
కుచ్చిళ్ళను నాభి క్రింద దోపి
ముంగిట ముగ్గును వేసే లోపే
పిండి పట్టిన చేతితో ముంగురులెగదోస్తే
ముగ్గుపిండే బుగ్గల ముద్దాడేస్తే
ఉషఃసుందరీ తుషార మంజరీ
నీ వయారానికే బేజారై నా గుండె జారీ
ఊడిగమే చేయుటకై నీకు నే గులాముగా మారీ
2.కుడికాలు కాస్త మడిచేస్తూ
వింతగా దొంతిగా వంగేస్తూ
ఎడంచేత పొడుగాటి జడ నొడిసిపడ్తూ
రంగవల్లులే అందంగా పెడ్తూంటే
పౌష్యలక్ష్మే ప్రత్యక్షంగా తోస్తూ
ఉషఃసుందరీ తుషార మంజరీ
నీ వయారానికే బేజారై నా గుండె జారీ
ఊడిగమే చేయుటకై నీకు నే గులాముగా మారీ