Friday, July 7, 2023

 

https://youtu.be/RVeeUcgKvUM?si=WDPZ_KphFJW3RBdf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


బడిరాజ్యం నీదే 

ఏలుబడి చేయగా రావదేఁ

ఉపాధ్యాయ నేస్తమా …

అమ్మ ఒడిలా విద్యార్థుల ఆదరించవేమదేఁ


1.కౌశిక మునివర్యుని కౌశల్యము నీవు 

సాందీప గురువర్యుని సారూప్యత నీవు

సర్వేపల్లి రాధాకృష్ణ సమతుల్యుడవు

అబ్దుల్ కలాం గారి నిజ వారసుడవు

నీతికి నియతికి నిర్దేశకుడవు 

జాతికి నీవే ఆదర్శ ప్రాయుడవు

గుర్తెరుగూ నీలోని నిబిడీకృత మేధా శక్తిని

ప్రజ్వలింపజేయుమిక నీ శిష్యుల జ్ఞాన దీప్తిని


2.పదోన్నతుల నెన్నడు ఆశించబోవు

అక్రమార్జనమాట అసలే ఎరుగవు

తరిగిపోని చెరిగిపోని విద్యాసంపద నీ సొత్తు

ఏ ప్రభుతా గ్రహించదు దేశప్రగతిలో నీ మహత్తు

పేద విద్యార్థులకు పెన్నిధినీవు

బదిలీలెన్నైనా ప్రతిచోటా ఆప్తుడవు

దేశాధినేతలైన నీ పూర్వ విద్యార్థులే

ఘన శాస్త్రవేత్తలైన నీ కృపా పాత్రులే…



శుభాకాంక్షలందుకో విద్యా దాన కర్ణుడా

శుభాభినందనలివే సర్వ మానవ శ్రేష్ఠుడా

 https://youtu.be/cI6Tuol9BfU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఇది బ్రహ్మ గర్జన - బ్రాహ్మణ జన గర్జన

 లోకాః సమస్తా స్సుఖినోభవంతు యని

సర్వదా కోరుకునే ద్విజులందరి ఆత్మీయ సమ్మేళన

వేద ధర్మ పరిరక్షణ నిజ హక్కుల ప్రకటన

పరిపాలనలో సైతం తగు భాగ స్వామ్య సాధన


1.ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం పరశురామ ప్రతీకలం

అర్థశాస్త్ర కోవిద చాణక్యుడి వంశ వారసులం

తిరు కోవెలలోన స్వామి అర్చకులం దైవ సేవకులం

సంస్కృతీ సదాచార సాంప్రదాయ పరిపోషకులం

బ్రాహ్మణో మమ దేవతా అన్న మాధవుడి భక్తులం

నిత్య గాయత్రీ మంత్ర జపానుష్ఠాన అనురక్తులం


2.అగ్రకులం అన్నది అపప్రథేగాని నిరుపేదలమే అధికులం

నరుడే హరుడని వ్యవహరించే విశ్వమానవ ప్రేమికులం

దాన ధర్మాల విలువనెరిగియున్న సమైక్య భావుకులం

మీన మేషాలు లెక్కించి ప్రజా శ్రేయస్సు కాంక్షించే జ్యోతిష్కులం

దేశాన్ని ఏల గలుగు సత్తా గలిగిన సహజ నాయకులం

ఒక్క మాటపై నిలిచి ఒక్కబాటలో నడిచే లక్ష్య పథికులం

 https://youtu.be/pj0PfkC_LFI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


 నీవుంటే కలకలం

నీవెంటే నా కలం

ఎంత మధురమో నీగళం

అది అనవరతం పూర్ణ సుధాకలశం


1. సెలయేరు నీపాటలో 

పరవళ్ళు తొక్కుతుంది

చిరుగాలి నీ పాటతో

మత్తెక్క వీస్తుంది

నీవున్న చోటనే నందనవనం

నీ స్నేహబాటనే బృందావనం


2. కొడిగట్టే దీపానికి

ఊపిరయే చమురే నీవు

ఆశలుడుగు జీవితానికి

ఎదురయే వరమే నీవు

ఏడడుగులు చాలవే నీతో సావాసం

ఏడు జన్మల నీ సహచర్యం

కడు మాధుర్యం

 https://youtu.be/cEaBZA7CaHA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హంస ధ్వని


విశ్వమంతా తెలంగాణ ఖ్యాతి విస్తరిల్లగా

మనఆత్మగౌరవ ప్రభలే అవనిలో విలసిల్లగా

జరుపుకుంటున్నది మనతెలంగాణ సగర్వంగా

అవతరణ దశాబ్ధి వేడుకలే ఘన పర్వంగా

వెలిసింది వేడ్కతీర తీరైన జనతెలంగాణా 

ఎదిగిపోతోంది  దినదిన ప్రవర్ధమానంగా


జై తెలంగాణా! జైజై తెలంగాణా!!


1.కల్వకుంట్ల చంద్రశేఖరుని పోరాట ఫలితంగా

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరంగా

తమదైన యాసతో తమ సంస్కృతి ధ్యాసతో

ఉద్యమాలు బలిదానాల సార్థక చిహ్నంగా

వెలిసింది వేడ్క తీర తీరైన మనతెలంగాణా 

ఎదిగిపోతోంది  దినదినప్రవర్ధమానంగా


2.ప్రజా సంక్షేమమే ప్రభుతకు ఏకైక లక్ష్యంగా

బడుగు బలహీనవర్గాల శ్రేయస్సుకై దీక్షగా

అంబేడ్కర్ ఆశయాల లౌకికతే పరమావధిగా

భరతావని ప్రగతిరథపు ఆదర్శ సారథిగా

వెలిసింది వేడ్క తీర తీరైన మన తెలంగాణా 

ఎదిగిపోతోంది  దినదినప్రవర్ధమానంగా