Thursday, April 20, 2023

 


https://youtu.be/biWD0eVRLGQ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అంబరాన్ని తాకుతోంది సంబరం
మన బంధానికిదే తొలి వసంతం
పాట మనకు దైవమిచ్చిన దివ్యవరం
పాడినా విన్నా పాట ఉత్తేజకరం
పాడుతూ జీవిద్దాం పాడుతూ గడిపేద్దాం
పాడుతూనే తరిద్దాం పాడీ తరింపచేద్దాం

1.పాట అమృతానికి తరగని ఊట
యాంత్రిక జీవనాన పాటే ఊరట
పాడుతూ పాడుతుంటే ఎంతో వికాసం
పాట ఉన్నచోటల్లా వినోదమే వినోదం
పాడుతూ జీవిద్దాం పాడుతూ మురుద్దాం
పాడుతూనె తరిద్దాం పాడీ తరింపజేద్దాం

2.పాట లో పలుకుతుంది సామవేదం
పాట సకల వ్యాధులకు పరమౌషధం
పాటలో ఇమిడిఉంది అంతులేని ఆనందం
బిడియాలను వదిలేసి కోయిలై పాడుదాం
పాడుతూ జీవిద్దాం పాడుతూ మరణిద్దాం
పాడుతూనే తరిద్దాం మనని మనం మరుద్దాం