Tuesday, February 28, 2023

 https://youtu.be/BA9ljB1B5Ps


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గట్టెక్కించు- మము గండాల నుండి- గట్టయ్య- మా కొండగట్టయ్య

చుట్టపక్కమునీవే- లెక్కపత్రము నీతోనే- పట్టించకోవయ్యా- పావనీ దండమయ్యా


1.కుప్పలు తెప్పలుగా-తప్పులు చేసామో

 కపీశా-కుప్పిగంతులేసామో

చెప్పరాని ముప్పులు తీరిపోని అప్పులు-

ఎన్నని చెప్పుదు మా తిప్పలు

సీతమ్మ కష్టాన్నే తీర్చిన -శ్రీరామ బంటూ

నమ్మితి నీవే మాదిక్కంటూ


2.రోగాలూ నొప్పులు- వెతలూ నలతలు-

మానిపోని మా గుండె గాయాలు

అడ్డంకులు సంకటాలు అడుగడుగున కంటకాలు

బ్రతుకంతా కందకాలు

సంజీవని కొండను తెచ్చి లస్మన్న పానంగాచిన మారుతి ఇక నీవే నాగతి

 https://youtu.be/VRngHBwU09M


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


పడమటి కొండల చాటుకు వెళ్ళెను సూర్యుడు

జంటల విరహపు మంటలనార్పగ దినకరుడు

కవితకు వస్తువు తోచక తల్లడిల్లె కవివర్యుడు

నవరసాలలో సరసం ముసరగ తనువూరడిల్లెను


1.ప్రేమా ప్రణయం శృంగారం కవితను ఆశ్రయించెను

ఎడబాటు ఎదిరిచూపు నిట్టూర్పు మదినావరించెను

తొలిప్రేమలో తడబాటుగా ఎదురైన యువ ప్రేమికులు

చిరకాలం కలయిక కలగా కుదేలైన నవ దంపతులు

ఉబలాటం చాటున ఒకరు- ఆరాటం పంచన ఇంకొకరు


2.కాపురమే గోపురంగా మలచుకొన్న వారు

ముదిమిలోనూ ఒకరికి ఒకరై నిలిచిన తీరు

బాధ్యతలు బంధాలు బంధనాలై ఆలుమగలు

శేష జీవితం శాంతినికోరే పండు మదుసలులు

అన్యోన్యం బాసటగా ఒకరు- వృద్దాప్యపు ఆసరాగా ఇంకొకరు

 https://youtu.be/ysWLHbUndhk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:రేవతి


భూతపతి మరుభూపతి

శైలజాపతి పశుపతి

కైలాసపతి కైవల్యపతి

శంభో నీవే నా గతి శరణాగతి

చేర్చరా వేగమే నన్ను సద్గతి


1.హక్కు నీకుంది నను అక్కున జేర్చగా

   దిక్కు నీవంటి ఈ దీనుని పరిమార్చరా

   కాలకాలా కపాలమాలా ధరా హరా

   త్రిశూలపాణీ త్రిపురాసుర సంహారా


2.ప్రళయ తాండవ రుద్రా  నృత్య ప్రియా

   ప్రణవనాదేశ్వరా ప్రభో మృత్యుంజయా

  ప్రమధనాథా విశ్వనాథా నమఃశివాయా

  ప్రస్తుతించితి దయసేయగా దయాహృదయా

Saturday, February 25, 2023

 నియోగులం కర్మయోగులం

సుపరిపాలనా వినియోగులం

చాణక్య నీతిలో కార్యదక్షులం

ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రానికి ప్రతీకలం-భార్గవులం

అపార మేధాసంపత్తికి నిలువెత్తురూపాలం


1.కత్తికన్న మిన్నగా కలంతో సాధించాం

కచ్చేరుల తీర్పులలోను మేటిగ వాదించాం

తేడా వస్తే చక్రవర్తి తోనైనా విభేదించాం

జన సంక్షేమం లక్ష్యంగా దేవుడినైనా ఎదిరించాం


2.భద్రాద్రి కోవెలకట్టిన భక్తుడు రామదాసు మావాడే

పెదవి విప్పక దేశంనేలిన ప్రధాని మా పివి తీరు వాడే

వచన కవిత్వ ఝంఝా మారుతి మాశ్రీశ్రీ రీతి జగమే వాడే

మా కాళోజీ కవన గొడవకు నిజాం క్రూర పాలన వసివాడే 


3.శాసించడమే గాని ఆశించుట ఎన్నడు ఎరుగం

వితరణయే మాగుణము దేశానికి భూదాతలం

స్వతంత్రయోధులు  ఆంధ్రకేసరీ, జమలాపురం మావారే

కీర్తిగొన్న నేతలు కరణం,ద్రోణం,చకిలం,మంచికంటీ మావారే

సినీజగతికే మహరాణీ భానుమతీ మా ఆడపడుచే


పేదరికంలో ఉన్నాగాని చేయిసాచని ఆత్మగౌరవ వాదులం,ఆత్మాభిమానమే మాకు ప్రాణం (లాస్ట్ లైన్ సాకి గా…)

 https://youtu.be/RPCKMFaNuHM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందుస్తాన్ భైరవి


ఎలాచెప్పగలిగావు అభిమానం లేదని

ఎంతగా గాయపరిచావు స్నేహం పంచే నాఎదని

గుండె బండబారిదా,ఋణంకాస్త తీరిందా

వీడ్కోలు శాశ్వతంగ నా మాజీ మిత్రమా

అపరిచితులమే ఇక చితి చేరినా పూర్వ నేస్తమా


1.సరదాకే చెప్పావో నా రచనలు నచ్చాయని

వెటకారమె చేసావో కవితలు మెచ్చావని

ఎడంకాలితో ఎదని తన్ని ఎగతాళిగ నవ్వావు

నా మైత్రిని ఉబుసుపోక మాత్రమే దువ్వావు


2.నువుకొట్టినదెబ్బకు విలవిలలాడింది నా హృదయం

నీతేలికచర్యకు కుతకుతలాడి మనసు అయోమయం

 మితి మీరిన విశ్వాసం నేర్పింది తీవ్రమైన గుణపాఠం

చెరిపివేస్తున్నాను ఆనవాలు మిగలకుండా ఆసాంతం

 https://youtu.be/8ucf8LfTl08


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్భార్ కానడ


లక్ష్మీవల్లభా ప్రభో మమ ప్రసన్నః ప్రసన్నః

అలమేలు మంగా విభో ప్రసీదః ప్రసీదః

తిరువేంకట నాయకా స్వామీ నమోనమః

శరణు శరణు కరుణాంబుధే గోవిందాయనమః


1.ఎన్నాళ్ళిలా ఏ ఎదుగూబొదుగూ లేనిబ్రతుకు

ఎన్నేళ్ళిలా శుభం పలకవు గతుకుల నా కథకు

ఎంతని భరించడం అంతంలేదా స్వామి నావెతకు

సంతసమన్నది ఎండమావిగా దొరకదు ఎంతకూ


2.ఉన్నావో లేవో తెలియని ఓ వింత ఊహవు

ఏ పిచ్చోడో ఎపుడో అల్లిన కవన కల్పనవు

ఈ యాతనా జగత్తులో నీవే కాస్త ఊరటవు

అంతులేని జీవయాత్రలో బలము బలహీనతవు

 https://youtu.be/bu5tDbS3ZOA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


ఎవరన్నారు మంచిరోజులు వస్తాయని

ఎవరుకలగంటారు బ్రహ్మజెముళ్ళు పరిమళిస్తాయని

గడిచినకాలమే మేలు నాకు ఎంతోకొంత

అంధకార బంధురమే ఇకనా  భవితంతా


1.నవ్వడమే మరచిపోయాను

  నడవడమూ మానివేసాను

  బంధాలు అనుబంధాలు వదిలించుకున్నాను

  స్నేహితమను మాటకే మదిలో తిలోదకాలిచ్చాను


2.అనుభూతికి చితిపేర్చాను

రసస్ఫూర్తిని గోతిలొ పూడ్చాను

నాకు నేనుగా అపస్మారకస్థితి చేరుకున్నాను

జీవన్మృతుడిగా రోజులని లెక్కబెడుతున్నాను

Thursday, February 23, 2023

 వలపుల వలవేసి పట్టావే సూరమ్మా

సూదంటురాయి సూపుల్తో పడగొట్టావే సుప్పనాతి ముద్దగుమ్మా

గుట్టుగా నను బుట్టలొ పెట్టావే సూరమ్మా

జెగజ్జెట్టీనే  గాని ఒట్టిగనే నీకు లొంగానే రామసక్కనమ్మా


1.పిక్కలమీదికి నువ్వు సుక్కల సీరనెగ్గట్టి

ఏడేడు తులాల ఎండికడియాలే కాళ్ళకు బెట్టి

నడుము ముడతల్లో సింగారమంతా దాపెట్టి

గోచీకట్టుతో తిప్పుకు పోతుంటే చూసా నోరెళ్ళబెట్టి


2.పొడుగాటి నీజుట్టు తట్టెడు సిగజుట్టి

సిగలోన ఎర్రనీ ముద్దమందార పువ్వెట్టి

పువ్వులాంటి నీ ఒళ్ళు నా మతిపోగొట్టి

కాళ్ళబేరమాడిందే నామతి నిను కాకాపట్టి



 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సిందుభైరవి


హే దీనదయాళా హే పరమ కృపాళా

శరణాగత వత్సలా చూపరా నీలీల

కరుణాలవాల ఆదరించరా నన్నీవేళ


1.నీ మోహన మధుమురళీ సుధలు గ్రోలనీ

  నీ పదపద్మాల మ్రోల నా శిరసు వాలనీ

నీ దివ్య సన్నిధిలో సచ్చదానందమందు తేలనీ

అలౌకికానుభూతిలో నను శూన్యమై మిగలనీ


2.ఎన్ని జన్మలెన్ని వెతలు ఎన్నెన్నియాతనలు

ఎన్నగలేను నా దోషాలు  కోరితి మన్ననలు

అలసినాను  సొలసినాను ఐనా నిను వీడను

కలవనీ నీలో నను స్వామీ ఏదిక మరి వేడను


 https://youtu.be/iA3qTLNC12M?si=cbWdfG5daqgMtMZf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


సత్యదేవాస్వామీ పక్షపాతరహితా మహిమాన్వితా

శ్రీ సత్యనారాయణా శరణు శరణు నారద వినుతా

నీరాజనమిదె  నీలోత్పల నేత్రభాసితా

కర్పూరహారతిదే కమలాసన పూజితా


1.బ్రాహ్మణ శూద్ర వైశ్య క్షత్రియ భక్తుల కథలు

కలిగించును నీ మహిమల అనుభూతులు

నీ వ్రతమొనరించినంత దాసుల వెతలు

ఎలా తొలగెనో తెలిపెడి నీ లీలల గాథలు


2.షోఢషోపచారములతొ నిను అర్చించి

శ్రద్ధాసక్తులతో నిష్ఠగ నీ  వ్రతమాచరించి

సూత ప్రోక్తమగు నీ నోము విధి నిర్వర్తించి

నీ కృప నొందేము తీర్ధ ప్రసాదాల స్వీకరించి


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చిచ్చు పెడుతోంది పెదవిమీది పుట్టుమచ్చ

రెచ్చగొడుతుంటే పయ్యెద నా ఎదన రచ్చ

మచ్చుకైనా చూపించవే నామీద నీకున్న ఇచ్ఛ

గిచ్చుతోంది నీపొంకం నా శీలానికి తెస్తూ మచ్చ


1.బంగారం రంగరించి శృంగారం బోధపర్చి

సృజించాడు  సృష్టికర్త  నిన్ను  నా గురించి

రసకృతులు రతి కిటుకులు కడు నేర్పించి

నా ముందుంచాడు కుందనాల బొమ్మగ కూర్చి


2.నీ హావభావాలతొ నాలో పెల్లుబికే లావాలు

నీ కులుకులొలుకు పలుకులతో రసనస్రవాలు

మునిపంటితొ నొక్కిన పెదవి రేపేను ఉద్వేగాలు

క్రీగంటితొ విసిరిన శరము తీసేను నా ప్రాణాలు


 మా ఇంటి వాకిట్లో మల్లెపూల పరిమళాలు

మా సింహద్వారానికి మామిడాకుతోరణాలు

బంధుమిత్రులారా మీకివే హార్దిక స్వాగతాలు

మా నూతన గృహప్రవేశ సాదర ఆహ్వానాలు

స్వాగతాలు ఆప్తులారా మీకివే సుస్వాగతాలు


1.ఎన్నాళ్ళుగానో కన్న మా కలల పంట

చిన్నదైనా ఇది మా స్వప్న సౌధమేనంట

తోడునీడగా నిలిచింది నిలువెత్తు రూపంగా

మా ఆశలు నెరవేర్చి వెలుగిచ్చే బ్రతుకుదీపంగా


2.మదిలో దాగిన మమతలు పునాదిగా

ఆదరణే రూపుగొని కిటికీలు గమ్మాలుగా

ఆప్యాయత కలబోసి మూల స్తంభాలుగా

వెలిసింది మాఇల్లు వీడని బంధాలే  గోడలుగా


3.హృదయాన్ని పరిచాము చలువరాయిగా

తీరిచిదిద్దాము ఉన్నంతలొ కలికితురాయిగా

అడుగిడు అతిథులకు  అనుభూతే హాయిగా

మా ఇల్లే ఇలలో స్వర్గసీమగా జనులే తలపోయగా


Tuesday, February 21, 2023

 

https://youtu.be/zUMhJkj3so0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ఖర హర ప్రియ


శివలింగా శంభులింగా శ్రీరామలింగా

భవపాపభంగా అనంగదగ్ధ కరుణాంతరంగా



1.నీ తలమీద తారాడును ఆకాశగంగ

ఒడవని కన్నీటి కడలి నా ఎద పొంగ

తానమాడుకో తనివిదీర నాకనులు కురువంగ

అభిషేక ప్రియా మృత్యుంజయ ప్రియమారగ


2.బిల్వదళార్చన సంప్రీతుడివి భవానీ భవా

నా నయనదళము నర్పింతు ఆత్మసంభవా

అంకమునింక శంకరా మా జీవనాన మారనీవా

కడగండ్లు కడతేర్చి ఆనంద తీరాన్ని మము చేరనీవా

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చారుకేశి


నీలాంబరైంది నీదైన అనురాగం

మలయమారుతం నా ఎద సరాగం

రెండింటి తాకిడి లో అమృతవర్షణి వర్షం

నాతో నీవుంటే చింతలేని అంతులేని హర్షం


1.మోహనరాగంలా నీ సమ్మోహన రూపం

చంద్రకౌఁస్ లా నీ కన్నులలో వెన్నెల దీపం

హంసనాదంలా నీ గాత్రమే  అపురూపం

శివరంజనిలా ఎదలో రేపకు ఏదో తాపం



2.సింధుభైరవే అణువణువున నీ అందం

ఆనందభైరవై నీతో బ్రతుకంతా ఆనందం

కళ్యాణిలా కమనీయం కావాలి మనభవితవ్యం

మధ్యమావతిలా ప్రతిక్షణం మనకిక నవ్యాతినవ్యం





https://youtu.be/23nJbM7sQSQ?si=V2W4MycJP4-JPngx

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 

రాగం:ధర్మవతి


ధార్మికమౌ ధర్మపురి ధామమందు 

అన్న దానమే కడుపుణ్యమందు

నరసింహస్వామీ రూపమే కనిన కనులవిందు

గోవిందుని దివ్యనామమే అనిన వినిన బహుపసందు


1.పావన గోదావరీ నదిధారయందు

సరిగంగ స్నానాలతొ జన్మధన్యతనొందు

తీరములో మొంటెలవాయినాలతో

ముత్తైదువుల ఐదోతనము శాశ్వతమొందు


2.దక్షిణవాహిని పవిత్ర గోదారి మునక

పితృతర్పణాదులకు పావనమౌ ప్రోక

బ్రహ్మ యమరాజులకు ఇదియే బైసుక

ఎన్ని విశేషాలో ధర్మపురి దర్శిస్తే గనక

 

https://youtu.be/h9S7K2qvIN4?si=JlCa9UTp6obI1TZ5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:భీంపలాస్


శివనామమే మధురాతిమధురము

శివగానమే అమృత పాన సమము

శివలింగరూపమే మంగళప్రదాయకం

శివ భక్తి తత్త్వమే… కైవల్యదాయకం


1. కరమున అమరిన త్రిశూలమే అభయకరం

ఢమఢమ మ్రోగే ఢమరుకమే చేతనాప్రపూరం

అనాలంబి వీణా నిక్వణమే శ్రవణానందకరం

నటరాజ తాండవమే నయనమోహనం శ్రీకరం


2.శివ శిరమున గంగధార పరమ పావనం

 శశి విలసిత మనోహరం సుందరేశు వదనం

నిశి పూజతొ మోదమొందు పరమేశు హృదయం

శివరాతిరి పర్వదినం అణువణువూ శివమయం

Friday, February 17, 2023

 

https://youtu.be/gmi2CgGNaSc?si=QunGSD-Gr20uTNMR

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:హిందోళము


ఎంతటి సులభము శివా నీ లింగార్చన

ఎంత సరళము హరహరా శివదీక్షాపాలన

ఎంత మధురము నమఃశివాయ మంత్రమనన

ఎంత దివ్య అనుభవము శివరాతిరి ఉపాసన


1.నదీ తీరమందు సైకతముతొ నీ రూపము

కొండలు గుహలలో గండ శిలాసాణువు లింగము

గుడి గుండమేదైనా చండీపతీ నీకు ఆలవాలము

మా గుండెలందునూ కొలువుండే నీ ఆత్మలింగము 


2.పంచామృతాలా దోసిటి నీట నీకు అభిషేకము

వైజయంతి మాలా ప్రియము నీకు మారేడు దళము

పంచభూతాత్మకా పంచాననా నీవే నా ప్రపంచము

పంచాక్షరి స్మరించునపుడే హరించు నా ప్రాణము

 

https://youtu.be/yhsbkxjvYbI?si=-3EdjxVzAGzmR2u4

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:నీలాంబరి


ఉమామహేశ్వరం పరమగురుమ్

నమః పారతీ పరమేశ్వరమ్

అర్ధనారీశ్వరమ్ నటేశ్వరమ్ హటకేశ్వరమ్

హృదయేశ్వరమ్ ప్రాణేశ్వరమ్ ప్రణమామ్యహం ప్రణవనాదేశ్వరమ్


1.కాళేశ్వరమ్ ముక్తీశ్వరమ్ కనక సోమేశ్వరమ్

నమః పార్వతీ పరమేశ్వరమ్

రాజరాజేశ్వరమ్ భీమేశ్వరమ్ రామలింగేశ్వరమ్

హృదయేశ్వరమ్ ప్రాణేశ్వరమ్ ప్రణమామ్యహం

ప్రణవనాదేశ్వరమ్


2.గంగాధరమ్ చంద్రశేఖరమ్ వృషభవాహినం

నమః పార్వతీ పరమేశ్వరమ్

మంజునాథమ్ రామనాథమ్ కాశీ విశ్వనాథమ్

హృదయేశ్వరమ్ ప్రాణేశ్వరమ్ ప్రణమామ్యహమ్

ప్రణవనాదేశ్వరమ్

 https://youtu.be/ieK2lAIQDVU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:షణ్ముఖ ప్రియ


తిరుమలేశా శ్రీ వేంకటేశా

భక్తపోషా భవపాపనాశా

హృషీకేశా శ్రీశా సిరి ప్రాణేశా

పాహిమాం ప్రభో పరమపురుషా


1.ఆపద మొక్కులవాడా

అడుగడుగు దండాలవాడా

వడ్డికాసులవాడ కరివరదుడా

శరణము స్వామి శేషశయనుడా


2.తలనీలాలు కోరే వేలుపునీవే

కోనేటితానాల కొలుపులు నీకే

లడ్డూప్రసాదాల దైవము నీవే

దొడ్డదొరవు మా పాలకుడివీవే

Thursday, February 16, 2023

 https://youtu.be/GmB7nDahdP4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:మాయామాళవగౌళ


చాలుచాలింక నరజన్మ శివశంకరా

చేయగానైతినే సత్కర్మ మన్నించరా

దుర్లభంబైనదీ మనిషి పుట్టుకరా

నిజమెరుగు నంతలో ముగియవచ్చేనురా

హరహరా భవహరా రాజరాజేశ్వరా

శుభకరా జయకరా రామలింగేశ్వరా


1.మంచి చెడ్డలమాట ఎంచకుంటిని స్వామి

తలబిరుసు నడవడిక పెంచుకుంటిని స్వామి

తపనలింకను తలపులో త్రుంచకుంటిని స్వామి

తత్వమిక సత్వరమె తెలుపమంటిని స్వామి


2.గంగతో నా బెంగ కడిగివేయర స్వామి

కంటితో కలుషాలు కాల్చివేయర స్వామి

నా ఒంటి విషమింక లాగివేయర స్వామి

ఈశ్వరా నా ఈర్ష్య మసిజేయరా స్వామి

Wednesday, February 15, 2023

 

https://youtu.be/4NVXyw6-n9g

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:మోహన

అది ఇమ్మని ఇది ఇమ్మని
పదేపదే పరుష పదమ్ముల కుమ్మితి
నెమ్మనమున నిమిషమ్మును
ధ్యానించక నరహరీ నిను విస్మరించితి
మన్నించర మదనజనక నన్నేమనక
నమ్మితినిను కన్నతండ్రివి నీవేగనక

1.నిను మచ్చిక చేసుకొనే
మతలబులను ఎరుగను
నీ మమతను చూరగొనే
ప్రియవచనము పలుకలేను
మనసుకు ఎంతవస్తెఅంతగా
నిను కించపరుచు వాచాలుడను
మన్నించర మదనజనక నన్నేమనక
నమ్మితినిను కన్నతండ్రివి నీవేగనక

2.ఉద్ధరించబడు నటువంటి
ఉన్నత విధుల నేనడుగను
ఉత్తుత్తి తాయిలాలకోసమే
స్వామీ ఎప్పుడు ఎగబడెదను
జన్మా జీవనము ఆన్నీ నీవేకదా
నాదంటూలేదని ఏలనో మరిచెద
మన్నించర మదనజనక నన్నేమనక
నమ్మితినిను కన్నతండ్రివి నీవేగనక

Tuesday, February 14, 2023

 

https://youtu.be/pai3zAVcvII

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


కనులకు రమణీయము

మనసుకు కమనీయము 

సదాశివా నీ కళ్యాణము

శివానీ తో నీ కళ్యాణము

ఓం నమఃశివాయ 

శ్రీ రామలింగేశ్వరాయ


1.శివరాతిరి శుభ ఘడియలలో

  శివరత్నక్షేత్ర అయ్యంకి గుడిలో

  గంగా పర్వతవర్ధిని సమేతుడిగా

  జగదంబను పరిణయమాడగా


2.నిష్ఠతొ పొద్దంతా ఉపవసించి

నీ దివ్య లింగ రూపము దర్శించి

భక్తితో నిరతము నిను ధ్యానించి

ముక్తినొందేము రేయంతా జాగరించి

Monday, February 13, 2023

 https://youtu.be/JLfn-x9DEhQ


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:రేవతి


దయరాదేల ధర్మపురీశా

సదమల హృదయ ప్రహ్లాద పోషా

నెర నమ్మితినిను నరహరీ మొరవినిరారా

సర్వాంతర్యామి కరుణాసాగర 


1.కరివరదా ప్రభో ఆపద్భాంధవ

ధ్రువుని బ్రోచిన అనాథ నాథా

మానిని ద్రౌపది మాన సంరక్షకా

నెర నమ్మితి నరహరీ నీవే రక్ష నాకికా


2.నారద సంస్తుత అంబరీషార్చిత

పుండరీక ప్రియ దుష్టసంహార

శేషప్ప కవి నుత  కైవల్యదాయ

నెర నమ్మితి నరహరీ ఆదుకోవయా


https://youtu.be/N1edpKFlK0w

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:రసిక రంజని


జై వీరాంజనేయా జై అసుర భంజనాయ

జయహో నిరంజనాయా మహీజ మనో రంజనాయ

జయము జయము స్వామీ నీకు నీరాజనము

నీనామ స్మరణయే భవ దుఃఖ భాజనము


మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి

కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి


1.అష్టసిద్ది నవ నిధుల ప్రదాతవు

  ఆనంద పరవశావస్థ సంస్థితవు

  ఇడుముల దునిమెడి ఇభవరదుడి భక్తుడవు

  ఈప్సితముల నెరవేర్చెడి తవభక్త సులభుడవు


  మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి

  కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి


2.ఉడతను సైతం బ్రోచిన శ్రీ రామబంటువు

భక్తి శక్తి ముక్తి పదములకు నీవే నిజ నిఘంటువు

ఎంతని పొగడను చింతలు దీర్చే చింతామణివీవు

ఏమని పాడను నీవే మా మనవిని విని కాచే వాడవు


మంగళ మూరుతి నీకిదే మా ప్రాణహారతి

కొండగట్టు మారుతి నీకిదె మా జీవన హారతి



Sunday, February 12, 2023

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


శివుడిని మించిన ప్రేమికుడెవరు

అర్ధదేహమే ఉమకిచ్చినాడు

బ్రహ్మకన్ననూ ఇల భావుకుడెవరు

నాలుకపైన వాణికి బసకూర్చినాడు

సిరినురమున దాల్చిన హరికెవరు

ధరలో సరి ప్రణయారాధకుడు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


1.రంగూ రుచీ వాసన లేనిది ప్రేమ

రూపం దేహం ప్రాణం ఉన్నది ప్రేమ

అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమ

ఋజువు సాక్ష్యం లేని నియతి ప్రేమ

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం


2.ఆకాశమంత ప్రేమ ఆకాశం ప్రేమ

కాలమున్నంత కాలం కలిగే ప్రేమ

కలకాలం కల ప్రేమ కలలలోకం ప్రేమ

ప్రేమనే ప్రేమిస్తారు వ్యక్తులను వదిలేస్తారు

ప్రేమ దైవంలా ఒకభావం

ప్రేమ భావనే కదా దైవం

 https://youtu.be/Ybf1VFS6wgs


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


రాగం:శుభ పంతువరాళి


ముగియనీయవయ్యా ప్రభూ

ఈ అసమర్థుని జీవయాత్ర

తెరదించవయ్యా తప్పుకొనగ

నవ్వులపాలైననా విదూషకపాత్ర


1.అభిమానం అణువంత

అవమానం అవనియంత

వెరసి దుఃఖమే ఫలితం

నా దుర్భర జీవితమంతా

అర్ధాంతరమనకుండా ఆపివేయిస్వామి

ఆసాంతం మనకుండా నలిపివేయవేమి


2.బట్టకట్టినావు గట్టిగ నామూతికి

 విందుముందు పెట్టినావు నాకేటికి

అందుబాటులోనే ఉంది ఆనందము

అనుభవించ నోచని దౌర్భాగ్యచందము

ఉట్టికెగిరే పట్టులేదు స్వర్గయోచన హేయము

పట్టుకొందు నీపాదాలను అదియె నా కైవల్యము

 https://youtu.be/0bF52r9xxEA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

 

రాగం:శివరంజని 


నాది తిరోగమనం,

నీది పురోగమనం…

కలనైన కలువలేము మనం

వీడ్కోలు నీకిదే విడిపోయే ఈక్షణం

తీరితీరాలి మరుగయే నేస్తమా

ఎప్పటికీ నీ మనోకామనం


1.తుడిచివేస్తున్నా మదిలో నీ జ్ఞాపకాలని

చెరిపివేస్తున్నా ఎదపై నీ సంతకాలని

ఎన్నడనుకోకు నాపేరైనా పలకాలని

గతకాలపు స్మృతులన్నీ చితిలో కాలని


2.పొందినాను ఆనందం నీకేది ఈయకనే

విసిగించా పలుమార్లు సాయమేది చేయకనే

ఊహించాను ఎక్కువే ఉన్నదెంతొ తోయకనే

నీ వెంటపడిపోయాను నీవేంటో తెలియకనే

Saturday, February 11, 2023

 


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


కావాలనుకొని ప్రేమిస్తే ప్రాణాలైనా అర్పిస్తా

విలువనీయక తోసేస్తే నీ పేరు సైతం చెరిపేస్తా

ఎదిగితే ఒదగకపోతే పడిపోక తప్పదు నీకు

బ్రహ్మరథం పట్టినవాళ్ళే ముంచగలరు మూణ్ణాళ్ళకు


1.నిను నెత్తిన పెట్టుకుంటే అలుసుగా భావించావు

కాలికింద నలిపేసి హీనంగా తలపోసావు

మందీ మార్బలాలూ ఏవీలేని సామాన్యుడిని

వందిమా గధులతొ నిన్ను అందలం ఎక్కించనివాణ్ణి


2.మాయలోన మునిగాను నీవన్నెచిన్నెలకు

భ్రమలోనె బ్రతికాను పైపైని నీ మెరుగులకు

ఎన్నాళ్ళు నీతోఉన్నా నీకునేను ఒక పిచ్చోడిని

దేవతగానే కొలుచుకున్నా నీదృష్టిలొ గుదిబండని


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 



ఆశీస్సులు చిన్నారి ఆశ్రిత్ రోహన్ కు

మా అందరి దీవెనలు దీర్ఘాయుష్మాన్ భవా అంటూ నీకు

మా కన్నుల దివ్వెలతో ఇచ్చేము ప్రేమ నీరాజనాలందుకో 

మానవ్వుల అక్షతలివిగో ఉన్నత శిఖరాలనికపై నీవుచేరుకో


శుభాకాంక్షలివిగో నీపుట్టిన రోజున

శుభహారతులందుకో ఈ ఆనంద సమయాన


1.సుందరాంగ నీకిదే నిండుచంద్రహారతి

సూక్ష్మబుద్ధిగల నీకు దివ్య సూర్యహారతి

నవ్వుల వెదజల్లే నా తండ్రీ నక్షత్రహారతి

పరవశాన్ని కలిగించే నీమోముకు పరంజ్యోతి హారతి


2.దినదినము వర్ధిల్లగ నీకిదే శుభహారతి

దిష్టన్నది తగులకుండా నీకు కుంభ  హారతి   

గెలుపు నీ తలుపు తట్టగా అందుకో జయహారతి

వంశానికే మంచిపేరుతేగా గొను మంగళ హారతి

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చిత్తరువైపోయాను నీ చిత్తరువునుగాంచి

మత్తులో కూరుకపోయాను నీ మధరగాత్ర మాస్వాదించి

భువికే అందాలు పెంచావే ఏదివ్యలోకాలనుండో ఏతెంచి

సలాంచేస్తానే మీ అమ్మానాన్నలకు నినుకన్నందుకు తలవంచి


1.నీకేశ సంపద నను నిలువున ముంచదా

కురుల వంకీ మోమున వాలి ఎదలయ పెంచదా

నిగారింపు బుగ్గలు చూసి నిమురాలనిపించదా

వన్నెలెన్నొ ఒనగూరిన నీమేను హరివిల్లును మించదా

ప్రణామాలివే మీ నాన్నకు నీవంటి సుందరికి జనకుడైనందుకు


2.ఇంద్రనీల మణులేనే దీపించే నీ కనులు

చంద్రకాంత సదృశాలు నీ అజిన జానులు

పొందికగా నీకమరింది అప్సరసల దేహసౌష్ఠవం

మంత్రముగ్దులవ  జేస్తుంది నీ గాత్ర సౌరభం

వందనాలివే మీ అమ్మకు వాసిగ నిను కని ఇచ్చినందుకు

 https://youtu.be/GWb2beg4d3Y


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


నీది చేతకానితనమో

నీకు న్యూనతా భావమో

పదే పదే నిన్ను ప్రార్థించిన ప్రతిసారి

నీ పదముల తలనిడి నేనర్థించిన తూరి

శ్రీ వేంకటాచలపతి ఏదీ నీ చమత్కృతి

వ్యర్థయత్నమా వేడగా నీ శరణాగతి


1.పుక్కిటి పురాణాలా నీ మహిమలు

అక్కరకే రాకుంటే ఎందుకు నీలీలలు

ఉబుసుపోక రాసినవా నీ పావన చరితలు

ఉత్తుత్తి కథలేనా నీ అవతార గాథలు

జయహో వేంకటపతి ఏదీ నీ చమత్కృతి

నీరుగారి పోయిందా నీ శరణాగతి


2.దోపిడి దొంగవు నీవు ఆరోగ్యం దోచావు

పోకిరి పోరంబోకువు ఆనందం త్రుంచావు

నీ జోలికి వచ్చామా మమ్ముల ముంచినావు

కోరికేమి కోరామని బ్రతుకు బుగ్గి చేసినావు

నమోనమో తిరుమల శ్రీపతి ఏదీనీ చమత్కృతి

పునరుద్ధరించుకో స్వామీ నీ శరణాగతి

 https://youtu.be/xszbhtdb3WA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మగ్గిన మామిడి పండే నీ సోయగం

గుప్పను సిరి మల్లెచెండు నీ సౌరభం

పరిపక్వమైన నీ పరువం శృంగారనైషధం

విరహాగ్నిన కాలే నాగుండెకు నీవే పరమౌషధం


1.నిండు చంద్రబింబమే ప్రియా నీ వదనం

  పండువెన్నెల వర్షించేనది నాపై అనుదినం

మచ్చల జాబిలి తూగదు నెచ్చెలీ నీకుపమానం

పుట్టుమచ్చ తెచ్చేను నీమోముకు మిక్కిలి చక్కదనం


2.నవ్వితే రాలు పారిజాతాలే  నీ పెదవంచుల్లో

వెతికినా అగోచరాలు నీ వయారాలు రాయంచల్లో

ముంచేయవే సుధ గ్రోలగా హద్దెరుగని ముద్దుల్లో

బంధించవే సందిట ప్రేయసీ నన్ను సందెపొద్దుల్లో

 https://youtu.be/1UIQnCZ68Cw


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రేమ స్వరూపుడు కాముని జనకుడు

మదన గోపాలుడు గోపికా లోలుడు

ప్రణయారాధకుడు రాధా మాధవుడు

నాకు ఆరాధ్యుడు అనుభవైకవేద్యుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


1.నవనీత చోరుడు వరాసి చోరుడు

మీరా మానస చోరుడు మచ్చిచ్చోరుడు

మురళీధరుడు శిఖిపింఛ ధరుడు

వైజయంతి మాలాధరుడు శ్రీధరుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


2.నందనందనుడు ఆనందవర్ధనుడు

మన్మోహనుడు ఘనశ్యామసుందరుడు

గోవర్ధన గిరిధరుడు గోవిందనామాంకితుడు

లీలామానుష వేషధరుడు మురహరుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


https://youtu.be/1UIQnCZ68Cw

 https://youtu.be/P_iz-SKtS6k


రచన,స్వరకల్పన&గానం:డా గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:యమన్ కళ్యాణి


శివ కళ్యాణము విశ్వ కళ్యాణమే

శివరాత్రి వ్రతముతో జీవకైవల్యమే

కనరండి కనులారా శివభక్త జనులారా

తరించండి తిలకించి తనువుల తపనలార

ఓం నమః శివాయ,జయ శ్రీరామలింగేశ్వరాయ


1.శివరత్న క్షేత్రమౌ అయ్యంకి పవిత్ర ధాత్రిన

వరలుచున్నాడు ఇల మొరలాలకించుతూ

శ్రీరామలింగేశ్వరుడు గంగా పర్వతవర్ధినియుతుడు

శరణాగతవత్సలుడా శంభుడు భక్తవ శంకరుడు భక్త వశంకరుడు


2.గంగను భరించి భర్తగమారిన భవహరుడు

లింగోద్భవ ఘట్టాన హరి బ్రహ్మల కందనీ దురంధరుడు

చెంబుడు నీళ్ళకే సంబరపడు గంగాధరుడు

అంబరమును అంబరముగ మేన దాల్చె దిగంబరుడు


3.మతితప్పి గతిగానక సతికై దుఃఖించిన భవుడు

పార్వతినే తపమాచరించి వరించిన అర్ధనారీశ్వరుడు

శ్రుతి లయ తామై జగతినే మురిపించగా మా ఉమాధవులు

వధూవరులై పరిణయమాడిరి విధిగా భవానీ భార్గవులు

Thursday, February 9, 2023

 అందముంది అదిచాలు అందరూ పడిపోతారు

కవనము గానం ఉందా సదా ఫిదాలై పోతారు


1.పెద్దపీట వేస్తారు పెత్తనాలు సమకూరుస్తారు

చనువు చొరవా ఉన్నాయంటే సాగిలపడిపోతారు


2.అందలాలనెక్కిస్తారు పదవులేవొ ఇచ్చేస్తారు

అందుబాట్లొ ఉన్నామంటే వందిమాగధులౌతారు


3.గోరంతకు కొండంతగా అండదండలందిస్తారు

ఉబ్బితబ్బిబ్బు చేసేస్తూ ఊరంత ఊరేగిస్తారు


4.*క *కా *కీ ల కెవ్వరూ అతీతులు కారు రాఖీ

కాగల కార్యానికి గంధర్వులే దివి దిగి వస్తారు


*క-కనకం

*కా-కాంత

*కీ-కీర్తి

Wednesday, February 8, 2023

 https://youtu.be/9yCPjxRQ2Xk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గజల్ కాదు,పాటకాదు.. ఇది నా గుండెకయిన

గాయము, హృదయ రుధిరము,నా నయన సలిలము



గుబులేదో దిగులు పెంచె నమ్మవేమే  ప్రేయసీ

గుండెనే ముక్కలాయే నన్ను ఖాతరు చేయకుంటే


నర్మగర్భపు మాటలేవో నమ్మతోచెనె ప్రేయసీ

ఆశలే అడియాసలాయే బాస పాతర వేయుచుంటే


మదిని మస్తుగ శోధించా మరో పేరుకోసం ప్రేయసీ

నిలువెత్తు నీరూపే చిత్తరువుగ నిలుచుంటే


మనమధ్యన ఉన్నబంధం మచ్చలేనిది ప్రేయసీ

నీలెక్కకు అదిశూన్యం నా దృష్టిలో అమూల్యమంతే


పట్టుకొని పాకులాడితే బెట్టు పెరుగదా రాఖీ

తేలికగా వదిలేయ్ నేస్తం  తెప్పరిల్లగలవంతే

Tuesday, February 7, 2023

 https://youtu.be/vkdGuH5gYmE


*HAPPAY PROPOSAL DAY*


❤️LOVELY🌹MORNING❤️


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:అమృత వర్షిణి


ఎదలో దాగిన నా నివేదన

పెదవే దాటని ప్రేమ భావన

నను నీకే అంకితమిచ్చె ఒకేఒక  ప్రతిపాదన

నీ ముందుంచా ప్రియతమా పరవశాన

కాదనవనే నమ్మికతో ఈ శుభోదయాన


1.ఎదురుగా నీవుంటే ఏదో అలజడి

నా మనసు మెదడు ఎపుడూ కలబడి

వివేకం చేతిలో హృదయానుభూతి ఓడి

విప్పలేక పోయాను నా ఊసుల మూటముడి


2.నీ కొంటె చూపులో సరి కొత్త భాషలు 

సొగసైన నీ నవ్వులో ప్రేమ సందేశాలు

నాతో ఉన్నపుడు నువుపొందే సంతోషాలు

పురులు విరియ జేసాయి నాలోన ఆశలు


@everyone


https://youtu.be/vkdGuH5gYmE

 https://youtu.be/tvHDgxfDkz0


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


వాడని గులాబి నా హృదయం

నీ మంజుల పదముల ముందుంచా ఈ ఉదయం

ఎన్నాళ్ళుగానో వేచిన శుభసమయం

ఆసన్నమాయె చేయవే ప్రేయసీ…నాభవితను రసమయం


1.ఎప్పుడు పడిపోయిందో

  ప్రేమబీజం నా మదిలో

  మొలకెత్తింది నీ రూపై

  నా జీవన మధువనిలో


2.అరవిరిసిన ఎదరోజాను

అర్పించా నీ ఆరాధనకై నేను

నా ప్రణయ  దేవివి నీవేనూ

నను చేరదీయవే నీవాడిగాను


3.నివేదించాను గాని వేదించలేదే

అడుగుజాడల నడిచా వెంటాడలేదే

ఓపిగా నిరీక్షించా విసిగించలేదే

అభిమానం చూరగొన్నా నిరసించలేదే

 

https://youtu.be/9ac52eNVTDc?si=SEylgAhKXoc0l9YG

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


సిరిగిరి సిగరాన జంగమయ్యవు మాతండ్రి మల్లన్న

కొమురెల్లి గట్టున నువ్వు కురుమ పట్నాల మల్లన్న

వేలాల గుట్టమీద నీ సత్తెముంది మల్లన్న

రత్నపూర్ పల్లెనుంటివి దూదికండెల మల్లన్న

ఊరేదైనా పేరేదైనా నీతీరు సక్కంది మల్లన్నా

కడుపుల వెట్టుక కాసుకుంటవు మమ్ముల మల్లన్నా


1.ఈసుగాంలోన ఎలిశావు ఈశుడవై మల్లన్నా

ఐనవోలున ఉన్నావు నీవు మైలారూ మల్లన్నా

ఓదేలు గ్రామానా ఖండీశునివి నీవే మల్లన్నా

గట్టుమల్లన్నవు లొద్ది మల్లన్నవు ఆడీడ అంతట నీవె మల్లన్నా


2.కోనెపల్లి లోన కొలువుండినావు దండి మల్లన్నా

పెద్దాపురాన పెద్దమనసునీదని పేరొందినావు మల్లన్నా

మాలేగాంలోనా ఖండోబా సామిగ నీవుండినావు మల్లన్నా

ఎములాడ రాజన్న శ్రీ రామలింగన్న అన్నీ నీవే రాజమల్లన్నా

Sunday, February 5, 2023

 

https://youtu.be/m7VfM5Jo6P4

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నమక చమక స్తోత్ర సహిత నిరతాభిషేక ప్రియా

కాలకూట గరళకంఠ మహాదేవ మృత్యుంజయా

శ్రుతి లయ గతి  గమక సంగీతశాస్త్ర గురువర్యా

తకిటతధిమి తాండవలోలా నటరాజా నమఃశివాయా


1. త్రినేత్రా త్రిశూలహస్తా త్రిగుణాతీత త్రిభువన పాలా

చతుర్వేదార్చితా చతురానన వినుతా చంద్రచూడ కాలకాలా

పంచభూతాధినేత పంచాస్యా పంచాక్షరీ నామ విలోలా

షణ్ముఖ జనకా షడంగపోషకా షట్చక్రసంస్థితా క్ష్వేళగళా


2.సప్తవ్యసన హారాకా సప్తస్వరాత్మకా సప్తజన్మ పాప నాశకా

అష్టదిక్పాల పాలకా అష్టైశ్వర్య దాయకా అష్టకష్ట నివారకా

నవరసపోషకా నవగ్రహాధినాయకా నవనిధి ప్రదాయకా

దశదిశ వ్యాపకా దశావతారి రూపకా దశమహా విద్యా ప్రదీపకా

Saturday, February 4, 2023

 https://youtu.be/-pQWCOb-6FI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


తడిసిన నా తలగడనడుగు ఎన్నిత్రాగిందో కన్నీళ్ళను

రేయంతా నిద్రమాని గదిలోని దీపమెలాకందో నా వెక్కిళ్ళను


1.సాగరఘోషలాగా నాఊపిరి ధ్వనిస్తూ నాకే వినిపిస్తూ

యుద్ధనగారా మ్రోగినట్లు అలజడి చెలరేగినట్లు ఎద సవ్వడి చేస్తూ


2.తలచి తలచి నాలో నేనే కుమిలి కుమిలి విలపిస్తూ

వేచి వేచి నీకై వగచి నిరాశతో నే నిట్టూర్చి వలపోస్తూ


3.దగ్గరగా భావిస్తుంటే దూరంగా నను నెట్టేస్తూ కాళ్ళను కట్టేస్తూ

దూరమై చేజారావనుకొని బేజారైన వేళల్లో చనువిస్తూ మైమరపిస్తూ

 https://youtu.be/QtLkdXqbLl4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఎంతటి అక్కసు ఏమిటి ఆ  అసహనం

సంకుచితత్వంతో మానవతకు హననం

ఊరందరి దారివీడీ నీవే ఉలిపికట్టెగామారి

కట్టబోకు నీలో మరుగునపడిన  మనిషికి ఘోరి


1.కలం కులం ఊసిక ఎత్తిందా అది అభాసే

మతం వెంట అభ్యుదయం పడిందా మసే

తరాలుమారినా తలరాతలుమారినా ఇంకా కసే

తాతల మూతుల వాసన తలపుండు కెలుకు రసే


2.నది వరదను దాటించిన కాంతను యతిదించినా

ఆశ్లీలత పేనుకొంటు మోయడమే కుమతి వంచనా?

చావూ పుటకలు ఉచితా నుచితాల నెంచక వాదించేనా!

ఔనన్నదికాదని కాదన్నది ఔననడమే వెర్రిమొర్రి యోచన


@everyone

 https://youtu.be/CijhdKgnKBU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఉండునా తండ్రీ పుండరీకాక్షా జనులకీ ఇలను

దండించగా నరకములు ఇహపరమ్ములనూ రెండు  మెండుగను

దాటవలెనేమో వైతరణి మేము బడయగా రౌరవాదులను

కడచుటెటులో తిరుమలేశా  జరా మరణాలను దీర్ఘ వ్యా ధులను


1.రక్తపోటులు గుండె పోటులు కాలనాగుల కాటులు

 మధుమేహవ్యాధులు పలురాచవ్రణములు అవి కత్తివేటులు

నలతలెన్నో కలతలేన్నో తట్టుకోజాలని తలపోటులు

ఏనాడు ఏతీరు సలిపితిమొ కడు తీవ్ర దోషాలు పొరపాటులూ


2.సంతోషమన్నది కలనైనఎరుగని మా మోడు బ్రతుకులు

ఉల్లాసమన్నది ఊసైన కనలేని దినదినపు గతుకులు

ఎన్ని ఉన్నాగాని అనుభవమ్మేలేని మామూలు జీవితాలు

ముంచననన్నా ముంచు మంచిగా బ్రతికించు ఏదైననూ మాకు మేలు

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మధిర త్రాగితే మత్తు కొందరికి

మధువు గ్రోలితే మత్తు కొందరికి

కైపెక్కుతుంది రాగానే నీ ముందరికి

మైకమన్నది మారు పేరు నీవంటి సుందరికి

-రసమంజరికి


1.సారాయిలో ఓలలాడె ఉమర్ ఖయ్యాము

అనార్కలి ప్రేమలో సమాధి ఐనాడు సలీము

 లైలాను వలచి ఐనాడు నాడు మజ్నూ గులాము

ఉన్మత్తుల జేస్తుంది ఎవరినైనా నీ అపురూప రూపము


2.భ్రమరమునై భ్రమిసి పోతాను నిను గనినంత

బ్రాంతిలో మునుగుతాను నను నేనే మరచినీచెంత

నువురాకుంటే చింత వచ్చాక వెళ్ళిపోతావని చింత

మంత్రంవేస్తావో మాయలు చేస్తావో నీబానిస నవక పోతెనే వింత

Thursday, February 2, 2023

 https://youtu.be/gE227kQLKbU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


స్వరములు ఏడే సరిగమపదని

పంచుతాయి వీనుల విందగు సుధని

ఎదలకందించుతాయి ఆహ్లాద మధురిమని

ఆలపించినా ఆలకించినా గానం ఉభయతారణి


1.అలసిన మేనుకు వింజామర పాట

విసుగు చెందియున్నవేళ మదికూరట

ఎడారి దారులలో ఎదురయే తేనె ఊట

ఏకాకి జీవితాన ఏకాంతవాసాన నేస్తమంట


2.కాలిన గుండెలకు హాయగు నవనీతం

  మండే వేసవిలో తుషార జలపాతం

వసంత యామినిలో మంజుల మారుతం

నలతల కలతల నోకార్చే ఔషధం గీతం

 https://youtu.be/Z5YXvrqTYTM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నిత్యపూజలివె నీకు నరకేసరి

ప్రత్యక్ష దైవమా ధర్మపురి నరహరి

భక్తిమీర కొలిచేము శంఖచక్రధారి

అనురక్తి మము బ్రోవవే శ్రీహరి


1.ప్రాతఃకాలాన సుప్రభాత గీతాలు

గౌతమీ తీర్థముతొ దివ్యాభిషేకాలు

పంచోపనిషత్తుల సహితమైన సన్నుతులు

జనుమంచి వంశజులచే శ్రీగంధ లేపనాలు

తులసి కుంకుమార్చనలతొ కైంకర్యాలు

ఘనపాఠీలు అర్చకస్వాముల ఆరాధనలు


2.అనునిత్య కళ్యాణ ఉత్సవాలు

కుంభ నక్షత్రాది పంచవిధ హారతులు

పులిహోర చక్కెర పొంగళినైవేద్యాలు

యాత్రీకులందరికి నిత్యాన్నదానాలు

తీర్థ ప్రసాదాల నిరంతర వితరణలు

రాత్రివేళ స్వామీ పవళింపు సేవలు




*_నా youtube channel కి ఇంకా సబ్ స్క్రైబ్ చేయకుంటే దయచేసి చేయండి,చేయించండి_*

 https://youtu.be/mQewJLr5uy0


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


పరమదయాళువు నీవు వీర రాఘవా స్వామీ

తిరువళ్ళూరు తిరవాసా నీకు నమోనమామి

పద్మనాభ  పురుషోత్తమ పాహి ఫణిపతి శయనా

ఆయురారోగ్య వరదా దేహిమే సూర్యచంద్ర నయన


1.నినునమ్మి కొలిచితె చాలు సమసేను దీర్ఘవ్యాధులు 

నిను మది తలచితె చాలు  తొలగేను మనోరుగ్మతలు  

సకలరోగ ఔషధాలు నీ చెంతన సులువుగా లభ్యము

మా చింతలు దీర్చే చింతామణి నీవన్నది సత్యము


2.వసుమతి నామాంతర కనకవల్లి ప్రియపతివి 

వైద్య వీర రాఘవమూర్తిగా వరలు విష్ణుమూర్తివి

శాలిహోత్రమహాముని తపఃఫలాన ఇలవెలిసితివి

పరిమళ తైలాభిషేక అభిలాషివి క్లేశనాశి పెరుమాళ్ళవి

 https://youtu.be/Ej78zAEoWLA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాధను కాదన్నాడు-మీరాను మరిచాడు

అష్టభార్యలున్నా నిన్నే ఇష్టపడినాడు

గోపికలు వేలున్నా నీవెంట పడినాడు

అంగజ జనకుడినే అలరించిన మంజులతాంగి

సంగతులు పలుకవా నీ అంగాంగం కనగ నా ఎదపొంగి


1.లక్షకావ్య రచన చేయవచ్చు నీ మేని లక్షణాలకు

కోటి కృతులు వెలయింపవచ్చు నీబోటి ఆకృతులకు

వందలాది ప్రబంధాల్లొ వర్ణణలేదు నీ అందచందాలకు

కనీవినీ ఎరిగిన దాఖలాయేలేదు సఖీ నీసోయగాలకు


2.మేనక వెనక పడకపోవు విశ్వామిత్రుడు నీవెదురైతే

అహల్య శిలగా మారే వ్యధ తప్పెడిది ఇంద్రుడు నినుచూస్తే

శకుంతలకు చింతదూరమయ్యడిది దుష్యంతుడు నినుగాంచితే

పరమశివుడు నిన్నే మోహించెడివాడు నువు తారస పడితే

 https://youtu.be/B_iIwz-5QiM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మనిషంటే కులం ?-మనిషంటే మతం?

మానవీయమయ్యింది ఎపుడో విగతం !

నా సువిశాల దేశంలో సంకుచిత సమాజంలో

లౌకికతకు ఏదీ ఊతం ఏకత్వాని కేల విఘాతం


1.కులం ఫలానా మతం ఫలానా అంతమాత్రమేనా

భారతీయత జాతీయత పౌరులమదిలో హుళుక్కేనా

ప్రలోభాలకు ప్రభావాలకూ ఓటెప్పటికీ తాకట్టేనా

నోటును ఓటుగ మార్చే గారడి ఆటలు ఇక కట్టేనా


2.నేను నాది నాస్వార్థం బాటలో దేశయవత

చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్షగ మారిన మానసికత

ఓటువేయుటకు సెలవిస్తే ఇల్లే దాటని అలసత్వం

ఓటుకు ఉన్న విలును ఎరిగితె నవ్య రాజకీయం

భవ్య భారతీయం


*Plz subscribe to my youtube channel CLASS*