Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మ దేహము నాన్న ప్రాణము

మన జీవితమే తలిదండ్రుల దానము

కన్నవారు కన్నకలల పంటే మనము

జననీ జనకుల దయలేక క్షణమైనా మనము


1.పాలు మురిపాలు అమ్మ దయాబిక్షయే

ఈనాటి మన ఉన్నతి నాన్న క్రమశిక్షణే

తమనోరుకట్టుకొని మనమడిగినదొసగినారు

తమ లక్ష్యమె మనమవగా దీక్షగా సాకుతారు

ఏమిచ్చినాగాని తీరిపోదు వారి ఋణము

కన్నందుకు బాధ్యతంటె అది వ్యర్థప్రలాము


2.ముదిమిలోన ఆసరాగ నిలుచుటయే ధర్మము

కంటికిరెప్పలాగ కాచుకొనుటె కర్తవ్యము

ప్రాథమ్యాలలో పట్టించుకొనకుంటే నీచము

వృద్ధాశ్రమాల ఊసు మాయమైతె ధన్యము

ఏమిచ్చినాగాని తీరదు కన్నవారి ఋణము

అనురాగము ప్రతిగచూపి పొందాలి ఆశీర్వచనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్ననే నిన్నునే మరచినాను వేంకటేశ్వరా

నీగీతమే రాయనైతి తిరుమలేశుడా

కారణాలేవైనా కాల హరణాలే

మన్నించి అనుగ్రహించు నీ చరణాలే


1.ఇతర కర్మలైతే తప్పించుకుంటినా

అన్యకైతలైతే రాయకమానితినా

అదేమి చిత్రమో నీ ఊసే తోచలేదు

ఏ మాయో మంత్రమో నీ ధ్యాసే గుర్తులేదు

కారణాలేవైనా కాల హరణాలే

మన్నించి అనుగ్రహించు నీ చరణాలే


2.మదిలో నిను చేయనైతి మననము

శనివారమె నీదను నా పిచ్చి వైనము

స్థలకాలాలు నీకెలా వర్తించును స్వామి

విశ్వరూప జగన్నాథ సర్వాంతర్యామి

కారణాలేవైనా కాల హరణాలే

మన్నించి అనుగ్రహించు నీ చరణాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా గుండె గడియారమందు 

లబ్ డబ్  లబ్ డబ్ లబ్ డబ్

నా ప్రేమ సామ్రాజ్యమంతా 

లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్

పుట్టింది ప్రేమకోసమే బ్రతికేది ప్రేమకోసమే 

పోయేదీ ప్రేమకోసమే

ప్రేమా ప్రేమా ప్రేమా నేనే నీ చిరునామా

ప్రేమా ప్రేమా ప్రేమా నీవే నా జీవితభీమా


1.చిరుగాలి మోసుకొస్తుంది ప్రేమగంధం

నీలికురులేవొ నాపై వాలినట్లు

చిరుజల్లు చిలకరిస్తుంది ప్రేమ మకరందం

చెలిపెదాల తడితాకినట్లు

పంచభూతాలే పంచసాగే నాకే

ఎనలేని ప్రేమానుభూతులు

ప్రకృతి సాంతం అందించసాగే

అనుకూలమయ్యే ప్రేమరీతులు


2.జలపాతమే నేర్పించెనే ప్రేమగీతం

చెలి పాటలా చెవిలోన హోరెత్తగా

సుమలతలే అలరించెనే ప్రేమ మండపం

చెలి తానే అల్లుకున్నట్లు స్ఫురియించగా

చూసే కనులుంటే జగమంతా

అణువణువూ ప్రేమమయం

రాసే కలముంటే  భావనంతా

రూపొందదా ప్రేమ కావ్యం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిండైన అందమెపుడు ప్రౌఢలదే

మెండైన సోయగమంటే నడివయస్సు భామలదే

హుందాతనంతో కనువిందుగొలిపేరు

లౌక్యతను ఆపాదించి కుసుమ సొగసులీనేరు


1.సౌందర్యపోషణలో ఆరితేరిపోతారు

ఆకర్షణ కేంద్రమేదో ఎరిగి మరీ ఉంటారు

ఆకట్టుకోవడంలో కనికట్టు చేస్తుంటారు

కట్టుబొట్టు గుట్టంతా పుక్కిట పట్టేస్తారు


2.నవ్వులతో పెదాలపై హరివిల్లే వెలిపిస్తారు

చూపులతో కన్నులలో వెన్నెలలే కురిపిస్తారు

మాటమాటలోను మకరందం ఒలికిస్తారు

మనసెరిగిన చేతలతో ఎదుటివార్ని గెలిచేస్తారు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనదీ ఒక బతుకేనా కుక్కలవలెనక్కలవలె

మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె

సిగ్గూఎగ్గూ రోషం పౌరుషం ఇంటావంటా కనరాకుండా

మానం అభిమానం పరువు గౌరవం ఏకోశాన లేకుండా


1.ఖాండ్రించి ఉమ్మినా తుడిచివేసుకొంటూ

మన్నుమీద పోసినా దులిపివేసుకొంటూ

నలుగురిలో నిలదీసినా  నవ్వులొలుకబోసుకుంటు

పదుగురిలో  కడిగేసినా పరాచికాలాడుకుంటు

మనదీ ఒక నడతేనా కప్పలవలె ఎలుకలవలె

మనదీ ఒక క్రమతేనా గోడమీది పిల్లులవలె


2.మంచినీళ్ళప్రాయంగా లంగబొంకులే బొంకుతు

మంచి గంధమని ఎంచి సంకలెన్నొ నాకుతూ

విలువలనే వెలివేసి అడ్డమైన గడ్డిమేస్తూ

బట్టకడితెమాత్రమేమి నగ్నరీతి సంచరిస్తూ

మనదీ ఒక చరితేనా బల్లులవలె నల్లులవలె

మనదీ ఒక శీలతేన పెంటమీది ఈగలవలె


(మొదటి రెండు పంక్తులు శ్రీశ్రీ గారివి -వారికి నమస్సులతో)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యమన్ కళ్యాణి


అపార విశ్వాసమే సాయీ నీ భక్తులకు

ఎంతటి అంకితభావమో నీ అనురక్తులకు

నీ దాసుల పారవశ్యమేమనవచ్చు

నీ సేవలొ తరించగా బ్రతుకులు వెచ్చించు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ


1.పేరుకు ముందో  పేరుకు వెనకో-సాయి యని జతచేసుకొంటారు

పలకరించు  వీడిపోవు వేళల్లోను-సాయిరాం సాయిరాం అంటుంటారు

గుడికిపోను కుదరకున్నా నీపటంముందు ధూపమేసి మొక్కుతారు

ఆపద సంపదలందునూ అనవరతం సాయీ యని స్మరిస్తారు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ


2.ఎదురైన ప్రతివారిని నీవుగానె  భావిస్తారు

జీవరాశులన్నిటిలో నిండారా నీరూపమె దర్శిస్తారు

యోగక్షేమాలు నీవే చూసెదవని నిశ్చింతగ ఉంటారు

నీ సర్వస్యశరణాగతినే ఎల్లరూ సతతం వేడుకుంటారు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మట్టి దుప్పటి కప్పుకున్నా

కాటిలో  కాలి బూడిదైనా

మరువలేనే నేను నిన్ను ప్రియతమా

మరుజన్మకైనా నువ్వు నాకు ప్రాప్తమా


1.నీ చీకటిదారిలోనా ధృవతారనైపోనా

వేకువనే తెలియగజేస్తూ వేగుచుక్కనేకానా

పదం మలినపడకుండా ఎదతివాచి పరిచితినే

అడుగేస్తె నొవ్వకుండా అరచేతుల నడిపితినే

ఎలా మనసైందో నీకు నన్నువంచించగా

ఎలా సిద్ధపడ్డావో మనప్రేమను త్రుంచగా


2.నీ కంటికాటుక కోసం నేను మసిగ మారానే

నీ నుదుట సింధూరంగా నా రుధిరం దిద్దానే

నా పాలిటి దేవతగా నిన్ను ఆరాధించానే

సర్వస్వం నీకేనంటూ బ్రతుకే రాసిచ్చానే

మూడునాళ్ళముచ్చటగా అనురాగం పంచావు

మనువు మాటరాగానే నిండా నను ముంచావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గేలిచేయకు ఆలినీ నీ ప్రియురాలిని

కించపరచకు ఇల్లాలిని గయ్యాళని

సహానుభూతి చెందితే సైచలేమొక లిప్తపాటు

అర్ధాంగిని తూలనాడితే ఎంతటి పొరపాటు


1.షట్కర్మలానాడు శతకోటి కర్మలతో ఇంతి ఈనాడు

మబ్బునలేచింది మొదలు అర్ధరాతిరి వరకు

ఇంటిల్లిపాదికీ వేళకవసరాలు తీర్చి

బండెడు చాకిరితో గుండెబండబారుతుంటె

హద్దులు దాటదా ఓపిక-ఒద్దికగా మెలగకుంటె

అంతరించదా ఓరిమి-వద్దన్నవి చేస్తుంటే


2.ఊడిగమే చేయగా బానిస కాదు ఊఢ

ఉన్నదా మనకడ చిరుసాయపు జాడ

హితైషిగా సతియన్నది సదా మగని నీడ

ఇంటిని తీర్చిదిద్దు కళాతపస్వి కళత్రము

సవరించకున్నమానె ఇంటిని చెఱపకే మాత్రము

మౌనమొకటె సజావైన సంసారపు మంత్రము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పసిడిదైతె మాత్రమేమి అది పంజరమే

నగిషీల సంకెళ్ళూ  స్వేఛ్ఛా పరిహరమే

అద్దాలమేడలెందుకూ ప్రేమించగ అడ్డుకుంటే

కడుపార విందులెందుకు కన్నీరు పొంగుతుంటే


1.కులమునడిగి  ఇష్టపడుట సాధ్యమా

మతమునెరిగి మనసిచ్చుట భావ్యమా

మన ప్రమేయమేలేక మనువాడుట సౌఖ్యమా

కన్నవాళ్ళ గుండెకోత మరవడమే లౌక్యమా

నొక్కబడిపోతుంది అడకత్తెరలో పోకచెక్కగా

నలిగుతుంది నెలత గానుగలో చెఱకు ముక్కగా


2.సంతానపు సంతసమే తలిదండ్రుల ప్రాథమ్యం

కూతురు సుతుల సౌభాగ్యమే శిరోధార్యం

రక్తంలో రక్తమౌ తనుజుల మీదనా తగని క్రౌర్యం

పరువు దరువు కాకూడదు ఎవరి పాడె మేళం

రాసుకోనేలా రమణితానె మరణశాసనం

ఆచితూచి అడుగేస్తే బ్రతుకు ఆనందనందనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భరతమాతకు ప్రియతములు ఇరువురు

కడుపునింపే సైరికుడు ఒకడు

కాచుచుండే సైనికుడు ఒకడు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే


1.ఎండకెండి వానలోనా నానుతారు

రాళ్ళురప్పలు ముళ్ళలోనా సాగుతారు

కర్తవ్యమె దైవమంటూ నమ్ముతారు

దేశప్రజల ఆశలెపుడు వమ్ముకానీరు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే


2.పొంచిచూసే ఇరుగుపొరుగు శత్రుమూకలు

వరదలుతూఫానులు కరువుకాటకాలు

కబళింపజూచే గుంటనక్కలు దళారీ తోడేళ్ళు

వ్యవసాయికీ సిపాయికి అనునిత్య ఘర్షణలు

కిసాను జవాను చిర స్మరణీయులే

నిత్యకృషీవలులే నిజత్యాగధనులే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలలు చెలఁగని కొలనునేను-

మధువు తరగని విరినినేను

మనసు చెదరని ధనిక నేను-

కలత నెరుగని కొమరు నేను

చిరుగాలిలా ఎదసొచ్చినావు-

భీభత్సమే మిగిలించినావు-

వంచించి నీవు

మాయనేర్చిన మారీచా నీచాతినీచా

రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా


1.కుటిల నటనలు ఏమార్చు మాటలు

వలపంటు పన్నినావే వన్నెలున్న వలలు

ఏ లక్ష్మణ రేఖసైతం ఆపలే నీ ఆగడాలు

స్నేహితులెవరైనగాని చూపలే సన్మార్గాలు

మాయనేర్చిన మారీచా నీచాతినీచా

రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా


2 బంగారు భవిష్యత్తని నమ్మబలికితివే

సింగారమె తప్పుకాదని ఒప్పించితివే

తెప్పనే తగులబెట్టి  నీవేమొ జారుకొంటివే

గుట్టునంతా రట్టుచేయగ హెచ్చరించితివే

మాయనేర్చిన మారీచా నీచాతినీచా

రచ్చచేసి చిచ్చుబెడితివి కుత్సితా తుఛ్ఛా


PIC:Sri.Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిధినిక్షేపాలెన్నో నీ చెంత నెచ్చెలి

క్షీరజలధికన్నా మిన్నగ ఓ కోమలి

మథిస్తెనే లభించేను పాలకడలి దీక్షతోని

యథేఛ్ఛాగా పొందేనునీకడ కోరిన లక్ష్యాన్ని


1.లక్షణమౌ నీలికురులే ఇంద్రనీలమణులు

కాంతులీను చక్షువులే అమూల్యమౌ మాణిక్యాలు

పరీక్షయే అక్కరలేని వజ్రమంటి నాసిక

మోక్షమే ప్రసాదించే అధరాలె పగడాలు

లక్షలు వెచ్చించినా పొందలేని ముత్యాలే దంతాలు


2.కల్పవృక్షమే నీమేను వలసిన ఫలములనొసగంగ

కామధేనువే నీ హృదయం కాంక్షలనన్నీ తీర్చంగ

 నీ పక్ష ఉచ్చైశ్రవమున దక్షతగా విహరించంగా

అక్షయమౌ అమరసుఖములే నేబడయంగా

అక్షరాలె అలిసేను నీ పసిడిపొంకాలే కొలువంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలతచెందకు ప్రియమైన భక్తా

వగపునొందకు గారాల పుత్రా

విన్నపాలే ఎరిగియుంటిని

లోపాలే సవరించుచుంటిని

సంశయాలిక వీడరా

మడమ తిప్పక సాగరా


1.కవితనొసగితి గీతినిచ్చితి

కలముతో నువుమలచగా

మనస్పూర్తిగ మురిసితి

సంగీత సాధన తెలియకున్నా

స్వరకల్పనే సాధింపజేసితి

తృప్తియన్నది లేకపోతే

నిత్యనరకమె బ్రతుకురా

ఉన్నదానితొ నందమంది

హాయిగా జీవించరా


2.గాత్రముంటే చాలునా

ఆర్తినే పలికించకుంటే

పాడగలుగుటకవధి లేదు

శ్రేష్టులెవరు సృష్టియందు

భావనకె రూపమిస్తే

ఎడదలోతున నాటదా

మనోధర్మము మేళవించగ

హృదయవీణను మీటదా

అంతరాత్మగ నేను వినెదను నమ్మరా

https://youtu.be/E1iMXSRCSI8?si=QHCrC3ae3SaQSNii

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


ఓంకారా ఝేంకారా శుభకరా శంకరా

శంభోహరా సాంబ మహాదేవా శివా

వేరే పనేమి లేదు నాకు నిను నుతియించడమే

వ్యాపకమింకేది లేదు నీకు నా అతీ గతీ గానడమే


1.గూడైనానీకు కట్టలేను పత్రిపూలు పెట్టలేను

దివ్య నాగమణులతో నిన్ను అర్చించగలేను

వేయిపంకజాలతో పూజ సలుపలేను

కన్నును పెకలించినీకు అమరించగలేను

నిను కీర్తించడమే ప్రభూ నే చేసెదను

నా ఆర్తిని బాపగా శరణము వేడెదను


2.ఘోరతపము చేయను కైలాసగిరిని మోయను

నాప్రేగులు లాగివేసి రుద్రవీణ మీట లేను

ఎదురొడ్డిపోరాడి నిన్ను మెప్పించలేను

భవబంధాలనే నాకుగా నేను తప్పించలేను

నీలీలావిలాసాల నే లిఖించెదను

నీ గుణగానమే సదా నే చేసెదను