Friday, July 23, 2021


బాసటగా నేనుంటాను

పూవుకు తీగలా ఇలా

ఆసరాగా నేనౌతాను

తీగకు  పందిరిలా సరా

నీకు తోడు నీడై చేదోడు వాదోడై

నీవెంట సాగుతా బ్రతికినంత కాలం

నిను కాచుకుంటుంటా నే కలకాలం


1.అడగాల్సన పనిలేదు 

అవసరాలు తీరుస్తాను

చెప్పాల్సిన పనిలేదు

మనసును చదివేస్తాను

ప్రాణానికి ప్రాణంగా నేను మసలుకొంటాను

స్నేహానికి స్నేహంగా నిన్ను అనుసరిస్తాను


2.మకరందం నీవైతే 

నేను మాధుర్యం

ప్రబంధమే నీవైతే 

నేను రసరమ్యం

పెనవేసుకుంది అనుబంధం మనమధ్య 

లోకమన్నది మనకికమీదట అంతా మిథ్య