Thursday, May 28, 2009

OK

 https://youtu.be/uDNJ_tNKz6k?si=QgBzzOP1FwWMU_9D

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:యమన్ కళ్యాణి

వివరించరా కృష్ణా ఎరిగించరా-
నా మార్గము నువు సవరించరా
అవతరించరా- ననువరించరా-
నా కౌగిలిలో నువుతరించరా
నాకై మరిమరి కలవరించరా- 
అనుభూతులనే పలవరించరా

1.నా పెదవి పిల్లన గ్రోవి-వద్దననెపుడూ వాయించరా/
నా కనులు విరియని కలువలు-సిద్ధమే సదా పూయించరా/
నా కౌగిలిలో నువుతరించరా/
నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

2. నామెడ వంపు- ఎంతో ఇంపు-నీ ఊపిరితో అలరించరా/
నాజూకు నా నడుము నీ పిడికిట ఇముడు-
అరచేతితోయత్నించరా/
నా కౌగిలిలో నువుతరించరా/
నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

3. నాభికి తోడైతె నీ నాసిక-ఆనందముతో జలదరించురా/
నువు సేదదీరగ నామేనే పరుపు-పవళించి  పరవశించరా/
నా కౌగిలిలో నువుతరించరా/
నాకై మరిమరి కలవరించరా- అనుభూతులనే పలవరించరా

https://youtu.be/gCycWJkzwFg

నీ
పాదాల జన్మించిన సురగంగనూ
హరీ పంపరా తీర్చగ మా దప్పిక బెంగనూ
తలపైన కొలువైన శివగంగనూ
అందించరా శివా ఎప్పటికీ మా కరువు దీరనూ ||నీ ||

1. పాపాలను బాపేటి లోకపావని
దాహాలను తీర్చేటి మందాకిని
భువికే దిగి వచ్చిన భాగీరథి
తరగని విధి తరలించర విష్ణుపది
అడగము మిము వరములు ఈనాటితో
కడిగేము మీ పదములు కన్నీటితో

2. నీరంటే నీకెంత ఇష్టమో కదా
తేలియాడేవు నీవు కడలిపైననే సదా
మామగారంటె మరిమరి ప్రేమేమో మరి
ఇల్లరికంతోనే నీవు పొందావు సిరిగురి
నీ చుట్టూ నీరుంచుకుంటె సరిపోతుందా
కాసిన్ని మాకిస్తే మామసొమ్ము తరుగుతుందా

3. అభిషేకం అత్యంత నీకిష్టమనే కదా
నీ శిరసున గంగమ్మకు స్థలమిచ్చావు
గిరిజమ్మ కినుక నీవు తీర్చడానికే కదా
మామ గారింటిలోనె మకాంవేసినావు
నీ చుట్టూ నీరుంచుకుంటె సరిపోతుందా
కాసిన్ని మాకిస్తే మామసొమ్ము తరుగుతుందా
మా యమ్మ సొమ్ము తరుగుతుందా

OK